సాక్షి, న్యూఢిల్లీ : ఈ ఏడాది ఏప్రిల్-జూన్‌లో నియామకాలపై భారత కంపెనీలు ఆశావహంగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన ఓ సర్వేలో భారత కార్పొరేట్లలో 16 శాతం మంది ఈ క్వార్టర్‌లో హైరింగ్ ప్రణాళికల్లో ఉన్నట్టు తేలింది. క్రొయేషియా హైరింగ్ ప్రణాళికల్లో టాప్ ప్లేస్‌లో నిలవగా భారత్ ఎనిమిదవ ఆశావహ దేశంగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 43 దేశాల్లోని 58,000 కంపెనీలను మ్యాన్‌పవర్ గ్రూప్ పలుకరించగా క్రొయేషియాలో అత్యధిక కంపెనీలు నియామకాలను భారీగా చేపట్టనున్నట్టు వెల్లడించాయి. సర్వీస్, ఫైనాన్స్, రియల్ ఎస్టేట్, తయారీ, టెక్నాలజీ తదితర ఏడు రంగాల్లో నియామకాలు అధికంగా చోటుచేసుకుంటాయని సర్వేలో తేలింది.
భారత్‌లో పలు రంగాలకు చెందిన 4600 కంపెనీల్లో సర్వే జరగ్గా నియామకాలు పరిమితంగా చేపట్టనున్నట్టు వెల్లడైంది. కొన్ని రంగాల్లో ఉద్యోగుల కుదింపు ఉన్నా 16 శాతం కంపెనీలు నియామకాలకు మొగ్గుచూపాయి. భారత్‌లో ఈ ఏడాది టెక్నాలజీ రంగంలో భారీగా ఉపాధి అవకాశాలు ఉంటాయని, అందుకు అవసరమైన నైపుణ్యాలను యువత అందిపుచ్చుకోవాలని మ్యాన్‌పవర్ ఇండియా ఎండీ ఏజీ రావు చెప్పారు. ఆర్టిఫిషియెల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ వంటి నూతన టెక్నాలజీలపై పట్టు సాధించే ప్రొఫెషనల్స్‌కు మెరుగైన డిమాండ్ ఉంటుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment