సాక్షి,న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మౌలిక వసతులు, నిర్మాణ రంగంలో ఉద్యోగుల నియామకం ఈ ఏడాది అక్టోబర్‌లో గణనీయంగా పెరిగింది. మౌలిక రంగం నియామకాల్లో 12 శాతం వృద్ధి చోటుచేసుకుందని ఓ నివేదిక వెల్లడించింది. తయారీ, ఉత్పాదక, ఐటీ, సేల్స్, బిజినెస్ డెవలప్‌మెంట్ విభాగాల్లో హైరింగ్ పుంజుకున్నామౌలిక నిర్మాణ రంగంలోనే ఉపాథి వృద్ధి గణనీయంగా ఉందని ఈ నివేదిక పేర్కొంది.
దేశంలోని వివిధ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం,పెద్ద ఎత్తున పలు మౌలిక ప్రాజెక్టులు సాగుతుండటంతో ఈ రంగంలో నియామకాలకు కంపెనీలు మొగ్గుచూపుతున్నాయని తెలిపింది. వదోదర, బెంగుళూరుల్లో నైపుణ్యాలకు డిమాండ్ నెలకొంది. కర్ణాటకలోనూ ఈ రంగాల్లో భారీగా నియామకాలు జరుగుతున్నాయని పేర్కొంది.
మౌలిక రంగంతో పాటు పెట్రోకెమికల్స్‌లోనూ నియామకాలు చోటుచేసుకుంటున్నాయని తెలిపింది. క్వాలిటీ కంట్రోల్ నిపుణులతో పాటు ఆయా విభాగాల్లో సీనియర్ ప్రొఫెషనల్స్‌కు భారీ డిమాండ్ నెలకొందని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment