Hiring activity
-
ఫ్రెషర్లకు పిడుగులాంటి వార్త!.. కొత్త ఉద్యోగాల్లో..
2024-25లో రిక్రూట్మెంట్ కార్యకలాపాలలో కొత్త పొజిషన్లను దాఖలు చేయడంపై దృష్టి పెట్టాలని సర్వేలు చెబుతున్నాయి. కొత్త ఉగ్యగాల భర్తీ కోసం అనుభవం, ప్రతిభ ఉన్న వారికే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని స్టాఫింగ్ సొల్యూషన్స్ అండ్ హెచ్ఆర్ సర్వీసెస్ ప్రొవైడర్ జీనియస్ కన్సల్టెంట్స్ హైరింగ్, కాంపెన్సేషన్ & అట్రిషన్ మేనేజ్మెంట్ రిపోర్ట్ వెల్లడించింది.పరిశ్రమల భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా కొత్త పాత్రలను సృష్టించడం ద్వారా వృద్ధి, ఆవిష్కరణలను అభివృద్ధి చేయడం ప్రాథమిక లక్ష్యం.. అని జీనియస్ కన్సల్టెంట్స్ సీఎండీ ఆర్పీ యాదవ్ పేర్కొన్నారు. నియామకాలలో 4 నుంచి 8 సంవత్సరాలు అనుభవం ఉన్నవారికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. 32 శాతం అనుభవం ఉన్నవారికే కొత్త ఉద్యోగాల్లో అవకాశాలు ఉంటాయి.1 నుంచి 4 సంవత్సరాలు అనుభవం ఉన్న వారిని 26 శాతం, ఫ్రెషర్లను కేవలం 15 శాతం మాత్రమే రిక్రూట్ చేసుకునే అవకాశం ఉందని సమాచారం. తాత్కాలిక నియమాలు 27 శాతం, 25 శాతంతో ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్టు నియామకం, 24 శాతం గిగ్ స్టాఫ్ నియామకాలు ఉంటాయని తెలుస్తోంది. -
ఉద్యోగాలపై ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్! తాజా రిపోర్ట్ ఏం చెబుతోంది?
ముంబై: ఉద్యోగ మార్కెట్‌పై జూన్ త్రైమాసికం(క్యూ1)లో ద్రవ్యోల్బణ ప్రభావం ఏమీ లేదని ఇండీడ్ ఇండియా క్వార్టర్లీ హైరింగ్ ట్రాకర్ నివేదిక తెలిపింది. తమ నియామకాలు, ఉద్యోగుల వేతనాలపై ద్రవ్యోల్బణం ప్రభావం లేదని 89 శాతం కంపెనీలు చెప్పాయి. ఉద్యోగార్థుల్లో ప్రతి 10 మందికి గాను ఆరుగురు తమపై ద్రవ్యోల్బణ ప్రభావం లేదని చెప్పినట్టు ఇండీడ్ తన నివేదికలో తెలిపింది. 1,229 ఉద్యోగ సంస్థలు, 1,508 మంది ఉద్యోగుల అభిప్రాయాలను ఇండీడ్ పరిగణనలోకి తీసుకుంది. ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో కంపెనీల ఉద్యోగ నియామకాల్లో 29 శాతం వృద్ధి నమోదైంది. అంతక్రితం మార్చి త్రైమాసికంలో వృద్ధి 20 శాతాన్ని మించింది. 37 శాతం మంది ఉద్యోగార్థులు ఉద్యోగం కోసం చూడడం లేదంటే సంస్థను మార్చాలని అనుకుంటున్నట్టు చెప్పారు. ఇది మార్చి త్రైమాసికంలో 46 శాతంగా ఉంది. ఐటీ, హెల్త్‌కేర్, ఈకామర్స్ ఇక ముందూ వృద్ధిని చూపిస్తాయని.. 5జీ రాకతో రానున్న త్రైమాసికాల్లో టెలికంలోనూ ఉద్యోగ నియామకాలు పెరుగుతాయని ఇండీడ్ నివేదిక అంచనా వేసింది. ఫుల్‌టైమ్ కోరుకునే వారు 63 శాతం మంది ఉద్యోగాలు కోరుకునే వారిలో 63 శాతం మంది ఫుల్‌టైమ్ పనికోసం చూస్తున్నారు. పార్ట్‌టైమ్ పనిని కోరుకునే వారు 26 శాతంగానే ఉన్నారు. ఇక కాంట్రాక్టు ఉద్యోగాల కోసం చూస్తున్నవారు 11 శాతంగా ఉన్నారు. జూన్ త్రైమాసికంలో 19 శాతం కంపెనీలు కాంట్రాక్టు ఉద్యోగులను నియమించుకున్నాయి. ఐటీ/ఐటీఈఎస్ రంగం ఎక్కువ మందికి ఉపాధినిచ్చింది. ఈ రంగంలో 91 శాతం కంపెనీలు జూన్ క్వార్టర్లో నియమకాలు చేపట్టాయి. మార్చి త్రైమాసికంలో 83 శాతం కంపెనీలే నియామకాలు చేపట్టడం గమనార్హం. -
ఈలాన్ మస్క్ మరో సంచలనం: షాక్‌లో ఉద్యోగులు
శాన్ఫ్రాన్సిస్కో: ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా చీఫ్ ఈలాన్ మస్క్ మరోసారి సంచలచన వ్యాఖ్యలు చేశారు. ఇక వర్క్ ఫ్రం హోం ఇక చాలు.. ఆఫీసులకు రండి.. లేదంటే కంపెనీని వీడండి అంటూ తన ఉద్యోగులకు షాకిచ్చిన మస్క్ తాజాగా మరో షాకింగ్ న్యూస్ చెప్పారు. ప్రస్తుత తరుణంలో ఆర్థికవ్యవస్థపై "సూపర్ బ్యాడ్ ఫీలింగ్" ఉందని, ఈ నేపథ్యంలో దాదాపు 10శాతం సిబ్బందిని తగ్గించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఉద్యోగులకు అంతర్గత మెయిల్స్ ద్వారా సమాచారం ఇచ్చినట్టు రాయిటర్స్ పేర్కొంది. అంతేకాదు ‘‘ప్రపంచవ్యాప్త నియామకాలన్నింటినీ నిలిపివేయండి’’ అంటూ టెస్లా ఎగ్జిక్యూటివ్‌లకు మస్క్ నిన్న (గురువారం) ఈ ఇమెయిల్ పంపినట్టు తెలుస్తోంది. అయితే దీనిపై టెస్లా ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. కాగా ఇంటినుంచి పనిచేస్తున్న టెస్లా ఉద్యోగులు ఆఫీసులకు తిరిగి రావాలని లేదా ఉద్యోగాలు మానెయ్యొచ్చని పేర్కొన్నారు. టెస్లాలో ప్రతి ఒక్కరూ వారానికి కనీసం 40 గంటలు కార్యాలయంలోనే పనిచేయాల్సి ఉంటుందని మస్క్ ఉద్యోగులకు పంపిన ఈమెయిల్లో ఆదేశించారు. లేదంటే రిజైన్ చేసినట్టుగా భావిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. -
ఫ్రెషర్లవైపే కంపెనీల మొగ్గు.. మార్చిదాకా నియామకాల జోరు..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా జనవరి–మార్చిలో నియామకాల జోరు ఉంటుందని టీమ్‌లీజ్ వెల్లడించింది. వ్యాపార కార్యకలాపాలపై కఠినమైన ఆంక్షలు లేనట్టయితే కార్పొరేట్ కంపెనీల నియామకాల్లో గణనీయమైన వృద్ధి ఉంటుందని తెలిపింది. 21 రంగాల వారీగా 14 నగరాల్లోని 829 చిన్న, మధ్య, భారీ స్థాయి కంపెనీల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా రూపొందిన టీమ్‌లీజ్ ఎంప్లాయ్మెంట్ ఔట్లుక్ రిపోర్ట్ ప్రకారం.. నియామకాలు చేపట్టాలన్న కంపెనీల ఆలోచన ప్రస్తుత త్రైమాసికంలో 9 శాతం పాయింట్ల వరకు పెరగవచ్చు. కోవిడ్ వ్యాప్తి చెందినప్పటి నుండి నియామక ఉద్దేశంలో నమోదయ్యే అత్యధిక వృద్ధి ఇదే. సమీక్షించిన 21 రంగాల్లో ఏడు 10 శాతంపైగా పాయింట్లు సాధించే అవకాశం ఉంది. 17 రంగాలు 5 శాతంపైగా పాయింట్లను దక్కించుకోనున్నాయి. క్రితం త్రైమాసికంతో పోలిస్తే 11 రంగాలు రికవరీని ప్రదర్శిస్తాయి. ఐటీ కంపెనీలే ముందంజ.. మహమ్మారి కారణంగా ఏర్పడిన సరఫరా అంతరాయాలను ఎదుర్కోవడానికి మెరుగైన సామర్థ్య వినియోగం, ప్రైవేట్ పెట్టుబడుల పెరుగుదల, అధికమవుతున్న ఎగుమతులు.. వెరశి ఉద్యోగాల జోరును వేగవంతం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఐటీ పనితీరు, సాంకేతికత అనుసంధాన సంస్థలు ఉద్యోగ కల్పనలో ఆధిపత్యాన్ని కొనసాగిస్తాయి. 89 శాతం ఐటీ కంపెనీలు నిపుణులను చేర్చుకునేందుకు ఆసక్తిగా ఉన్నాయి. విద్యా రంగంలో 80 శాతం, ఆరోగ్య, ఫార్మా 71, ఈ–కామర్స్, టెక్నాలజీ స్టార్టప్స్‌లో 69 శాతం కంపెనీలు కొత్తగా ఉద్యోగావకాశాలు కల్పించేందుకు సుముఖంగా ఉన్నాయి. తదుపరి లాక్డౌన్లు విధించకపోతే ఇతర రంగాలు సైతం నియామకాలను చేపడతాయి. ఇదే సరైన సమయం.. నిపుణులైన మానవ వనరులకు ఇది సరైన సమయం. ప్రస్తుత త్రైమాసికంలో 2–5 సంవత్సరాల అనుభవం ఉన్న జూనియర్ స్థాయి నిపుణులకు బదులుగా ఫ్రెషర్లను నియమించుకోవడంపై కంపెనీలు దృష్టి సారించనున్నాయి. జూనియర్ టాలెంట్‌ను రిక్రూట్ చేసుకోవడానికి 46 శాతం కంపెనీలు ఆసక్తిగా ఉన్నాయి. డిసెంబర్ త్రైమాసికంతో పోలిస్తే జనవరి–మార్చిలో అట్రిషన్ వేగంగా పెరగనుంది. ఐటీ, విద్య సేవలు, హెల్త్‌కేర్, ఫార్మా, నాలెడ్జ్ ప్రాసెస్ ఔట్సోర్సింగ్ రంగాల్లో 8 శాతంపైగా అట్రిషన్ నమోదు కానుంది. అన్ని రంగాలు క్రితం త్రైమాసికంలో కంటే అధిక అట్రిషన్ రేట్లను కలిగి ఉండనున్నాయి. ఉద్యోగి దృక్పథం, పని విధానంలో మార్పు దీనికి కారణాలు అని టాలెంట్ అక్విజిషన్ అనలిస్ట్ రేచల్ స్టెల్లా రాజ్ తెలిపారు. చదవండి: సీఎంఎస్ ఇన్ఫోలో మహిళా డైరెక్టర్లు -
భారీగా ఉద్యోగాలు, ఈ రేంజ్లో శాలరీలు ఎప్పుడు ఇవ్వలేదేమో!
నిరుద్యోగులకు శుభవార్త. కరోనా కారణంగా నిలిపివేసిన ఉద్యోగాల నియామకాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రోతో పాటు ఇతర సాఫ్ట్ వేర్ కంపెనీలు భారీ ఎత్తున నియామకాలు చేపట్టనున్నట్లు కొన్ని రిపోర్ట్లు వెలుగులోకి వచ్చాయి. 2020 గణాంకాల ప్రకారం..కోవిడ్ కారణంగా ఇండియాలో 12.2 కోట్ల మంది ఉద్యోగులు ఉపాధి కోల్పోయారు. అయితే ఇప్పుడు పరిస్థితులు చక్కబడ్డాయి. ఇప్పటి వరకు ఉద్యోగుల నియామకాల్ని నిలిపివేసిన సంస్థలు తిరిగి.. ఉద్యోగుల ఎంపికలో నిమగ్నమయ్యాయి. దాదాపు ఒకటిన్నర సంవత్సరం తరువాత దేశంలో థర్డ్ వేవ్ రూపంలో కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తుందనే వార్తలు వస్తున్నా..పలు సెక్టార్లకు చెందిన సంస్థలు భారీ ఎత్తున నియామకాలు చేపట్టనున్నట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. గత కొద్ది కాలంగా కరోనా ఇండియన్ జాబ్ మార్కెట్ పై ఎలాంటి ప్రభావం చూపుతుందోనన్న అంశంపై విశ్లేషణ చేస్తున్న జాబ్ సైట్ ఇండీడ్ రిపోర్ట్ ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. టెక్ ఉద్యోగాలకు భారీ డిమాండ్ ప్రస్తుతం జాబ్ మార్కెట్లో టెక్ ఉద్యోగాలకు భారీ డిమాండ్ ఉన్నట్లు ఇండీడ్ తెలిపింది. 400శాతం వరకు సాఫ్ట్ వేర్ ఉద్యోగుల డిమాండ్ పెరిగినట్లు ఇండీడ్ తన రిపోర్ట్‌లో పేర్కొంది. లింక్డ్ఇన్ జాబ్ కోసం అప్లయ్ చేస్తే టెక్ ఉద్యోగాలకు ఏ విధమైన డిమాండ్ ఉందో తెలుస్తోందని చెప్పింది. అంతేకాదు 2020లో మహమ్మారి ప్రారంభంలో పలు రంగాల్లో అనిశ్చితి నెలకొందని, జూన్ 2020లో కరోనా ఫస్ట్ వేవ్ గరిష్ట స్థాయికి చేరడానికి కొన్ని నెలల ముందు ఉద్యోగుల నియామకం 50 శాతం తగ్గినట్లు వెల్లడించింది. వీటితో పాటు అప్లికేషన్ డెవలపర్, లీడ్ కన్సల్టెంట్, సేల్స్‌ఫోర్స్ డెవలపర్,సైట్ రిలయబిలిటీ ఇంజనీర్ వంటి టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న జాబ్స్‌కు డిమాండ్ 150-300 శాతం మధ్య పెరిగింది. 70-120 శాతం జీతాల పెంపు సంస్థలు ఉద్యోగుల్ని నియమించడమే కాదు. గతేడాదితో పాలిస్తే ఇప్పుడు భారీ ఎత్తున జీతాలు ఇస్తున్నాయి.ఉద్యోగులు ఎక్కువ జీతాలు ఆశించడమే కాదు..అదే స్థాయిలో కంపెనీలు శాలరీలు ఇచ్చేందుకు వెనకడుగు వేయడంలేదు.పుల్ స్టాక్ ఇంజనీర్లకు కంపెనీలు 70-120 శాతం వరకు జీతాలు పెంచుతున్నాయని నివేదికలో పొందుపరిచింది. ఇక మిగిలిన రంగాలకు చెందిన ఉద్యోగుల జీతాల పెంపు 20-30 శాతంగా ఉంది. ఉద్యోగులకు ఇదే మంచి సమయం ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) కెరీర్ గ్యాప్ తర్వాత ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న మహిళా నిపుణుల కోసం అతిపెద్ద రిక్రూట్మెంట్ డ్రైవ్‌ను ప్రారంభించినట్లు ఇటీవల ప్రకటించింది. టీసీఎస్‌తో పాటు ఇన్ఫోసిస్, విప్రో కంపెనీలు దేశం అంతా టెక్ ఉద్యోగుల్ని భారీ ఎత్తున రిక్రూట్ చేసుకుంటున్నాయి. కొత్త ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న, మంచి ఉద్యోగం కావాలనుకునే అభ్యర్ధులకు నైపుణ్యాలు ఉంటే ఇదే మంచి సయమం. బెంగుళూరు, హైదరాబాద్, చెన్నై వంటి ఐటి నగరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకునే అవకాశం ఉందని ఇండీడ్ తన నివేదికలో స్పష్టం చేసింది. చదవండి: నియామకాలు పెరుగుతున్నాయ్, ఆ రంగాలే కీలకం -
నియామకాల జోరు: ఐటీ టాప్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో నియామకాల జోరు మొదలైంది. మే నెలతో పోలిస్తే జూన్‌లో రిక్రూట్మెంట్ 15 శాతం పెరిగిందని నౌకరీ జాబ్ స్పీక్ నివేదిక వెల్లడించింది. నౌకరీ.కామ్‌లో మే నెలలో జాబ్ పోస్టింగ్స్ 2,049 నమోదైతే, జూన్‌లో ఇది 2,350 ఉందని తెలిపింది. ‘ఐటీ-సాఫ్ట్వేర్, సాఫ్ట్వేర్ సర్వీసెస్ రంగాల కారణంగా ఈ స్థాయి వృద్ధి నమోదైంది. ఏప్రిల్‌లో 15 శాతం తిరోగమనం చెందిన నేపథ్యంలో మార్కెట్ నిలదొక్కుకోవడంతోపాటు రికవరీకి ఇది నిదర్శనం. సవాళ్ల నుంచి బయటపడేందుకు కంపెనీలకు ఐటీ వినియోగానికి డిమాండ్ పెరిగింది. ఐటీ సాఫ్ట్వేర్, సాఫ్ట్వేర్ సర్వీసుల రంగం జూన్‌లో 5 శాతం దూసుకెళ్లింది. కోవిడ్-19 ముందస్తు కాలం 2019 జూన్‌తో పోలిస్తే ఈ రంగం అత్యధికంగా గత నెలలో 52 శాతం వృద్ధి సాధించింది. రిటైల్, యాత్రలు, ఆతిథ్య రంగం సైతం మెరుగ్గా పనితీరు కనబరుస్తోంది. హోటల్స్, రెస్టారెంట్స్, ఎయిర్‌లైన్స్, ట్రావెల్ విభాగాలు 87 శాతం, రిటైల్‌లో 57, బీమా 38, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సేవలు 29, ఫార్మా, బయోటెక్ 22, ఎఫ్ఎంసీజీ 22, విద్యా బోధన 15, బీపీవో, ఐటీఈఎస్‌లో 14 శాతం నియామకాలు అధికమయ్యాయి. రిక్రూట్మెంట్ హైదరాబాద్, పుణే 10 శాతం, బెంగళూరు 4 శాతం పెరిగింది. మె నెలలో తిరోగమన బాట పట్టిన ఢిల్లీ/ఎన్సీఆర్ 26 శాతం, కోల్‌కత 24 శాతం వృద్ధి నమోదు చేశాయి’ అని నివేదిక వివరించింది. -
కోలుకుంటున్న మెట్రో నగరాలు..!
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ మహమ్మారి ప్రభావం నుంచి మెట్రో నగరాలు క్రమంగా కోలుకుంటున్నాయి. కరోనా క్రీనీడ నుంచి బయటపడుతున్నాయి. కరోనా వైరస్ ఉధృతి ఉన్న గత నెలలతో పోల్చితే అక్టోబర్‌లో మెట్రోనగరాల్లో జాబ్ పోస్టింగ్‌లు, ఉద్యోగ అవకాశాలు సంబంధిత కార్యకలాపాలు (హైరింగ్ యాక్టివిటీస్) ఐదు శాతానికిపైగా పెరిగినట్టు జాబ్ పోర్టల్ ‘స్కై కీ’(ఎస్సీఐ కేఈవై) తాజా నివేదికలో వెల్లడైంది. పండుగల సీజన్‌తోపాటు కోవిడ్ పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నా భారత్‌లోని మెట్రో నగరాల్లో హైరింగ్ యాక్టివిటీస్, జాబ్ పోస్టింగ్‌లు సెపె్టంబర్‌తో పోల్చితే అక్టోబర్‌లో 5.55 శాతం పెరిగినట్టు ఈ నివేదికలో పేర్కొన్నారు. దేశంలోని వివిధ రంగాలు నెమ్మదిగా పట్టాలెక్కి కరోనాకు పూర్వస్థితిని చేరుకునే దిశగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో హైరింగ్ యాక్టివిటీస్ ఏ నెలకు ఆ నెలకు పెరుగుతూ వస్తున్నట్టు, రాబోయే నెలల్లో ఇది మరింత పుంజుకోనున్నట్టు ‘స్కై కీ’సహ వ్యవస్థాపకుడు అక్షయ్ శర్మ స్పష్టం చేశారు. పుంజుకుంటున్న ఐటీ రంగం కోవిడ్ మహమ్మారి కాలంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) రంగం మరింత పుంజుకుంటోంది. ఈ రంగంలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన జాబ్ పోస్టింగ్‌లు పెరుగుతున్నాయి. సుదీర్ఘ లాక్డౌన్ విధింపు కారణంగా ఐటీ సెక్టార్‌తోపాటు దాదాపుగా అన్ని రంగాల్లో ‘వర్క్ ఫ్రం హోం’ పనివిధానాన్ని ప్రవేశపెట్టడం కూడా ఐటీ, దాని ఆధారిత సేవల రంగానికి ప్రాధాన్యత పెరిగింది. ప్రధానంగా టెలికం సెక్టార్లో హైరింగ్ యాక్టివిటీస్ పెరగడానికి ఇంటి నుంచి పనిచేసే పద్ధతి దోహదపడినట్టు ఈ రిపోర్ట్ తెలిపింది. సేల్స్, స్ప్రింగ్, ఇంటర్ పర్సనల్ కమ్యూనికేషన్స్, ఆటోమేషన్ టెస్టింగ్, మైక్రో సర్వీసెస్‌లలో జాబ్ పోస్టింగ్స్ అవకాశాలు వృద్ధి చెందినట్టు ఈ నివేదిక వెల్లడించింది. (చదవండి: నిరుద్యోగ యువతకు ఊరట..) ముందంజలోని రంగాలు ఇవే... రంగాలవారీగా చూస్తే వివిధ రంగాలకు సంబంధించి సెప్టెంబర్, అక్టోబర్లలో హైరింగ్ యాక్టివిటీస్ గణనీయంగా పెరిగాయి. ఈ కామర్స్, ఫార్మాసూటికల్స్, ప్యాకేజింగ్, టెలికాం, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, డేటా అనలిటిక్స్, కన్సల్టింగ్, ఐటీ సర్వీసెస్, రెన్యువబుల్ ఎనర్జీ, హాస్పాటాలిటీతోపాటు బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సురెన్స్ రంగాలు ఉద్యోగ అవకాశాల కల్పన, హైరింగ్ యాక్టివిటీస్‌లో అగ్రభాగాన ఉన్నట్టుగా ‘స్కై కీ’నివేదిక స్పష్టం చేసింది. -
జులైలో పుంజుకున్న నియామకాలు
ముంబై : లాక్డౌన్ సడలింపులు, కీలక పరిశ్రమలు తెరుచుకోవడంతో భారత్‌లో నియామకాల ప్రక్రియ ఊపందుకుందని నౌకరీ జాబ్స్సీక్ పేర్కొంది. జులైలో దేశవ్యాప్తంగా హైరింగ్ ప్రక్రియ అంతకుముందు నెలతో పోలిస్తే 5 శాతం పెరిగిందని వెల్లడైంది. జులైలో నియామకాలు అధికంగా మీడియా, ఎంటర్టైన్మెంట్ రంగంలో 36 శాతం, హెచ్ఆర్లో 37 శాతం, నిర్మాణ ఇంజనీరింగ్ రంగాల్లో 27 శాతంగా ఉన్నాయని తెలిపింది. బీఎఫ్ఎస్ఐ పరిశ్రమలో 16 శాతం, ఆటోమొబైల్స్‌లో 14 శాతం, టెలికాం పరిశ్రమలో 13 శాతం మేర హైరింగ్ ప్రక్రియలో వృద్ధి నమోదైంది. ఐటీ హార్డ్‌వేర్ రంగంలో 9 శాతం మేర హైరింగ్ ప్రక్రియ జరగ్గా, ఐటీ సాఫ్ట్‌వేర్‌లో ఎలాంటి హైరింగ్ జోరూ కనిపించలేదని నౌకరీ జాబ్‌స్పీక్ పేర్కొంది. అయితే విద్యా బోధనా రంగంలో -22 శాతం, ఆతిథ్య రంగంలో -5 శాతం, రిటైల్‌లో -2 శాతం మేర హైరింగ్ ప్రక్రియలో క్షీణత నమోదైంది. ఇక మెట్రో నగరాల విషయానికి వస్తే ఢిల్లీలో అత్యధికంగా హైరింగ్ ప్రక్రియ 10 శాతం వృద్ధి చెందగా తర్వాతి స్ధానాల్లో వరుసగా ముంబై (8శాతం), చెన్నై(4 శాతం) నిలిచాయి. బెంగళూర్, కోల్‌కతాలో నియామకాలు 4 శాతం తగ్గడం గమనార్హం. ఇక మెట్రోలతో పోలిస్తే ద్వితీయ శ్రేణి నగరాలు జైపూర్, వదోదర, చండీగఢ్‌లో భారీగా నియామకాలు వృద్ధి చెందాయి. జైపూర్‌లో హైరింగ్ ప్రక్రియ 40 శాతం పెరగ్గా, వదోదరాలో నియామకాల్లో 35 శాతం వృద్ధి నమోదైంది. జులైలో అంతకుముందు నెలలతో పోలిస్తే నియామకాల ప్రక్రియ ఊపందుకుందని రిక్రూట్మెంట్, మీడియా, వినోద రంగం, నిర్మాణ రంగాల్లో సాధారణ పరిస్ధితి తిరిగి నెలకొంటోందని నౌక్రీ.కాం చీఫ్ బిజినెస్ ఆఫీసర్ పవన్ గోయల్ పేర్కొన్నారు. తయారీ, నిర్వహణ, ఫార్మా, మీడియా, మార్కెటింగ్, ప్రకటనలు, సేల్స్ రంగాల్లో నియామకాలు ఊపందుకోగా, ఆతిథ్య, బోధన రంగాల్లో నియామకాలు ఇంకా పుంజుకోలేదని వివరించారు. చదవండి : ఊరట : జనవరి నుంచి కొలువుల సందడి -
ఊరట : జనవరి నుంచి కొలువుల సందడి
బెంగళూర్ : కోవిడ్-19 ప్రభావంతో కుదేలైన నియామకాల ప్రక్రియ వచ్చే ఏడాది జనవరి నుంచి ఊపందుకుంటుందని రిక్రూట్మెంట్ సంస్థ కెరీర్‌నెట్ కన్సల్టింగ్ సంస్థ పేర్కొంది. కరోనా వైరస్ వ్యాప్తితో క్యాంపస్ నియామకాలూ నిలిచిపోయాయని, హైరింగ్ ప్రక్రియ వేగవంతం కావడానికి ఆరు నెలల సమయం పడుతుందని తెలిపింది. కరోనా కారణంగా నియామకాలను నిలిపివేసిన కంపెనీలు కూడా ఆరు నెలల తర్వాత చురుకుగా హైరింగ్ చేపడతామని పేర్కొన్నాయి. తమ సర్వేలో పాల్గొన్న కంపెనీల్లో 43 శాతం కంపెనీలు వచ్చే ఏడాది జనవరిలో నియామకాలకు వెళతామని వెల్లడించాయని కెరీర్‌నెట్ పేర్కొంది. 2021 ఏప్రిల్ నాటికి కోవిడ్-19కు ముందున్న పరిస్థితి నెలకొంటుందని కెరీర్‌నెట్ సహవ్యవస్ధాపకులు అన్షుమన్ దాస్ అంచనా వేశారు. మరోవైపు క్యాంపస్ నియామకాలు కొంతమేర తగ్గే అవకాశాలున్నాయని వెల్లడైంది. ఈ ఏడాది క్యాంపస్ రిక్రూట్మెంట్కు వెళ్లే ఆలోచనలేదని 27 శాతం కంపెనీలు పేర్కొనగా, 39 శాతం కంపెనీలు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపాయి. కెరీర్‌నెట్ నివేదిక ప్రకారం కేవలం 30 శాతం కంపెనీలే ఈ ఏడాది క్యాంపస్ రిక్రూట్మెంట్కు వెళతామని వెల్లడించాయి. ఈ ఏడాది ఇప్పటికే క్యాంపస్ హైరింగ్ వాయిదా పడిందని, ఆర్థిక వ్యవస్థ గాడినపడితే కంపెనీలు తమ హైరింగ్ ప్రణాళికలను ముమ్మరం చేస్తాయని దాస్ పేర్కొన్నారు. స్టార్టప్‌లపై కోవిడ్-19 ప్రభావం చూపుతుండగా, ఐటీ కంపెనీల్లో మాత్రం వేచిచూసే ధోరణి కనిపిస్తోంది. దిగ్గజ ఐటీ కంపెనీల్లో నాలుగింట మూడు సంస్ధలు గతంలో తాము ఇచ్చిన ఆఫర్లకు కట్టుబడి ఉంటామని తెలిపాయని ఈ సర్వే పేర్కొంది. చదవండి : కోవిడ్ 19 : ఎంఐటీ సర్వేలో షాకింగ్ వివరాలు -
ఐటీ, వైద్య సేవల్లో జోరుగా హైరింగ్..
సాక్షి, న్యూఢిల్లీ : కోవిడ్-19 ప్రభావంతో పలు రంగాల్లో నియామకాలు భారీగా పడిపోయినా ఐటీ, వైద్య సేవలు, మార్కెటింగ్ రంగాల్లో హైరింగ్ ఊపందుకుంది. డెలివరీ, ఐటీ మేనేజర్ల నియామకాలు కూడా ప్రోత్సాహకరంగా సాగాయి. ప్రపంచవ్యాప్తంగా పలు కంపెనీలు ఉద్యోగులపై వేటు వేయడం, నియామకాలను నిలిపివేస్తున్న పరిస్థితుల్లోనూ భారత్‌లో హైరింగ్ ప్రక్రియ పెద్దగా దెబ్బతినలేదని ఓ నివేదిక వెల్లడించింది. మార్చి రెండో వారం వరకూ నియామకాలు గత ఏడాది తరహాలోనే సాగాయని, మార్చి ద్వితీయార్ధం నుంచి ఏప్రిల్, మే వరకూ లాక్డౌన్ల ప్రభావంతో మందగించాయని అంతర్జాతీయ జాబ్ సైట్ ఇండీడ్ నివేదిక తెలిపింది. జూన్‌లో ఇండీడ్ జాబ్ పోస్టింగ్స్ గత ఏడాదితో పోలిస్తే 51 శాతం తగ్గాయని, బ్రిటన్‌లో 60 శాతం, మెక్సికో, ఇతర యూరప్ దేశాల్లో 61 శాతం మేర తగ్గాయని నివేదిక పేర్కొంది. అయితే అమెరికాలో మాత్రం జాబ్ పోస్టింగ్స్ కేవలం 29 శాతం, సింగపూర్‌లో 32 శాతం, ఆస్ర్టేలియాలో 42 శాతం మేర తగ్గాయని పేర్కొంది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలపై కోవిడ్-19 ప్రభావం ప్రారంభమైన ఫిబ్రవరి నుంచి మే వరకూ ఇండీడ్ వేదికపై అందుబాటులో ఉన్న డేటా ఆధారంగా ఈ నివేదిక రూపొందింది. కోవిడ్-19 ప్రభావంతో అత్యధికంగా చైల్డ్‌కేర్, ఆహార తయారీ రంగాల్లో 78 శాతం మేర జాబ్ పోస్టింగ్స్ తగ్గాయని, టూరిజం, ఆతిథ్య రంగాల్లో 77 శాతం, శానిటేషన్‌లో 74 శాతం చొప్పున జాబ్ లిస్టింగ్స్ తగ్గాయని నివేదిక తెలిపింది. చదవండి : ‘మహమ్మారిని ఆ దేవుడే పంపాడు’ -
గుడ్‌న్యూస్ : ఆ కంపెనీలో 1460 మందికి ఉద్యోగాలు
సాక్షి, న్యూఢిల్లీ : కోవిడ్-19 ప్రభావంతో అనిశ్చితి వెంటాడుతున్నా విస్తరణ ప్రణాళికలతో ముందుకెళ్లాలని గోల్డ్‌మన్ శాక్స్ గ్రూప్ నిర్ణయించింది. ఎంపిక చేసిన 1460 మంది భారత గ్రాడ్యుయేట్లను ఈ వేసవిలో విధుల్లోకి తీసుకునేందుకు మొగ్గుచూపింది. 1460 మంది భారత గ్రాడ్యుయేట్లలో సగం మందిని బెంగళూర్‌లోని బ్యాంక్ టెక్నాలజీ సెంటర్లో పూర్తికాలపు ఉద్యోగాల్లో తీసుకుంటామని, మిగిలిన వారిని ఇంటర్న్‌షిప్‌కు అనుమతిస్తామని గోల్డ్‌మన్ శాక్స్ బ్యాంక్ భారత్ చీఫ్ గుంజన్ సంతానీ తెలిపారు. బెంగళూర్‌లోని గోల్డ్‌మన్ టెక్నాలజీ సెంటర్ ప్రపంచంలోనే ఆ సంస్థకు రెండో అతిపెద్ద కేంద్రం కావడం గమనార్హం. కాగా, లాక్డౌన్ ముగిసిన అనంతరం సంస్థ సిబ్బందిలో 40 నుంచి 50 శాతం ఉద్యోగులను విధుల్లోకి అనుమతించాలని సంతానీ యోచిస్తున్నామని చెప్పారు. కరోనా కలకలంతో దేశీయ, విదేశీ కంపెనీలు, టెక్నాలజీ, బ్యాంకింగ్ దిగ్గజాలు ఉద్యోగులకు ఇచ్చిన ఆఫర్లను ఉపసంహరించుకుంటున్న క్రమంలో గోల్డ్‌మన్ శాక్స్ గ్రూప్ హైరింగ్ ప్రణాళికలతో ముందుకు వెళ్లడం సానుకూల పరిణామంగా భావిస్తున్నారు. చదవండి : లాక్డౌన్ వేళ ఉద్యోగులకు జొమాటో షాక్ -
నియామకాలపై కోవిడ్-19 ఎఫెక్ట్
ముంబై : కోవిడ్-19ను ఎదుర్కొనేందుకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలవుతున్న క్రమంలో ఈ ఏడాది మార్చిలో నియామకాలు 2019లో ఇదే నెలతో పోలిస్తే 18 శాతం మేర పడిపోయాయని నౌక్రి జాబ్‌స్పీక్ సూచీ వెల్లడించింది. ఈ ఏడాది జనవరి నుంచీ నియామకాలు సగటున 5.75 శాతం వృద్ధినే నమోదు చేస్తుండటం మందగమన సంకేతాలు పంపగా కరోనా మహమ్మారితో ఉద్యోగ నియామకాలు భారీగా తగ్గాయి. నౌక్రీ.కాం వెబ్సైట్లో ప్రతినెలా నమోదయ్యే జాబ్ లిస్టింగ్స్ ఆధారంగా నౌక్రీ జాబ్‌స్పీక్ పేరిట ప్రతినెలలో హైరింగ్ కార్యకలాపాలను వెల్లడిస్తుంది. తాజాగా నియామక కార్యకలాపాలు హోటల్, రెస్టారెంట్లు, ట్రావెల్, ఎయిర్‌లైన్స్, రిటైల్, ఆటో అనుంబంధ రంగాలు, బీమా, ఫార్మా, ఫైనాన్స్, ఐటీ సాఫ్ట్వేర్ రంగాల్లో భారీగా పడిపోయాయి. ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లో నియామకాల ప్రక్రియ భారీగా దెబ్బతిందని వెల్లడించింది. ఇక ఢిల్లీలో నియామక కార్యకలాపాలు 26 శాతం తగ్గగా, చెన్నై..హైదరాబాద్‌ల్లో 24 శాతం, 18 శాతం మేర తగ్గుముఖం పట్టాయని తెలిపింది. ఢిల్లీ, ఎన్సీఆర్ పరిధిలో హాస్పిటాలిటీ, ఫార్మాస్యూటికల్ రంగాల్లో నియామకాల ప్రక్రియ వరుసగా 66 శాతం, 43 శాతం మేర తగ్గుముఖం పట్టాయి. ఇక హైదరాబాద్‌లో నియామక కార్యకలాపాలు 18 శాతం తగ్గగా హాస్పిటాలిటీ రంగంలో 62 శాతం, ఆటో అనుబంధ రంగాల్లో 46 శాతం, బ్యాంకింగ్, ఆర్థిక సేవల రంగాల్లో 40 శాతం మేర నియామక కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయి. కోవిడ్-19 సంక్షోభం ప్రభావంతో హైరింగ్ కార్యకలాపాల్లో 18 శాతం తగ్గుదల నమోదైందని..జనవరి నుంచే ఈ ట్రెండ్స్ కనిపించాయని నౌక్రీ.కాం చీఫ్ బిజినెస్ ఆఫీసర్ పవన్ గోయల్ పేర్కొన్నారు. చదవండి : 2.5 కోట్ల ఉద్యోగాలకు కోత -
ఆ బ్యాంకులో టెకీల హైరింగ్..
బెంగళూర్ : ఎస్వీబీ ఫైనాన్షియల్ గ్రూప్ సబ్సిడరీ సిలికాన్ వ్యాలీ బ్యాంక్ తన బెంగళూర్ కార్యాలయం కోసం 200 మందికి పైగా ఉద్యోగులను నియమించేందుకు సన్నద్ధమవుతోంది. అమెరికాలో అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటైన ఎస్వీబీ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30,000కి పైగా స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టింది. ఈ కంపెనీ బెంగళూర్ కార్యాలయం కోసం ఇంజనీర్లు, సిస్టమ్ ఆర్కిటెక్ట్స్, డేటా అనలిస్టుల హైరింగ్‌కు సిద్ధమైంది. ఎంపికైన అభ్యర్థులు ప్రాడక్ట్ డిజైన్, డెవలప్మెంట్ సహా పలు ప్రాజెక్టులపై పనిచేయాల్సి ఉంటుంది. అకౌంటింగ్, రెగ్యులేటరీ రిపోర్టింగ్, ప్రొక్యూర్మెంట్, ట్యాక్స్, ట్రెజరీ సపోర్ట్ వంటి సేవలను ఎస్వీబీ తమ క్లయింట్లకు అందచేస్తుంది. డిజిటల్ ఫ్లాట్‌ఫాంను అభివృద్ధి చేస్తూ నైపుణ్యాలను సంతరించుకున్న సిబ్బంది కోసం నియామక ప్రక్రియ చేపట్టామని సిలికాన్ వ్యాలీ బ్యాంక్ సీఈవో డేనియల్ బెక్ వెల్లడించారు. బెంగళూర్‌లో ఇటీవల సెంటర్‌ను ప్రారంభించిన ఈ బ్యాంకుకు అమెరికా సహా హాంకాంగ్, బీజింగ్ షాంఘై, లండన్, ఫ్రాంక్ఫర్ట్ వంటి పలు ప్రపంచ నగరాల్లో 30 కేంద్రాల నుంచి తన కార్యకలాపాలను సాగిస్తోంది. -
టెకీలకు గుడ్‌న్యూస్ : ఐటీలో నియామకాల వెల్లువ
సాక్షి, న్యూఢిల్లీ : రాబోయే ఆరు నెలల్లో ఐటీ రంగంలో సంస్థలు పెద్దఎత్తున నియామకాలు చేపట్టనున్నాయి.పలు ఐటీ కంపెనీలు ప్రధానంగా జూనియర్ లెవెల్ ఉద్యోగాలను భారీగా రిక్రూట్ చేస్తాయని ఎక్స్పెరిస్ ఐటీ ఎంప్లాయ్మెంట్ అవుట్‌లుక్ సర్వే వెల్లడించింది. అమెరికాలో ప్రతిపాదిత వీసా నియంత్రణల నేపథ్యంలో భారత్‌లో గత కొద్దినెలలుగా తగ్గుముఖం పట్టిన నియామకాలు క్రమంగా ఊపందుకుంటున్నాయని ఈ నివేదిక పేర్కొంది. రానున్న రెండు త్రైమాసికాల్లో ఐటీ రంగంలో నియామకాలు చేపట్టేందుకు పలు సంస్థలు సుముఖంగా ఉన్నట్టు నివేదిక తెలిపింది. భారీ ఐటీ దిగ్గజాలు హైరింగ్ ప్రణాళికలకు పదునుపెడుతుండగా, నాన్ ఐటీ కంపెనీలు సైతం డిజిటల్ వైపు మళ్లేందుకు అనుగుణంగా సాంకేతిక నిపుణుల నియామకంపై దృష్టిసారించాయి. ఐటీ కంపెనీలు భారీ వడపోతల అనంతరం జూనియర్ లెవెల్లో నియామకాలను పెద్దఎత్తున చేపడతాయని, సృజనాత్మకత, వినూత్న ఆలోచనాధోరణి కలిగిన వారికి ఆకర్షణీయమైన ప్యాకేజీలు లభిస్తాయని నివేదిక పేర్కొంది. మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్‌చైన్, రోబోటిక్స్ వంటి నూతన టెక్నాలజీలపై స్టార్టప్‌లు పనిచేస్తుండటంతో స్టార్టప్‌లలోనూ నియామకాలు భారీగా ఉంటాయని నివేదిక అంచనా వేసింది. దేశవ్యాప్తంగా దాదాపు 550 ఐటీ కంపెనీల యాజమాన్యాలతో ఇంటర్వ్యూల ద్వారా వారి హైరింగ్ ప్రణాళికలను ఎక్స్పెరిస్ ఐటీ ఎంప్లాయ్మెంట్ అవుట్‌లుక్ సర్వే విశ్లేషించింది. -
టెకీలకు బ్యాడ్ న్యూస్..!
ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలకోసం ఎదురు చూస్తున్న వారికి ఈ ఏడాది కూడా నిరాశ తప్పదని తాజా అధ్యయనం తేల్చింది. 2018 తొలి త్రైమాసికంలో టాప్ ఐటీ కంపెనీలు మెరుగైన ఫలితాలను ప్రకటించినప్పటికీ పరిశ్రమ నియామకాలు ఆశించిన స్థాయిలో ఉండవని సమాచారం. ముఖ్యంగా టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ లాంటి దేశీయ టాప్ ఐటి కంపెనీల తొలి త్రైమాసిక ఫలితాలు ఆశాజనకంగా ఉన్నప్పటికీ ఉద్యోగాల ఆశ అంతనంత దూరంలో ఉండవని విశ్లేషకుల తాజా అంచనా. నియామకాల వృద్ధి ఈ సంవత్సరం స్తబ్దుగానే ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. నాస్కామ్ ప్రకారం, ఐటీ పరిశ్రమ 2018-19లో ఒక లక్ష కొత్త ఉద్యోగాలను జోడించనుంది. గత ఏడాది జూన్‌లో ఐటీ , బిపిఎం పరిశ్రమలో 1.3-1.5 లక్షల కొత్త ఉద్యోగాలు రానున్నాయని అంచనా వేశారు. అయితే ఈ అంచనాలకు తల కిందులై కేవలం లక్షకు లోపే నియామకాలు నమోదు అయ్యాయి. ఈ లెక్కల ప్రకారం ఈ ఆర్థికసంవత్సరంలో ఐటీ నియామకాలు ఫ్లాట్‌గా ఉండనున్నాని అంచనా. అయితే 2016-17లో పరిశ్రమ నికర నియామకాలు 1.7 లక్షలుగా ఉండటం గమనార్హం. కొత్త ఉద్యోగాల్లో మెజారిటీ ఉద్యోగాలు కృత్రిమ మేధస్సు (AI), ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బిగ్ బేటా ఎనలటిక్స్ వైపు మళ్లుతున్నాయని సంస్థ మాజీ అధ్యక్షులు డెబ్జానీ ఘోష్ వ్యాఖ్యానించారు. ఈ ఏరియాల్లో 2018లో మొత్తం డిమాండ్ 5.11 లక్షలుగా ఉందనీ, ఇది 2021నాటికి 7.86 లక్షలకు చేరుకుంటుందన్నారు. సైబర్ సెక్యూరిటీ రంగం కూడా మెరుగైన ఉపాధి అవకాశాలను అందిస్తుందని ఆమె పేర్కొన్నారు. చెన్నైలో జరిగిన నాస్కామ్ హెచ్ఆర్ సదస్సులో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ పరిశ్రమలో ఏడాది చివరి నాటికి దాదాపు 40 లక్షల మంది ఉద్యోగులుంటారని భావిస్తున్నామన్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, పెరుగుతున్న ఆటోమేషన్ ప్రక్రియ, వ్యయాలను తగ్గించుకునే కంపెనీ ప్రయత్నాలు దీనికి కారణాలుగా ఉన్నాయి. అదే సమయంలో ఐటి కంపెనీలు ఉన్న ఉద్యోగులతోనే ఎక్కువ పనికోసం ఉపయోగించుకుంటున్నాయని హెడ్ హంటర్స్ ఇండియా వ్యవస్థాపకుడు, సీఈవో క్రిస్ లక్ష్మికాంత్ ఇటీవల చెప్పారు. పెరుగుతున్న ఆటోమేషన్ నియామకంలో కీలక పాత్ర పోషిస్తోందన్నారు. -
టెకీలకు భారీ డిమాండ్
సాక్షి, న్యూఢిల్లీ : టెకీలకు ఐటీ పరిశ్రమ తీపికబురు అందించింది. రానున్న రెండు క్వార్టర్లలో భారీ స్ధాయిలో ఉద్యోగులను నియమించుకోవాలని ఐటీ కంపెనీలు యోచిస్తున్నాయి. నూతన టెక్నాలజీలను అందిపుచ్చుకునేందుకు గత ఏడాదితో పోలిస్తే రానున్న ఆరు నెలల్లో పెద్దసంఖ్యలో ఉద్యోగులను రిక్రూట్ చేసుకుంటామని ఐటీ మ్యాన్‌పవర్ గ్రూప్ ఇండియా చేపట్టిన సర్వేలో 500 ఐటీ కంపెనీలు వెల్లడించాయి. నూతన టెక్నాలజీల నేపథ్యంలో నవ్యతకు పెద్దపీట వేసేందుకు ఐటీ కంపెనీలు హైరింగ్‌ను ముమ్మరంగా చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నాయని, దీంతో టెక్నాలజీ రంగంలో ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయని సర్వే నిర్వహించిన ఎక్స్పెరిస్ ఐటీ, మ్యాన్‌పవర్ గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్ మన్మీత్ సింగ్ చెప్పారు. ఐటీలో ఉపాధి అవకాశాలు సిద్ధంగా ఉన్నాయని, సరైన నైపుణ్యాలున్న వారికి మెరుగైన వేతనం చెల్లించేందుకు కంపెనీలు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నాయన్నారు. బిగ్ డేటా అనలిటిక్స్, మెషీన్ లెర్నింగ్, ఏఐ డెవలపర్లకు అత్యధిక వేతనాలను ఆఫర్ చేస్తున్నారని చెప్పారు. 0-5 ఏళ్ల అనుభవంతో నైపుణ్యాలను అందిపుచ్చుకోవాలనుకునే యువతకు కంపెనీలు పెద్దపీట వేస్తున్నాయన్నారు. నూతన టెక్నాలజీల్లో కెరీర్‌ను ఎంచుకోవాలనుంటే నైపుణ్యాలను మెరుగుపరుచుకుని, కొత్త టెక్నాలజీలపై అవగాహన పెంచుకోవాలన్నారు. సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు ఐటీ పరిశ్రమలో మార్పులను అవగతం చేసుకుని అందుకు అనుగుణంగా నైపుణ్యాలను సంతరించుకోవాలని సూచించారు. -
ట్రెండ్ రివర్స్: ఫ్లిప్‌కార్ట్‌లో భారీ నియామకాలు
సాక్షి, ముంబై: ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఎట్టకేలకు శుభవార్త చెప్పింది. గత రెండేళ్లుగా ఉద్యోగులను తగ్గించుకుంటూ వస్తున్న తాజాగా నియామకాలకు తెరతీసింది. ఫ్లిప్‌కార్ట్‌లో కీలకమైన పలు రంగాల్లో ఉద్యోగుల సంఖ్యను పెంచుకునేందుకు సిద్ధమైంది. డేటా సైన్స్ అండ్ ఎనలిటిక్స్ సహా ఇతర ఏరియాల్లో ఉద్యోగులను రిక్రూట్ చేసుకోనుంది. హెచ్ఆర్ కన్సల్టెన్సీ సంస్థల తాజా నివేదికల ప్రకారం ఫ్లిప్‌కార్ట్ లో 700కు పైగా ఉద్యోగావకాశాలను కల్పించనుంది. వీటిలో అధికంగా టెక్నాలజీరంగంలోనే ఈ నియామకాలు చేపట్టనుంది. ముఖ్యంగా ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ & సర్వీస్ డెలివరీ, ఐటీ అప్లికేషన్లు, డేటా సైంటిస్టులు, యూఐ, యూఎక్స్ డిజైనర్లు, ప్రొడక్ట్ సొల్యూషన్ ఇంజనీర్లు, టెక్ప్రోగ్రామ్ ఇంజనీర్లపై దృష్టిపెట్టింది. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఆధారిత సేవలను దేశానికి అందించే వ్యూహంలో భాగంగా భారీగా ఉద్యోగులను నియమించుకోనున్నామంటూ ఫ్లిప్‌కార్ట్ ప్రతినిధి ఒకరు ఈ వార్తలను ధృవీకరించారు. కాగా ఖర్చులను తగ్గించుకునే క్రమంలో ఫ్లిప్‌కార్ట్ గతరెండేళ్లుగా భారీగా ఉద్యోగులపై వేటు వేసింది. దీంతో 2016, 2017ఆర్థిక సంవత్సరాల్లో మొత్తం ఉద్యోగుల సంఖ్య గణనీయంగా క్షీణించింది. 2015 చివరి నాటికి 15 వేలుగా ఉన్న ఉద్యోగుల సంఖ్య 8వేలకు పడిపోయింది. అయితే ఇటీవల ఫ్లిప్‌కార్ట్ ఇటీవల క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్‌ను కూడా నిర్వహించింది. ఈ సందర్బంగా ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌కు చెందిన 20మంది విద్యార్థులను ఎంపిక చేయడం విశేషం. -
ఉద్యోగార్ధులకు డబుల్ బొనాంజా
సాక్షి, న్యూఢిల్లీ : ఈ ఏడాది నిరుద్యోగులకు కార్పొరేట్ భారతం నుంచి తీపికబురు అందింది. అత్యధిక నియామకాలతో పాటు భారీ ప్యాకేజ్లతో హైరింగ్ చేపట్టనున్నట్టు ఓ సర్వేలో వెల్లడైంది. సర్వేలో పాల్గొన్న 60 శాతం కంపెనీలు ఈ ఏడాది ఆకర్షణీయ వేతన ప్యాకేజ్లతో పెద్ద ఎత్తున ఉద్యోగ నియామకాలకు దిగనున్నట్టు తెలిపాయని నియామక ప్రక్రియ, వేతన విశ్లేషణ -2018 పేరుతో విస్డమ్జాబ్స్.కాం వెల్లడించిన నివేదిక తెలిపింది. నోట్ల రద్దు ప్రభావం సమసిపోవడం, హెచ్1బీ వీసా నిబంధనల సవరణ, జీఎస్టీ అమలు వంటి కారణాలతో ఈ ఏడాది రిక్రూట్మెంట్ ప్రణాళికలు సానుకూలంగా ఉన్నాయని పేర్కొంది. ఇక వేతన ప్యాకేజ్‌లు ఈ ఏడాది యథాతథంగా ఉంటాయని 54 శాతం కంపెనీలు భావిస్తే, ప్రారంభ వేతనాలు పెరిగే అవకాశం ఉందని 39 శాతం కంపెనీలు పేర్కొనడం గమనార్హం. వేతన ప్యాకేజ్‌లు తగ్గుముఖం పడతాయని కేవలం 5 శాతం కంపెనీలే అంచనా వేశాయని ఈ నివేదిక తెలిపింది. ఎంట్రీ, మిడిల్ లెవెల్స్‌లో వేతనాలు పెరుగుతాయని సర్వేలో పాల్గొన్న సంస్థల్లో 60 శాతం కంపెనీలు పేర్కొన్నాయి. ఈ ఏడాది భారీగా నియామకాలు చేపట్టనున్నట్టు 60 శాతం సంస్థలు పేర్కొన్నాయి. స్టార్టప్‌ల నుంచి పోటీని ఎదుర్కొనేందుకు హైరింగ్‌కు దిగుతామని 30 శాతం కంపెనీలు తెలిపాయి. ఐటీ, టెక్నాలజీ రంగాల్లో ఈ ఏడాది భారీ నియామకాలుంటాయని విస్డమ్జాబ్స్.కాం వ్యవస్ధాపక సీఈఓ అజయ్ కొల్లా తెలిపారు. గత ఏడాది ఉపాధి కల్పనలో వెనుకపడ్డ తయారీ, ఐటీ అనుబంధ, రవాణా, హాస్పిటాలిటీ రంగాల్లో ఈ ఏడాది నియామకాలు పుంజుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. -
ఉద్యోగార్ధులకు గుడ్‌న్యూస్
సాక్షి, న్యూఢిల్లీ : ఈ ఏడాది ఏప్రిల్-జూన్‌లో నియామకాలపై భారత కంపెనీలు ఆశావహంగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన ఓ సర్వేలో భారత కార్పొరేట్లలో 16 శాతం మంది ఈ క్వార్టర్లో హైరింగ్ ప్రణాళికల్లో ఉన్నట్టు తేలింది. క్రొయేషియా హైరింగ్ ప్రణాళికల్లో టాప్ ప్లేస్‌లో నిలవగా భారత్ ఎనిమిదవ ఆశావహ దేశంగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 43 దేశాల్లోని 58,000 కంపెనీలను మ్యాన్‌పవర్ గ్రూప్ పలుకరించగా క్రొయేషియాలో అత్యధిక కంపెనీలు నియామకాలను భారీగా చేపట్టనున్నట్టు వెల్లడించాయి. సర్వీస్, ఫైనాన్స్, రియల్ ఎస్టేట్, తయారీ, టెక్నాలజీ తదితర ఏడు రంగాల్లో నియామకాలు అధికంగా చోటుచేసుకుంటాయని సర్వేలో తేలింది. భారత్‌లో పలు రంగాలకు చెందిన 4600 కంపెనీల్లో సర్వే జరగ్గా నియామకాలు పరిమితంగా చేపట్టనున్నట్టు వెల్లడైంది. కొన్ని రంగాల్లో ఉద్యోగుల కుదింపు ఉన్నా 16 శాతం కంపెనీలు నియామకాలకు మొగ్గుచూపాయి. భారత్‌లో ఈ ఏడాది టెక్నాలజీ రంగంలో భారీగా ఉపాధి అవకాశాలు ఉంటాయని, అందుకు అవసరమైన నైపుణ్యాలను యువత అందిపుచ్చుకోవాలని మ్యాన్‌పవర్ ఇండియా ఎండీ ఏజీ రావు చెప్పారు. ఆర్టిఫిషియెల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ వంటి నూతన టెక్నాలజీలపై పట్టు సాధించే ప్రొఫెషనల్స్‌కు మెరుగైన డిమాండ్ ఉంటుందన్నారు. -
ఆ టెకీలకు గుడ్‌న్యూస్..
సాక్షి, బెంగళూర్ : దిగ్గజ కంపెనీలకు చెందిన ఇంజనీరింగ్, ఆర్అండ్డీ విభాగాల్లో అధిక వేతన పెంపు, నియామకాల జోరు ఊపందుకుంటుందని కన్సల్టింగ్ సంస్థ జిన్నోవ్ తాజా అథ్యయనంలో వెల్లడైంది. టెక్నాలజీ రంగంలో గత ఏడాది హైరింగ్ 29 శాతం పైగా పెరిగింది. దేశవ్యాప్తంగా పలు ఎంఎన్సీలకు చెందిన 43 గ్లోబల్ ఇన్‌హౌస్ సెంటర్లలో (జీఐసీ) ఈ అథ్యయనం చేపట్టారు. దేశంలో 1200 ఆర్అండ్డీ, ఇంజనీరింగ్ సెంటర్లతో 950 ఎంఎన్‌సీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఇక దేశంలోని ప్రముఖ ఐటీ కంపెనీల్లో 5 నుంచి 10 శాతం మేరకు పెరుగుతోంది. జీఐసీలో హైరింగ్ ఐటీ నియామకాల కంటే అధికంగా ఉండటం గమనార్హం. 2017లో జీఐసీల్లో వేతన పెంపు భారత ఐటీ కంపెనీల వేతన పెంపు కంటే రెండు రెట్లు అధికమని అథ్యయనంలో వెల్లడైంది. జీఐసీల్లో సగటు వేతన పెంపు 11.2 శాతంగా నమోదైంది. జూనియర్ లెవెల్లో అత్యధికంగా 14 శాతం వరకూ వేతనాలు పెరిగాయి. క్లౌడ్, డేటా అనలిటిక్స్, మెషీన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి నూతన డిజిటల్ టెక్నాలజీల రాకతో బహుళజాతి సంస్థలు తమ ఇంజనీరింగ్ విభాగాల్లో నైపుణ్యాలను పెంచుకోవడం, నూతన సొల్యూషన్లపై దృష్టిసారించడంతో ఆయా విభాగాల్లో నియామకాలు పెరిగాయని జిన్నోవ్ ఎంగేజ్మెంట్ మేనేజర్, డెలివరీ హెడ్ ఆనంద్ సుబ్రమణియమ్ చెప్పారు. మరోవైపు పరిశోధన, అభివృద్ధి (ఆర్అండ్డీ) విభాగాల్లో హైరింగ్ గణనీయంగా పెరుగుతోందని తెలిపారు. 2017లో ఆర్అండ్డీలో 30.6 శాతం మేర హైరింగ్ వృద్ధి నమోదైందని చెప్పారు. -
ఉద్యోగం ఎందుకంటారు..?
సాక్షి,న్యూఢిల్లీ: ఈ ఉద్యోగాన్ని మీరు ఎందుకు కోరుకుంటున్నారు..? అభ్యర్థులను కంపెనీలు సూటిగా అడుగుతున్న ప్రశ్న ఇది. దీనికి ఉద్యోగార్థులు సరైన వివరణను ఇవ్వలేకుంటే వారికి కంపెనీలో చోటుండదు. ఆర్థిక సేవల సంస్థ జెరోదా నియామకాల్లో అనుసరిస్తున్న పద్థతి ఇది. డాక్స్‌యాప్, హ్యాకర్ఎర్త్, ఫార్మాసీ, కార్యా, ఫ్లెక్సస్ ఎండీ వంటి పలు స్టార్టప్‌లు నియామకాల సందర్భంగా అభ్యర్థులు ఉద్యోగానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారు.. ఈ జాబ్ పట్ల వారి నిబద్ధత, దీర్ఘకాలం పనిచేయగలరా అనే కోణాల్లో అభ్యర్ధులను వడపోస్తున్నాయి. 2020 నాటికి దేశంలో 10,500కి పైగా స్టార్టప్‌లు వస్తాయని వీటిలో రెండులక్షల మందికి పైగా నియామకాలుంటాయని నాస్కామ్-జిన్నోవ్ సర్వే అంచనా వేస్తోంది. హైరింగ్ సందర్భంగా ఉద్యోగార్ధులు కొన్ని కఠిన ప్రశ్నలు ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలని ఈ సర్వే సూచించింది. ఆయా కంపెనీల లక్ష్యాలు, కంపెనీ దీర్ఘకాల వృద్ధికి ఎలా దోహదపడగలరనే ప్రశ్నలపై అభ్యర్ధులు సంతృప్తికర సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొంది. కంపెనీ లక్ష్యాలు పట్ల అవగాహన కలిగి, నిబద్ధత ఉన్న అభ్యర్ధులను ఆయా కంపెనీల వ్యవస్థాపకులు ఎంచుకోవాలని బెంగుళూరుకు చెందిన వెంచర్ ఫండ్ ప్రైమ్ వెంచర్ పార్టనర్స్ ఎండీ శ్రీపతి ఆచార్య పేర్కొన్నారు. ఇక మరికొన్ని సంస్థలు దీర్ఘకాలంగా తమతో కొనసాగే ఉద్యోగులకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. టాటా సన్స్ అధినేత రతన్ టాటా నుంచి ఫండ్ అందుకున్న దుస్తుల బ్రాండ్ కార్యా చురుకుగా ఉండే ఉద్యోగులను నియమించుకుంటోంది. నాయకత్వ లక్షణాలు మెండుగా ఉన్న వారిని హైర్ చేస్తున్నామని సంస్థ సీఈవో నిధి అగర్వాల్ చెప్పారు. దీర్ఘకాలం సంస్థతో ముందుకు సాగే వారికే స్టార్టప్‌ల ప్రాధాన్యతగా ముందుకొస్తోంది. ఇంటర్వూ్యల్లో అభ్యర్ధుల మనోబలానికీ మరికొన్నిసంస్థలు పదునుపెడుతున్నాయి. సంస్థ ఇబ్బందుల్లో పడితే వేతనం తగ్గించుకుని పనిచేసేందుకు సిద్ధమా అంటూ ఉద్యోగార్ధుల ఉద్దేశాలను తెలుసుకునేందుకు పరీక్షిస్తున్నాయి.స్టార్టప్‌ల్లో వినూత్న పనితీరుతో పాటు దూకుడుగా, సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకునేవారికి మెరుగైన ఆదరణ ఉంటుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. -
ఆ జాబ్స్ కనుమరుగు
సాక్షి,న్యూఢిల్లీ: నైన్ టూ ఫైవ్ జాబ్‌లు, ఏటా బోనస్, బోలెడన్ని లీవ్‌లు ఇవన్నీ ఇక తీపిగుర్తులుగా మారనున్నాయి. మారుతున్న వ్యాపార ధోరణులు, విపరీతంగా పెరుగుతున్న ఖర్చులను తగ్గించుకునేందుకు కంపెనీలు నియామక వ్యూహాలను మార్చేస్తున్నాయి. ఆటోమేషన్ వంటి నూతన టెక్నాలజీలకు మళ్లుతున్న క్రమంలోనూ నియామక ప్రక్రియ రూపురేఖలు మారుతున్నాయి. శాశ్వత ఉద్యోగులు, నాలుగైదేళ్ల కాలపరిమితితో కూడిన కాంట్రాక్టు నియామకాలకు కంపెనీలు స్వస్తి పలకనున్నాయి. అవసరమైనప్పుడు హైరింగ్ ఆ తర్వాత ఫైరింగ్ విధానానికి సంస్థలు మొగ్గుచూపుతున్నాయి. ఇప్పటికే భారత్‌లో 56 శాతం కంపెనీలు తమ ఉద్యోగుల్లో 20 శాతం మందిని తాత్కాలిక ఉద్యోగులుగా నియమించుకున్నాయని కెల్లీఓసీజీ నిర్వహించిన అథ్యయనంలో వెల్లడైంది. రానున్న రెండేళ్లలో తాత్కాలిక ఉద్యోగుల సంఖ్యను పెంచుకోవాలని 71 శాతం కంపెనీలు యోచిస్తున్నట్టు ఈ అథ్యయనంలో తేలింది. అత్యవసర, తాత్కాలిక ఉద్యోగుల నియామకాలు ఎక్కువగా ఐటీ, స్టార్టప్ కంపెనీల్లో చోటుచేసుకుంటున్నాయి. ఈ పద్ధతిలో ఆయా సంస్థలు డిమాండ్‌ను అనుసరించి ఆయా ప్రాజెక్టులు, సైట్‌పై అత్యవసర, తాత్కాలిక ఉద్యోగులను నియమించుకుంటాయి. తమ అవసరం తీరిన తర్వాత సదరు ఉద్యోగులను సాగంపుతాయి. మరోవైపు ఈ ప్రాజెక్టుల్లో ఉద్యోగులకు వెసులుబాటు కలిగిన పనివేళలుండటంతో ఫ్రీల్యాన్సర్లుగా సేవలందించేందుకు ఉద్యోగులూ ముందుకొచ్చే పరిస్థితి ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. -
ఆ రంగంలో కొలువుల జోష్..
సాక్షి,న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మౌలిక వసతులు, నిర్మాణ రంగంలో ఉద్యోగుల నియామకం ఈ ఏడాది అక్టోబర్‌లో గణనీయంగా పెరిగింది. మౌలిక రంగం నియామకాల్లో 12 శాతం వృద్ధి చోటుచేసుకుందని ఓ నివేదిక వెల్లడించింది. తయారీ, ఉత్పాదక, ఐటీ, సేల్స్, బిజినెస్ డెవలప్మెంట్ విభాగాల్లో హైరింగ్ పుంజుకున్నామౌలిక నిర్మాణ రంగంలోనే ఉపాథి వృద్ధి గణనీయంగా ఉందని ఈ నివేదిక పేర్కొంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం,పెద్ద ఎత్తున పలు మౌలిక ప్రాజెక్టులు సాగుతుండటంతో ఈ రంగంలో నియామకాలకు కంపెనీలు మొగ్గుచూపుతున్నాయని తెలిపింది. వదోదర, బెంగుళూరుల్లో నైపుణ్యాలకు డిమాండ్ నెలకొంది. కర్ణాటకలోనూ ఈ రంగాల్లో భారీగా నియామకాలు జరుగుతున్నాయని పేర్కొంది. మౌలిక రంగంతో పాటు పెట్రోకెమికల్స్‌లోనూ నియామకాలు చోటుచేసుకుంటున్నాయని తెలిపింది. క్వాలిటీ కంట్రోల్ నిపుణులతో పాటు ఆయా విభాగాల్లో సీనియర్ ప్రొఫెషనల్స్‌కు భారీ డిమాండ్ నెలకొందని పేర్కొంది. -
అక్టోబర్‌లో నియామకాల వృద్ధి 26%
న్యూఢిల్లీ: నియామకాల వృద్ధి అక్టోబర్ నెలలో 26 శాతంగా నమోదయ్యింది. ఐటీ-సాఫ్ట్వేర్, ఐటీఈఎస్ విభాగాల్లో అధిక నియామ కాలు జరిగాయని నౌకరీ.కామ్ పేర్కొంది. రానున్న కాలంలో ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగే అవకాశమున్నట్లు తెలిపింది. నౌకరీ.కామ్ నివేదిక ప్రకారం.. గతేడాది అక్టోబర్‌లో 1,356 వద్ద ఉన్న నౌకరీ ఉద్యోగ సూచీ ఈ ఏడాది అదే సమయంలో 1,715కి పెరిగింది. గతేడాది అక్టోబర్ నెలతో పోలిస్తే ఈ ఏడాది అదే సమయంలో ఉద్యోగ నియామకాల్లో 26 శాతం వృద్ధి నమోదయ్యిందని నౌకరీ.కామ్ చీఫ్ సేల్స్ ఆఫీసర్ వి.సురేశ్ తెలిపారు. ఈ ట్రెండ్ భవిష్యత్తులోనూ కొనసాగే అవకాశముందని చెప్పారు. వార్షిక ప్రాతిపదికన చూస్తే.. ఐటీఈఎస్ పరిశ్రమలో ఉద్యోగ నియామకాలు 36 శాతానికి పెరిగాయి. ఇదే సమయంలో ఐటీ-సాఫ్ట్వేర్ పరిశ్రమలో నియామకాలు 34 శాతానికి ఎగశాయి. ఎఫ్ఎంసీజీ, బీఎఫ్ఎస్ఐ,హెల్త్‌కేర్, మీడియా, ఎంటర్టైన్మెంట్ రంగాల్లో కూడా నియామకాల జోరు కొనసాగింది. ఈ ఏడాది జర్నలిస్ట్‌ల డిమాండ్ గరిష్ట స్థాయికి చేరింది. వార్షిక ప్రాతిపదికన 69 శాతం పెరిగింది. మీడియా నిపుణుల డిమాండ్ కూడా 53 శాతానికి చేరింది. పట్టణాల వారీగా చూస్తే.. ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో అధిక నియామకాలు జరిగాయి. దీని తర్వాతి స్థానంలో ముంబై, హైదరాబాద్, పుణే ఉన్నాయి.