
దక్షిణ ఆసియాలో అతిపెద్ద స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ అయిన సంగీత ప్రియులకు ఇష్టమైన జియోసావన్ మరో కొత్త ముందుకు వచ్చింది. జియోసావన్ టీవీ పేరుతో విదేయో కంటెంట్ అందించనుంది. ఇప్పటివరకు రేడియో, పాడ్ క్యాస్ట్ సేవలను అందించిన జియోసావ్న్ ఇప్పడు వీడియో సేవలను అందించనుంది. ప్రత్యేకమైన ఈ వీడియో ఫీచర్ వల్ల మరింత మందికి అద్భుతమైన కంటెంట్ అందించనున్నట్లు పేర్కొంది.
జియోసావన్ ప్లాట్‌ఫాం విస్తృతంగా ప్రాచుర్యం పొందిన ఆడియో సేవలతో పాటు సంగీతం కోసం కొత్తగా టెలివిజన్ అనుభవాన్ని సృష్టిస్తుంది. ఈ ఫీచర్ వినియోగదారులకు అత్యధిక నాణ్యత గల వీడియో స్ట్రీమింగ్ అందిస్తుంది. వినియోగదారులు ఇప్పుడు హోమ్‌పేజీలోని క్రొత్త ట్యాబ్‌లో మ్యూజిక్ టీవీ ఛానెల్‌లను, మ్యూజిక్ వీడియో ప్లేజాబితాలను యాక్సెస్ చేయవచ్చు. దీనివల్ల చూడాలనుకుంటున్న వీడియోను వెంటనే చూడటానికి వీలు కలుగుతుంది. కొత్త ఫీచర్ వల్ల ఎందరో ప్రసిద్ద కళాకారులు చెందిన వీడియోలను సులభంగా చూడవచ్చు.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment