2024-25లో రిక్రూట్‌మెంట్ కార్యకలాపాలలో కొత్త పొజిషన్‌లను దాఖలు చేయడంపై దృష్టి పెట్టాలని సర్వేలు చెబుతున్నాయి. కొత్త ఉగ్యగాల భర్తీ కోసం అనుభవం, ప్రతిభ ఉన్న వారికే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని స్టాఫింగ్ సొల్యూషన్స్ అండ్ హెచ్‌ఆర్ సర్వీసెస్ ప్రొవైడర్ జీనియస్ కన్సల్టెంట్స్ హైరింగ్, కాంపెన్సేషన్ & అట్రిషన్ మేనేజ్‌మెంట్ రిపోర్ట్ వెల్లడించింది.
పరిశ్రమల భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా కొత్త పాత్రలను సృష్టించడం ద్వారా వృద్ధి, ఆవిష్కరణలను అభివృద్ధి చేయడం ప్రాథమిక లక్ష్యం.. అని జీనియస్ కన్సల్టెంట్స్ సీఎండీ ఆర్పీ యాదవ్ పేర్కొన్నారు. నియామకాలలో 4 నుంచి 8 సంవత్సరాలు అనుభవం ఉన్నవారికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. 32 శాతం అనుభవం ఉన్నవారికే కొత్త ఉద్యోగాల్లో అవకాశాలు ఉంటాయి.
1 నుంచి 4 సంవత్సరాలు అనుభవం ఉన్న వారిని 26 శాతం, ఫ్రెషర్‌లను కేవలం 15 శాతం మాత్రమే రిక్రూట్ చేసుకునే అవకాశం ఉందని సమాచారం. తాత్కాలిక నియమాలు 27 శాతం, 25 శాతంతో ఫిక్స్‌డ్ టర్మ్ కాంట్రాక్టు నియామకం, 24 శాతం గిగ్ స్టాఫ్ నియామకాలు ఉంటాయని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment