ఉద్యోగార్ధులకు డబుల్‌ బొనాంజా | Higher Recruitment, Better Compensation In Offing This Year  | Sakshi
Sakshi News home page

ఉద్యోగార్ధులకు డబుల్‌ బొనాంజా

Published Fri, Mar 16 2018 2:50 PM | Last Updated on Fri, Mar 16 2018 2:50 PM

Higher Recruitment, Better Compensation In Offing This Year  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఈ ఏడాది నిరుద్యోగులకు కార్పొరేట్‌ భారతం నుంచి తీపికబురు అందింది. అత్యధిక నియామకాలతో పాటు భారీ ప్యాకేజ్‌లతో హైరింగ్‌ చేపట్టనున్నట్టు ఓ సర్వేలో వెల్లడైంది. సర్వేలో పాల్గొన్న 60 శాతం కంపెనీలు ఈ ఏడాది ఆకర్షణీయ వేతన ప్యాకేజ్‌లతో పెద్ద ఎత్తున ఉద్యోగ నియామకాలకు దిగనున్నట్టు తెలిపాయని నియామక ప్రక్రియ, వేతన విశ్లేషణ -2018 పేరుతో విస్డమ్‌జాబ్స్‌.కాం వెల్లడించిన నివేదిక తెలిపింది. నోట్ల రద్దు ప్రభావం సమసిపోవడం, హెచ్‌1బీ వీసా నిబంధనల సవరణ, జీఎస్‌టీ అమలు వంటి కారణాలతో ఈ ఏడాది రిక్రూట్‌మెంట్‌ ప్రణాళికలు సానుకూలంగా ఉన్నాయని పేర్కొంది.

ఇక వేతన ప్యాకేజ్‌లు ఈ ఏడాది యథాతథంగా ఉంటాయని 54 శాతం కంపెనీలు భావిస్తే, ప్రారంభ వేతనాలు పెరిగే అవకాశం ఉందని 39 శాతం కంపెనీలు పేర్కొనడం గమనార్హం. వేతన ప్యాకేజ్‌లు తగ్గుముఖం పడతాయని కేవలం 5 శాతం కంపెనీలే అంచనా వేశాయని ఈ నివేదిక తెలిపింది. ఎంట్రీ, మిడిల్‌ లెవెల్స్‌లో వేతనాలు పెరుగుతాయని సర్వేలో పాల్గొన్న సంస్థల్లో 60 శాతం కంపెనీలు పేర్కొన్నాయి. ఈ ఏడాది భారీగా నియామకాలు చేపట్టనున్నట్టు 60 శాతం సంస్థలు పేర్కొన్నాయి.

స్టార్టప్‌ల నుంచి పోటీని ఎదుర్కొనేందుకు హైరింగ్‌కు దిగుతామని 30 శాతం కంపెనీలు తెలిపాయి. ఐటీ, టెక్నాలజీ రంగాల్లో ఈ ఏడాది భారీ నియామకాలుంటాయని విస్డమ్‌జాబ్స్‌.కాం వ్యవస్ధాపక సీఈఓ అజయ్‌ కొల్లా తెలిపారు. గత ఏడాది ఉపాధి కల్పనలో వెనుకపడ్డ తయారీ, ఐటీ అనుబంధ, రవాణా, హాస్పిటాలిటీ రంగాల్లో ఈ ఏడాది నియామకాలు పుంజుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement