అక్టోబర్‌లో నియామకాల వృద్ధి 26% | Hiring activity sees 26% growth in October | Sakshi
Sakshi News home page

అక్టోబర్‌లో నియామకాల వృద్ధి 26%

Published Thu, Nov 19 2015 12:14 AM | Last Updated on Sun, Sep 3 2017 12:40 PM

అక్టోబర్‌లో నియామకాల వృద్ధి 26%

అక్టోబర్‌లో నియామకాల వృద్ధి 26%

న్యూఢిల్లీ: నియామకాల వృద్ధి అక్టోబర్ నెలలో 26 శాతంగా నమోదయ్యింది. ఐటీ-సాఫ్ట్‌వేర్, ఐటీఈఎస్ విభాగాల్లో అధిక నియామ కాలు జరిగాయని నౌకరీ.కామ్ పేర్కొంది. రానున్న కాలంలో ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగే అవకాశమున్నట్లు తెలిపింది. నౌకరీ.కామ్ నివేదిక ప్రకారం.. గతేడాది అక్టోబర్‌లో 1,356 వద్ద ఉన్న నౌకరీ ఉద్యోగ సూచీ ఈ ఏడాది అదే సమయంలో 1,715కి పెరిగింది. గతేడాది అక్టోబర్ నెలతో పోలిస్తే ఈ ఏడాది అదే సమయంలో ఉద్యోగ నియామకాల్లో 26 శాతం వృద్ధి నమోదయ్యిందని నౌకరీ.కామ్ చీఫ్ సేల్స్ ఆఫీసర్ వి.సురేశ్ తెలిపారు. ఈ ట్రెండ్ భవిష్యత్తులోనూ కొనసాగే అవకాశముందని చెప్పారు.
 
  వార్షిక ప్రాతిపదికన చూస్తే.. ఐటీఈఎస్ పరిశ్రమలో ఉద్యోగ నియామకాలు 36 శాతానికి పెరిగాయి. ఇదే సమయంలో ఐటీ-సాఫ్ట్‌వేర్ పరిశ్రమలో నియామకాలు 34 శాతానికి ఎగశాయి. ఎఫ్‌ఎంసీజీ, బీఎఫ్‌ఎస్‌ఐ,హెల్త్‌కేర్, మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ రంగాల్లో కూడా నియామకాల జోరు కొనసాగింది. ఈ ఏడాది జర్నలిస్ట్‌ల డిమాండ్ గరిష్ట స్థాయికి చేరింది. వార్షిక ప్రాతిపదికన 69 శాతం పెరిగింది. మీడియా నిపుణుల డిమాండ్ కూడా 53 శాతానికి చేరింది. పట్టణాల వారీగా చూస్తే.. ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో అధిక నియామకాలు జరిగాయి. దీని తర్వాతి స్థానంలో ముంబై, హైదరాబాద్, పుణే ఉన్నాయి.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement