న్యూఢిల్లీ: త్వరలో రాజ్యసభ నుంచి రిటైరవుతున్న సభ్యులు దేశ ప్రయోజనాలకు అనుగుణంగా, యువతలో ఆసక్తి రేపేలా తమ అనుభవసారాన్ని అన్నిదిశలకు వ్యాపింపజేయాలని ప్రధాని నరేంద్రమోదీ సూచించారు. జ్ఞానం కన్నా అనుభవం గొప్పదని, సభ్యులంతా తమ అనుభవాన్ని దేశ సేవకు వినియోగించాలని కోరారు. రాజ్యసభలో రిటైరవుతున్న 72 మంది సభ్యులకు గురువారం వీడ్కోలు పలికారు. ఈ ఏడాది మార్చి– జూలై సమయంలో వీరంతా పదవీ విరమణ చేయనున్నారు. చట్టసభల సభ్యులు సమర్థవంతమైన పనితీరు చూపాలని, చట్టసభల విధులకు అంతరాయం కలిగించకుండా పనిచేయాలని రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment