rajya sabha chairman
-
Parliament Session: చినికి చినికి గాలివానగా... జయ వర్సెస్ ధన్‌ఖడ్!
న్యూఢిల్లీ: పేరులో ఏముందంటారు. కానీ పేరు పెను వివాదానికి దారి తీయగలదని, అంతకుమించి రాజకీయ సంక్షోభానికీ కారణం కాగలదని రాజ్యసభ సాక్షిగా రుజువైంది. సమాజ్‌వాదీ ఎంపీ జయాబచ్చన్ పేరు విషయమై శుక్రవారం రాజ్యసభలో రాజుకున్న రగడ నాటకీయ మలుపులు తిరిగి చివరికి రాజకీయ దుమారంగా మారింది. ఏకంగా రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్‌ను ఉపరాష్ట్రపతి పదవి నుంచి తొలగించాలంటూ అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాలని విపక్ష ఇండియా కూటమి నిర్ణయించుకునే దాకా వెళ్లింది! దాంతో విపక్ష సభ్యులకు, ఆయనకు మధ్య కొంతకాలంగా కొనసాగుతున్న విభేదాలు కీలక మలుపు తిరిగాయి. వేడెక్కిన రాజ్యసభ జయాబచ్చన్ ‘పేరు’ అంశం శుక్రవారం రాజ్యసభను అమాంతం వేడెక్కించింది. విపక్ష నేత మల్లికార్జున ఖర్గేపై గత వారం బీజేపీ సభ్యుడు ఘన్‌శ్యాం తివారీ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలంటూ కాంగ్రెస్ ఎంపీలు డిమాండ్ చేయడంతో రగడకు బీజం పడింది. ఇది ముగిసిపోయిన అంశమని ధన్‌ఖడ్ బదులివ్వడంతో విపక్ష ఎంపీలంతా గొడవకు దిగారు. దీనిపై జయ మాట్లాడతాననడంతో ధన్‌ఖడ్ అనుమతించారు. ‘జయా అమితాబ్ బచ్చన్! మాట్లాడండి’ అన్నారు. ఆయన తన పేరును పిలిచిన తీరులో వ్యంగ్యం ధ్వనిస్తోందంటూ జయ తీవ్ర అభ్యంతరం వెలిబుచ్చారు. ‘‘నేను నటిని. హావభావాలను ఇట్టే అర్థం చేసుకోగలను. మీ మాటతీరు ఏమాత్రం అంగీకారయోగ్యంగా లేదు. మీరు సభాధ్యక్ష స్థానంలో ఉండొచ్చు గాక. కానీ మీరు మా తోటి సభ్యులు మాత్రమే’’ అన్నారు. దాంతో ధన్‌ఖడ్ తీవ్రంగా ఆగ్రహించారు. ‘ఇక చాలు’ అంటూ మధ్యలోనే కలి్పంచుకున్నారు. ‘‘మీకు గొప్ప పేరుండొచ్చు. కానీ నటీనటులు దర్శకుడు చెప్పినట్టు చేయాల్సిందే. సభాధ్యక్ష స్థానం నుంచి నేను చూసేది మీకు కని్పంచకపోవచ్చు. నా మాటతీరునే తప్పుబడతారా? నేనేం చేయాలో మీరు నిర్దేశించలేరు’’ అంటూ ఆక్షేపించారు. ఇందుకు విపక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలపడంతో ధన్‌ఖడ్ మరింతగా మండిపడ్డారు. ‘‘మీరు సెలబ్రిటీ అయినా, మరెవరైనా సరే! నథింగ్ డూయింగ్. నిబంధనలను అర్థం చేసుకోవాల్సిందే. సభా మర్యాదలు పాటించి తీరాల్సిందే’’ అని బచ్చన్‌కు స్పష్టం చేశారు. విపక్ష ఎంపీలంతా తీవ్ర అభ్యంతరం తెలిపినా, మూకుమ్మడిగా నినాదాలకు దిగినా లెక్కచేయలేదు. ఈ అంశంపై మాట్లాడేందుకు ఎవరికీ అనుమతివ్వబోనని స్పష్టం చేశారు. ‘‘పేరు ప్రఖ్యాతులు మీకే ఉంటాయనుకోకండి. మనమంతా ఇక్కడికొచ్చేది మన బాధ్యతలు సరిగా నిర్వర్తించి పేరు సంపాదించేందుకే. పేరు ప్రఖ్యాతులకు తగ్గట్టుగా నడుచుకోవాలి’’ అంటూ క్లాసు తీసుకున్నారు. ‘‘సీనియర్ సభ్యులైనంత మాత్రాన సభాపతి స్థానాన్ని అవమానించేందుకు సభాపతి మాటతీరుకు ఉద్దేశాలు ఆపాదించేందుకు ఎవరికీ హక్కు లేదు. పరిస్థితిని బట్టి ప్రతిస్పందించాల్సి వచ్చింది. నా సొంత స్క్రిప్టునే అనుసరిస్తాను తప్ప ఎవరో చెప్పినట్టు నడుచుకునే ప్రసక్తే లేదు’’ అంటూ కుండబద్దలు కొట్టారు. విపక్ష సభ్యుల వ్యాఖ్యలేవీ రికార్డుల్లోకి వెళ్లబోవని స్పష్టం చేశారు. జయ పేరుపై రాజ్యసభలో ఆమెకు, ధన్‌ఖడ్‌కు సంవాదం జరగడం వారం రోజుల్లో ఇది మూడోసారి. మేం స్కూలు పిల్లలమా?: జయ ధన్‌ఖడ్ తీరుకు నిరసనగా వాకౌట్ చేస్తున్నట్టు విపక్ష సభ్యులు ప్రకటించారు. దాంతో ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ‘‘మీరు దేశం మొత్తాన్నీ అస్థిరపరిచే ప్రయత్నంలో ఉన్నారని నాకు బాగా తెలుసు. సభలో గందరగోళం సృష్టించడమే మీ ఉద్దేశం. అందుకు ఎట్టి పరిస్థితిలోనూ అనుమతించబోను. మీరంతా మీ బాధ్యతల నుంచి పారిపోతున్నారు’’ అంటూ ఆక్షేపించారు. ‘‘రాజ్యాంగాన్ని పణంగా పెట్టయినా ఖర్గే తన మాట నెగ్గించుకోవాలనుకుంటున్నారు. ఇది రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే’’ అంటూ తప్పుబట్టారు. అనంతరం సోనియాగాంధీ తదితరులతో కలిసి జయాబచ్చన్ సభ నుంచి వాకౌట్ చేశారు. సభా ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. ‘‘క్రమశిక్షణలో పెట్టేందుకు మేమేమీ స్కూలు పిల్లలం కాదు. ధన్‌ఖడ్ మాటతీరుతో చాలా కలత చెందాను. అధికార పక్ష సభ్యులు నిండు సభలో మా పట్ల అమర్యాదకరమైన మాటలు వాడుతున్నారు’’ అని ఆరోపించారు.87 మంది ఎంపీల సంతకాలుఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్ అభిశంసనకు తీర్మానం ప్రవేశపెట్టాలని ఇండియా కూటమి నిర్ణయించింది. ఈ మేరకు నోటీస్‌పై 87 మంది విపక్ష ఎంపీలు సంతకాలు చేసినట్టు సమాచారం. ‘‘నోటీసు ఎప్పుడివ్వాలో త్వరలో నిర్ణయిస్తాం. ఇది తీర్మానం దాకా వెళ్లకపోయినా, చైర్మన్‌గా ధన్‌ఖడ్ అనుసరిస్తున్న ఏకపక్ష పోకడలను దేశ ప్రజల ముందు ఎత్తి చూపడమే మా ఉద్దేశం’’ అని విపక్షాలు స్పష్టం చేశాయి.ముందస్తు నోటీసు తప్పనిసరి రాజ్యాంగంలోని ఆరి్టకల్ 67(బి) ప్రకారం ఉపరాష్ట్రపతిని తొలగించాలని కోరుతూ మహాభిశంసన తీర్మానం ప్రవేశపెట్టవచ్చు. మెజారిటీ సభ్యుల మద్దతు లభిస్తే తీర్మానం నెగ్గి ఆయన పదవీచ్యుతుడవుతారు. అయితే మహాభిశంసన కోరుతూ తీర్మానం ప్రవేశపెట్టబోతున్నామంటూ కనీసం 14 రోజుల ముందస్తు నోటీసివ్వడం తప్పనిసరి. -
రాజ్యసభలో తీవ్ర రగడ
న్యూఢిల్లీ: ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్ వినేశ్ ఫోగాట్‌పై అనర్హత వేటు అంశం పట్ల రాజ్యసభలో అలజడి రేగింది. ప్రతిపక్ష సభ్యులు, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది. వినేశ్ ఫోగాట్ అంశంపై సభలో చర్చించేందుకు చైర్మన్ అనుమతి ఇవ్వకపోవడంపై విపక్ష సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి తీరు పట్ల నిరసన వ్యక్తం చేస్తూ జగదీప్ ధన్‌ఖడ్ సభ నుంచి వెళ్లిపోయారు. ఎగువ సభ గురువారం ఉదయం ప్రారంభం కాగానే ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడారు. వినేశ్ ఫోగాట్‌పై అనర్హత అంశంపై తక్షణమే చర్చించాలని పట్టుబట్టారు. అందుకు ధన్‌ఖడ్ అంగీకరించకపోవడంతో తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు డెరెక్ ఓబ్రెయిన్ ఆయనతో వాగ్వాదానికి దిగారు. డెరెక్ ఓబ్రెయిన్‌తోపాటు విపక్ష సభ్యులు నినాదాలు చేస్తుండడంతో సభలో గందరగోళం నెలకొంది. ఫోగాట్‌పై చర్చించేందుకు ధన్‌ఖడ్ అనుమతి ఇవ్వకపోవడంతో ప్రతిపక్ష సభ్యులు వాకౌట్ చేశారు. విపక్ష ఎంపీల తీరు పట్ల ధన్‌ఖడ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. సభలో ఉండలేనని చెప్పారు. భారమైన హృదయంతో సభ నుంచి నిష్కృమిస్తున్నానని తెలిపారు. -
విజయసాయి రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు: రాజ్యసభ చైర్మన్
న్యూఢిల్లీ, సాక్షి: వైఎస్సార్సీపీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి పుట్టినరోజు నేడు(జులై 1). ఈ సందర్భంగా రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ‘‘విజయసాయిరెడ్డి రెండోసారి ఎన్నికై రాజ్యసభలో వైఎస్సార్సీపీ పక్ష నేతగా ఉన్నారు. ఆయన అపార జ్ఞానం, అనుభవం సభలో చట్టాల రూపకల్పనకు ఎంతో ఉపయోగపడింది. అంతేకాదు.. స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా విజయసాయిరెడ్డి విశేష సేవలందించారు. వృత్తిరీత్యా చార్టెడ్ అకౌంటెంట్, టీటీడీ మెంబర్ గా, పబ్లిక్ సర్వీస్ బ్యాంకు డైరెక్టర్ గానూ గతంలో ఆయన పని చేశారు. ఆయన సంతోషకరమైన జీవితం గడపాలని కోరుకుంటూ రాజ్యసభ తరఫున జన్మదిన శుభాకాంక్షలు అని చైర్మన్ ధన్‌ఖడ్ తెలిపారు. అలాగే.. రాజ్యసభలో కొందరు సభ్యులు ఆయనకు పుట్టినరోజు విషెస్ తెలియజేశారు. -
20 ఏళ్లుగా అవమానాలు ఎదుర్కొంటూనే ఉన్నారు: ధన్కర్కు మోదీ ఫోన్
న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఫోన్ చేశారు. ఈ విషయాన్ని ధన్కర్ స్వయంగా ఎక్స్ (ట్విటర్) ద్వారా వెల్లడించారు. మంగళవారం పార్లమెంట్లో జరిగిన ఘటన విషయంపై ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు. ఉప రాష్ట్రపతిలాంటి రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్న వ్యక్తిని, అది కూడా పార్లమెంట్లో విపక్షాల ఎంపీలు ఇలా అవమానించడం దురదృష్టకరమని పేర్కొన్నారు. గత 20 ఏళ్లుగా ఆయన ఇలాంటి అవమానాలకు గురవుతున్నారని చెప్పినట్లు తెలిపారు. అయితే కొంతమంది ప్రవర్తన తన కర్తవ్యాన్ని నిర్వర్తించడకుండా అడ్డుకోలేవని ధన్కర్ వెల్లడించారు. ఎన్ని అవమానాలు ఎదురైనా తాను మాత్రం కట్టుబడి పని చేస్తానని తెలిపారు. తన హృదయపూర్వకంగా రాజ్యంగ విలువలకు కట్టుబడి ఉన్నానని, తన మార్గాన్ని ఎవరూ మార్చబోరని పేర్కొన్నారు. ఇక ప్రధానితోపాటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎంపీలు తమ వ్యక్తీకరణ గౌరవంగా ప్రవర్తించాలని హితవు పలికారు. కాగా మంగళవారం సస్పెండ్ అయిన పార్లమెంట్ విపక్ష సభ్యులు సస్పెన్షన్ వ్యవహారంపై నిరసన వ్యక్తం చేస్తున్న క్రమంలో టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ.. రాజ్యసభ చైర్మెన్ జగదీప్ ధన్కకర్ మిమిక్రీ చేశారు. పార్లమెంట్ మెట్ల వద్ద ఉన్న మెట్లపై కూర్చుని చైర్మెన్ జగదీప్‌ను అనుకరిస్తూ ఎగతాళి చేశారు. ఈ మిమిక్రీ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనిపై స్పందించిన ధన్కర్.. రాజ్యసభలో తనపట్ల జరిగిన సంఘటనను వ్యక్తిగత దాడిగా అభివర్ణించారు. మరోవైపు ‘ఎంపీల సస్పెన్షన్’ వివాదం పార్లమెంట్‌ను కుదిపేస్తోంది. పార్లమెంట్లో గతవారం చోటుచేసుకున్న భద్రతా వైఫల్యం ఘటనపై ఉభయ సభల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. విపక్షాల నిరసనలతో కార్యకలాపాలు స్తంభించాయి. మరోవైపు సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగింస్తున్నందుకు ఇప్పటి వరకు రాజ్యసభ, లోక్‌సభలోని విపక్షాలకు చెందిన 141 మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది. ఇక ఎంపీల సస్పెన్షన్‌పై ప్రతిపక్షాలు తమ నిరసనలను తీవ్రం చేస్తున్నాయి. Received a telephone call from the Prime Minister, Shri @narendramodi Ji. He expressed great pain over the abject theatrics of some Honourable MPs and that too in the sacred Parliament complex yesterday. He told me that he has been at the receiving end of such insults for twenty… — Vice President of India (@VPIndia) December 20, 2023 -
Parliament Winter Session 2023: సస్పెన్షన్ల పర్వం...78 మందిపై వేటు
పార్లమెంట్లో సోమవారం అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. పార్లమెంటు భద్రతా వైఫల్యంపై నినాదాలు, నిరసనలతో హోరెత్తించిన క్రమంలో ఏకంగా 78 మంది విపక్ష సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది! వీరిలో 33 మంది లోక్‌సభ సభ్యులు కాగా 45 మంది రాజ్యసభ సభ్యులున్నారు. ఒకే రోజు ఇంతమందిని బహిష్కరించడం పార్లమెంటు చరిత్రలోనే ఇదే తొలిసారి. గత వారమే 13 మంది లోక్‌సభ, ఒక రాజ్యసభ సభ్యునిపై సస్పెన్షన్ వేటు పడటం తెలిసిందే. దీంతో ప్రస్తుత పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో సస్పెండైన విపక్ష సభ్యుల సంఖ్య 92కు చేరింది. భద్రతా వైఫల్యంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా వివరణ, రాజీనామాకు డిమాండ్ చేయడమే వీరి సస్పెన్షన్‌కు కారణం. సస్పెన్షన్లపై సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కీలకమైన బిల్లులపై పార్లమెంట్లో చర్చ జరగకుండా మోదీ సర్కారు కుట్ర పన్నిందని, అందుకే తమను సస్పెండ్ చేసిందని మండిపడ్డారు. న్యూఢిల్లీ: పార్లమెంట్లో సోమవారం అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఉభయ సభల్లో ఏకంగా 78 మంది ప్రతిపక్ష సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది. ఒకేరోజు 78 మందిని బహిష్కరించడం భారత పార్లమెంట్ చరిత్రలో ఇదే మొదటిసారి. పార్లమెంట్లో ఈ నెల 13వ తేదీనాటి భద్రతా వైఫల్యంపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ సభలో తీవ్ర అలజడి సృష్టించిందుకు వీరిని సస్పెండ్ చేస్తున్నట్లు లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ ప్రకటించారు. లోక్‌సభ నుంచి 33 మంది, రాజ్యసభ నుంచి 45 మంది విపక్ష ఎంపీలు సస్పెన్షన్‌కు గురయ్యారు. గత వారమే లోక్‌సభలో 13 మంది, రాజ్యసభలో ఒక విపక్ష ఎంపీపై సస్పెన్షన్ వేటు పడిన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుత పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో సస్పెండైన మొత్తం ప్రతిపక్ష సభ్యుల సంఖ్య 92కు చేరుకుంది. వీరంతా ఒకే కారణంతో వేటుకు గురయ్యారు. భద్రతా వైఫల్యంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా వివరణ, రాజీనామాకు డిమాండ్ చేస్తూ ఉభయ సభల్లో ఆందోళనకు దిగారు. ఎంపీల నినాదాలు, నిరసనలతో ఉభయ సభలు దద్దరిల్లాయి. సస్పెన్షన్ల పర్వంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కీలకమైన బిల్లులపై పార్లమెంట్లో చర్చ జరగకుండా ప్రభుత్వం కుట్ర పన్నిందని, అందులో భాగంగానే సస్పెండ్ చేసిందని మండిపడ్డారు. లోక్‌సభలో విపక్షాల రగడ భద్రతా వైఫల్యంపై విపక్ష సభ్యులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ బిగ్గరగా నినాదాలు చేయడంతో లోక్‌సభ సోమవారం పలుమార్లు వాయిదా పడింది. కేంద్ర మంత్రి అమిత్ షా సభకు వచ్చి సమాధానం చెప్పాలని, పదవికి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. శాంతించాలని, సభా కార్యకలాపాలకు సహకరించాలని స్పీకర్ పలుమార్లు కోరినా ఫలితం లేకుండాపోయింది. దాంతో 33 మంది విపక్ష ఎంపీలను సభ నుంచి సస్పెండ్ చేయాలని కోరుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండు వేర్వేరు తీర్మానాలు మూజువాణి ఓటుతో ఆమోదం పొందాయి. అనంతరం సదరు ఎంపీలను సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. వీరిలో 10 మంది డీఎంకే, 9 మంది తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, 8 మంది కాంగ్రెస్ సభ్యులు ఉన్నారు. స్పీకర్ పోడియంపైకి చేరుకొని నినాదాలు చేసిన ముగ్గురు కాంగ్రెస్ సభ్యుల ప్రవర్తనపై విచారణ జరపాలని సభా హక్కుల కమిటీని స్పీకర్ ఆదేశించారు. ఆ నివేదిక వచ్చేదాకా వారిని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. మిగతా ఎంపీలను శీతాకాల సమావేశాలు ముగిసేదాకా బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. రాజ్యసభలో అదే దృశ్యం రాజ్యసభలో కూడా అదే దృశ్యం పునరావృతమైంది. చైర్మన్ ఆదేశాలను ధిక్కరించడంతోపాటు సభా కార్యక్రమాలకు అడ్డు తగులుతూ అనుచితంగా ప్రవర్తించడంతో మొత్తం 45 మంది ప్రతిపక్ష సభ్యులు సస్పెన్షన్‌కు గురయ్యారు. వీరిలో 12 మంది కాంగ్రెస్, ఏడుగురు తృణమూల్, నలుగురు డీఎంకే సభ్యులున్నారు. 45 మందిలో 34 మందిని ప్రస్తుత శీతాకాల సమావేశాల్లో మిగిలిన సెషన్ మొత్తం సస్పెండ్ చేశారు. మిగతా 11 మంది సభలో ప్రవర్తించిన తీరుపై విచారణ జరిపి మూడు నెలల్లోగా నివేదిక ఇవ్వాలని సభా హక్కుల కమిటీని చైర్మన్ ఆదేశించారు. నివేదిక వచ్చేదాకా సభకు దూరంగా ఉండాలని వారిని చైర్మన్ ఆదేశించారు. దాంతో వారు 3 నెలల దాకా సభకు హాజరయ్యే అవకాశం లేనట్లే. ప్రస్తుత సెషన్ ముగిసేదాకా సస్పెండైన లోక్‌సభ సభ్యులు అదీర్ రంజన్ చౌదరి, గౌరవ్ గొగొయ్, కె.సురేశ్, అమర్‌సింగ్, రాజమోహన్ ఉన్నిథాన్, తిరుణావుక్కరసర్, కె.మురళీధరన్, ఆంటోనీ (కాంగ్రెస్); కల్యాణ్ బెనర్జీ, అపురూప పొద్దార్, ప్రసూన్ బెనర్జీ, సౌగతా రాయ్, శతాబ్ది రాయ్, ప్రతిమా మండల్, కకోలీ ఘోష్ దస్తీదార్, అసిత్ కుమార్ మాల్, సునీల్ కుమార్ మండల్ (తృణమూల్ కాంగ్రెస్); టీఆర్ బాలు, ఎ.రాజా, దయానిధి మారన్, టి.సుమతి, కె.నవాస్కని, కళానిధి వీరస్వామి, సి.ఎన్.అన్నాదురై, ఎస్.ఎస్.పళనిమాణిక్కం, జి.సెల్వన్, ఎస్.రామలింగం (డీఎంకే); ఈటీ మొహమ్మద్ బషీర్ (ఐయూఎంఎల్); ఎన్.కె.ప్రేమచంద్రన్ (ఆర్ఎస్పీ); కౌసలేంద్ర కుమార్ జేడీ(యూ) సభా హక్కుల కమిటీ నివేదిక వచ్చేదాకా సస్పెండైన సభ్యులు: కె.జయకుమార్, విజయ్ వసంత్, అబ్దుల్ ఖలీక్ (కాంగ్రెస్) ప్రస్తుత సెషన్ ముగిసేదాకా సస్పెండైన రాజ్యసభ సభ్యులు ప్రమోద్ తివారీ, జైరాం రమేశ్, కె.సి.వేణుగోపాల్, రణదీప్‌సింగ్ సుర్జేవాలా, అమీ యాజ్ఞిక్, నరేన్భాయ్ జె.రాథ్వా, సయీద్ నాసిర్ హుస్సేన్, ఫూలోదేవి నేతమ్, శక్తిసింహ్ గోహిల్, రజని అశోక్‌రావు పాటిల్, రంజీత్ రంజన్, ఇమ్రాన్ ప్రతాప్గార్హీ (కాంగ్రెస్); సుఖేందు శేఖర్ రాయ్, మొహమ్మద్ నదీముల్ హక్, అబిర్ రంజన్ బిశ్వాస్, శాంతను సేన్, మౌసమ్ నూర్, ప్రకాశ్ చిక్ బరాయిక్, సమీరుల్ ఇస్లాం (తృణమూల్ కాంగ్రెస్); ఎం.షణ్ముగలింగం, ఎన్.ఆర్.ఇలాంగో, కనిమొళి ఎన్వీఎన్ సోము, ఆర్.గిరిరాజన్ (డీఎంకే); మనోజ్ కమార్ ఝా, ఫయాజ్ అహ్మద్ (ఆర్జేడీ), రామ్‌గోపాల్ యాదవ్, జావెద్ అలీఖాన్ (ఎస్పీ); రామ్‌నాథ్ ఠాకూర్, అనీల్ ప్రసాద్ హెగ్డే (జేడీ–యూ); వి.సదాశివన్ (సీపీఎం); వందనా చవాన్ (ఎన్సీపీ); మహువా మజీ (జేఎంఎం); జోస్ కె.మణి (కేసీ–ఎం); అజిత్‌కుమార్ భూయాన్ (స్వతంత్ర) సభా హక్కుల కమిటీ నివేదిక వచ్చేదాకా సస్పెండైన సభ్యులు: జెబీ మాథర్ హిషామ్, ఎల్.హనుమంతయ్య, నీరజ్ డాంగీ, రాజమణి పటేల్, కుమార్ కేట్కర్, జి.సి.చంద్రశేఖర్ (కాంగ్రెస్); జాన్ బ్రిట్టాస్, ఎ.ఎ.రహీం (సీపీఎం); బినోయ్ విశ్వం, పి.సందోష్‌కుమార్ (సీపీఐ); మొహమ్మద్ అబ్దుల్లా (డీఎంకే) నియంతృత్వాన్ని పరాకష్టకు తీసుకెళ్లారు. అచ్చం బాహుబలుల మాదిరిగా ప్రవర్తించారు. సభ నడవాలంటే విపక్షాలు ఉండాలనే కనీస నియమాన్నీ మరిచారు. అందర్నీ దారుణంగా సస్పెండ్ చేశారు. – అధీర్ రంజన్ చౌదరి, లోక్‌సభలో కాంగ్రెస్ నేత లోక్‌సభలో పొగ ఘటనకు కారకుడైన బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహాను సస్పెండ్ చేయాలని మేం కోరుతుంటే మమ్మల్నే సస్పెండ్ చేశారు. ఈ దారుణ ధోరణి ప్రజాస్వామ్యానికే వ్యతిరేకం. – సౌగతా రాయ్, తృణమూల్ కాంగ్రెస్ నేత పార్లమెంట్ చరిత్రలో ఎన్నడూ ఇలాంటిది జరగలేదు. 33 మంది లోక్‌సభ ఎంపీలను సస్పెండ్ చేస్తారా?. సభను ప్రశాంతంగా నడపాలి. అధికార పార్టీ సభ్యుల వైఖరి మీదే అది ఆధారపడి ఉంటుంది. విపక్షాలు వివరణ కోరుతుంటే ప్రభుత్వం ఈ విధంగా స్పందించడం దారుణం. – టీఆర్ బాలు, డీఎంకే నేత -
ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా సస్పెన్షన్ ఎత్తివేత
ఢిల్లీ: ఆప్ ఎంపీ రాఘవ్ చద్ధా సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధంఖర్ నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహ రావు ప్రవేశపెట్టిన తీర్మాణంపై ధంఖర్ సానుకూలంగా స్పందించారు. ఎంపీ రాఘవ్ చద్దా ఇప్పటివరకు అనుభవించిన సస్పెన్షన్‌ను తగిన శిక్షగా పరిగణించాలని ఎంపీ జీవీఎల్ నరసింహరావు ప్రవేశపెట్టిన తీర్మాణంలో పేర్కొన్నారు. నేటి నుంచి రాఘవ్ చద్దా సస్పెన్షన్‌ను నిలిపివేయడాన్ని సభ పరిశీలించవచ్చని ధంఖర్‌ను కోరారు. AAP MP Raghav Chadha returns to the Parliament as his suspension was revoked by Rajya Sabha Chairman Jagdeep Dhankhar, after 115 days. pic.twitter.com/zDWWk80p2l — ANI (@ANI) December 4, 2023 తన సస్పెన్షన్‌ను రద్దు చేయడంపై ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా స్పందించారు. ఛైర్మన్ ధంఖర్ నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేశారు. ఛైర్మన్ జగదీప్ ధంఖర్‌కు ధన్యవాదాలు తెలిపారు. "సుప్రీంకోర్టు జోక్యంతో నాపై విధించిన సస్పెన్షన్‌ను రద్దు అయింది. నన్ను 115 రోజుల పాటు సస్పెండ్ చేశారు. ఆ సమయంలో ప్రజల గొంతును సభలో వినిపించలేకపోయాను. రాజ్యసభ ఛైర్మన్‌కు ధన్యావాదాలు తెలియజేస్తున్నాను" అని వీడియో సందేశంలో చెప్పారు. #WATCH | AAP MP Raghav Chadha's suspension revoked by Rajya Sabha Chairman Jagdeep Dhankhar on the motion moved by BJP MP GVL Narasimha Rao. pic.twitter.com/I0UlbnORTe — ANI (@ANI) December 4, 2023 దేశ రాజధాని ఢిల్లీ (సవరణ) బిల్లు-2023పై ప్రతిపాదిత సెలక్ట్ కమిటీకి అనుమతి తీసుకోకుండానే కొందరు సభ్యుల పేర్లను చేర్చారంటూ గత వర్షాకాల సమావేశాల్లో రాఘవ్ చద్దాను రాజ్యసభ నుంచి సస్పెండ్ చేశారు. రాఘవ్ చద్దాను సస్పెండ్ చేయాలంటూ పీయూష్ గోయెల్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఆమోదించింది. నిబంధనల ఉల్లంఘన, అనుచిత ప్రవర్తన, ధిక్కార ఆరోపణలపై ఆయనపై సస్పెన్స్ వేటు పడింది. ఇదీ చదవండి: Madhya Pradesh: దిగ్విజయ్‌కు ఘోర పరాభవం.. -
Parliament session: నాకు కోపమే రాదు ఎందుకంటే... నా పెళ్లై 45 ఏళ్లయింది!
మణిపూర్ అంశంపై పార్లమెంటు అట్టుడుకుతున్న వేళ రాజ్యసభలో చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ తనపైనే జోకులు వేసుకుని సభలో నవ్వులు పూయించారు. దాంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. మీకు పదేపదే కోపమెందుకు వస్తుందని విపక్షనేత మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు. ‘సర్. నాకసలు కోపమే రాదు. ఎందుకంటే నా పెళ్లై 45 ఏళ్లయింది’ అంటూ ధన్‌ఖడ్ చెణుకులు విసరడంతో సభ్యుల నవ్వులతో సభ దద్దరిల్లిపోయింది. ‘‘చిదంబరం (కాంగ్రెస్ సభ్యుడు) చాలా సీనియర్ లాయర్ కూడా. అథారిటీపై కోపం చూపే హక్కు మాకుండదని ఆయనకు బాగా తెలుసు. సభలో మీరే (సభ్యులు) అథారిటీ. మరో విషయం. నా భార్య ఎంపీ కాదు. కనుక ఆమె గురించి నేనిలా సభలో మాట్లాడటం సరికాదు కూడా’’ అంటూ ధన్‌ఖడ్ మరోసారి అందరినీ నవి్వంచారు. తనకు కోపం వస్తుందన్న వ్యాఖ్యలను సవరించుకోవాల్సిందిగా ఖర్గేను కోరారు. దాంతో ఆయన లేచి, ‘‘మీకు కోపం రాదు. చూపిస్తారంతే. కానీ నిజానికి చాలాసార్లు లోలోపల కోపగించుకుంటారు కూడా’’ అనడంతో అధికార, విపక్ష సభ్యులంతా మరోసారి నవ్వుల్లో మునిగిపోయారు! రెండుసార్లు వాకౌట్ అంతకుముందు, మణిపూర్ అంశాన్ని లేవనెత్తేందుకు అనుమతించకపోవడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్, తృణమూల్, ఆర్జేడీ, ఆప్, వామపక్షాలు తదితర విపక్షాలు ఉదయం రాజ్యసభ భేటీ కాగానే వాకౌట్ చేశాయి. మధ్యాహ్నం రెండింటికి తిరిగి సమావేశమయ్యాక కాంగ్రెస్ సభ్యుడు ప్రమోద్ తివారీకి చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ అవకాశమిచ్చారు. మణిపూర్ హింసపై, మహిళలపై ఘోర అత్యాచారాలపై చర్చకు అవకాశం కోరుతున్నట్టు ఆయన చెప్పారు. దీనిపై అధికార, విపక్ష సభ్యులతో ఎన్నిసార్లు సమావేశమైనా ఎవరికి వాళ్లే తమదే పై చేయి కావాలని పట్టుదలకు పోవడంతో లాభం లేకపోతోందంటూ చైర్మన్ వాపోయారు. ఆగ్రహించిన విపక్ష సభ్యులు ‘ప్రధాని మోదీ సభకు రావాలి’ అంటూ నినాదాలకు దిగారు. వాటిని పట్టించుకోకుండా ఖనిజాల (సవరణ) బిల్లు ప్రవేశపెట్టేందుకు మంత్రి ప్రహ్లాద్ జోషికి చైర్మన్ అవకాశమిచ్చారు. దాన్ని నిరసిస్తూ విపక్షాలు రెండోసారి వాకౌట్ చేశాయి. -
‘క్రిమినల్ కేసుల్లో ఎంపీలకు ఎలాంటి మినహాయింపు ఉండదు’
న్యూఢిల్లీ: పార్లమెంట్ సభ్యులకు కేంద్ర దర్యాప్తు సంస్థలు సమన్లు జారీ చేయవచ్చని, అరెస్ట్‌లు చేయవచ్చని స్పష్టం చేశారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. క్రిమినల్ కేసుల్లో వారు సైతం సామాన్య ప్రజలతో సమానమేనని, ఎంపీ పదవితో వారికి ఎలాంటి రక్షణ ఉండదని వెల్లడించారు. ‘పార్లమెంటు సభ్యులు తమ పార్లమెంటరీ విధులను అడ్డంకులు లేకుండా నిర్వహించేందుకు వీలుగా కొన్ని ప్రత్యేకాధికారాలను అనుభవిస్తారు. కానీ, క్రిమినల్ కేసుల్లో ఎంపీలకు, సామాన్య ప్రజలకు ఎలాంటి బేధాలు ఉండవు.’అని స్పష్టం చేశారు వెంకయ్య. పార్లమెంట్ సమావేశాల వేళ తనకు ఈడీ సమన్లు జారీ చేయటంపై కాంగ్రెస్ నేత మల్లికార్జున్ ఖర్గే ప్రశ్నించిన మరుసటి రోజే వెంకయ్య నాయుడు ఈ వ్యాఖ్యలు చేయటం ప్రాధాన్యం సంతరించుకుంది. సివిల్ కేసుల్లో పార్లమెంట్ సభ్యులకు ఉన్న ప్రత్యేక అధికారాలను వెల్లడించారు రాజ్యసభ ఛైర్మన్. పార్లమెంట్ సమావేశాల ప్రారంభానికి 40 రోజుల ముందు, తర్వాత సివిల్ కేసుల్లో అరెస్ట్ చేయలేరని పేర్కొన్నారు. అయితే, క్రిమినల్ కేసుల్లో ఎలాంటి రక్షణ ఉండదని స్పష్టం చేశారు. చట్టాన్ని, లీగల్ ప్రక్రియను గౌరవించటం చట్టసభ్యుల బాధ్యత అని సూచించారు. ఇదీ చదవండి: Mallikarjun Kharge: ఈడీ విచారణకు మల్లికార్జున్ ఖర్గే.. కాంగ్రెస్‌లో టెన్షన్ టెన్షన్! -
రాజ్యసభ చైర్మన్‌కు మూడు నివేదికలు.. అందులో అంశాలివే..
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల ఏర్పాటైన నూతన జిల్లాలను వన్ డిస్ట్రిక్ట్–వన్ ప్రొడక్ట్(ఓడీఓపీ) పథకంలో చేర్చాలని వాణిజ్య శాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘం సిఫార్సు చేసింది. ఓడీఓపీలో సులభతర వాణిజ్యాన్ని పెంచాలని కోరింది. ఒక్కో జిల్లాలో ఒక్కో ఉత్పత్తిని ప్రోత్సహిస్తూ స్థానికంగా లభ్యమయ్యే వాటికి విస్తృత ప్రచారం, మార్కెటింగ్ అవకాశాలు కల్పించడం ఓడీఓపీ పథకం లక్ష్యం. ఈ–కామర్స్ సంస్థలకు డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ, ఇంటర్నల్‌ట్రేడ్(డీపీఐ ఐటీ)లో నమోదును తప్పనిసరి చేయాలని స్థాయీ సంఘం సూచించింది. తేయాకు బోర్డును పునఃనిర్మాణం చేయాలని కోరింది. ఈ మేరకు వాణిజ్య శాఖ స్థాయీ సంఘం చైర్మన్ వి.విజయసాయిరెడ్డి బుధవారం రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడుకు మూడు నివేదికలను అందజేశారు. అనంతరం అందులో ముఖ్యాంశాలను మీడియాకు వివరించారు. చదవండి: పరిశ్రమలకు ఊరట.. ఏపీఈఆర్సీ కీలక ఆదేశాలు.. సాధికారత బృందం ఏర్పాటు చేయాలి ఓడీఓపీలో ప్రస్తుతం 733 జిల్లాలు మాత్రమే ఉన్నాయని, మిగతా జిల్లాలను కూడా పథకంలో చేర్చాలని కోరినట్లు విజయసాయిరెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల నూతనంగా ఏర్పాటైన 13 జిల్లాలను ఇందులో చేర్చాలని స్థాయీ సంఘం సిఫార్సు చేసిందన్నారు. ఓడీఓపీకి సంబంధించి ఎగుమతులు, ఎంఎస్ఎంఈ, వివిధ శాఖల మధ్య సమన్వయం తదితర అంశాలతో నివేదిక రూపొందించామని తెలిపారు. వ్యవసాయం, టెక్స్టైల్స్, ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్, ఐటీ, ఎంఎస్ఎంఈ రంగాల కోసం సంబంధిత మంత్రిత్వ శాఖలు/విభాగాల కార్యదర్శులతో సాధికారత బృందాన్ని ఏర్పాటు చేయాలని కమిటీ సిఫార్సు చేసిందన్నారు. క్షేత్రస్థాయిలో కార్యాచరణ సమర్థంగా అమలు చేసే క్రమంలో సమన్వయం కోసం డిస్ట్రిక్ట్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కమిటీ (డీఈపీసీ)లు ఏర్పాటు చేయాలని సూచించామన్నారు. దేశీయ ఉత్పత్తులకు లాటిన్ అమెరికా, ఆఫ్రికా తదితర చోట్ల మార్కెటింగ్ అవకాశాలు విస్తృతంగా దక్కేలా చూడాలని కోరామన్నారు. వివిధ జిల్లాల్లో గుర్తించిన ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడానికి పబ్లిక్ – ప్రైవేట్ పార్టనర్షిప్ (పీపీపీ) నమూనాలు ప్రారంభించాలని సూచించామన్నారు. ఆరోగ్యసేతు తరహాలో.. ఎంఎస్ఎంఈల్లో ఎక్కువగా అనధికార, అసంఘటిత రంగంలో పని చేస్తున్నందున ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందేందుకు సరైన రిజిస్ట్రేషన్, ధ్రువీకరణ ఉండడం లేదని కమిటీ గుర్తించిందన్నారు. ఈ నేపథ్యంలో ఎంఎస్ఎంఈలను ఒకే వేదికపైకి తెచ్చేలా ఆరోగ్యసేతు తరహాలో ఒకే మ్యాపింగ్ విధానం తేవాలని సూచించామన్నారు. డిస్ట్రిక్ట్ ఎక్స్పోర్ట్ హబ్స్ (డీఈహెచ్) సమర్థంగా పని చేసేలా చేపట్టిన చర్యలను వివరించామన్నారు. ఓడీఓపీ ఉత్పత్తులతో పెద్దపెద్ద ఈ–కామర్స్ సంస్థలు భాగస్వామ్యం అయ్యేలా చూడాలని, అంతర్జాతీయంగా డిమాండ్ ఉన్న ఉత్పత్తులను గుర్తించి ఎగుమతులను ప్రోత్సహించాలని కోరామని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. నకిలీ టీ ఎగుమతులను అరికట్టాలి షాంపైన్ ఆఫ్ ఇండియాగా పేరొందిన డార్జిలింగ్ టీ నకిలీ ఎగుమతులను అరికట్టాలని స్థాయీ సంఘం సిఫార్సు చేసిందని విజయసాయిరెడ్డి తెలిపారు. టీ పరిశ్రమకు రాయితీలు, పెండింగ్‌లు క్లియర్ చేయాలని సూచించామన్నారు. తేయాకు పరిశ్రమలో పనిచేసే కార్మికులకు పర్జా పట్టాలు ఇవ్వాలని కోరామన్నారు. కార్మికులకు కనీస వేతనాల చట్టాన్ని వర్తింపజేయాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి సూచించామన్నారు. కృషి సించాయ్ పథకాన్ని తేయాకు రంగానికి వర్తింపచేసి టీ బోర్డును పూర్తిగా పునఃనిర్మాణం లేదా తగిన సవరణలు చేయాలని సూచించామని తెలిపారు. ఈ–కామర్స్‌లో గుత్తాధిపత్యం లేకుండా డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ, ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ)లో ఈ–కామర్స్ సంస్థల నమోదును తప్పనిసరి చేయాలని కమిటీ సిఫార్సు చేసిందని విజయసాయిరెడ్డి తెలిపారు. పెద్దపెద్ద సంస్థల గుత్తాధిపత్యం లేకుండా అన్ని సంస్థలు ఒకే ప్లాట్‌ఫాంలోకి తేవాలని సిఫారసు చేశామన్నారు. దేశవ్యాప్తంగా విస్తృతంగా ఇంటర్నెట్ సౌకర్యం కల్పించినపుడే ఈ–కామర్స్ విజయవంతం అవుతుందని సూచించామన్నారు. ఈ–కామర్స్ పాలసీ తేవాలని కోరామన్నారు. రూ.40 లక్షల లోపు ఉన్న ఈ–కామర్స్ సంస్థలకు జీఎస్టీ మినహాయింపు ఇవ్వాలని కోరగా కేంద్ర కార్యదర్శి వీలు కాదని చెప్పారన్నారు. ప్రత్యేక ఆర్థిక మండలి (ఎస్ఈజెడ్) తరహాలో ఈ–కామర్స్ ఎక్స్పోర్ట్ జోన్స్ నెలకొల్పి ఎగుమతులను ప్రోత్సహించాలని సిఫార్సు చేశామని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. నేషనల్ సైబర్ క్రైం పాలసీ తీసుకురావాలని, సైబర్ సెక్యూరిటీ ఆడిట్ చేయాలని కమిటీ సిఫార్సు చేసిందని తెలిపారు. కర్మ ఫలాన్ని అనుభవించాల్సిందే కర్మ ఫలాన్ని ఎవరైనా అనుభవించాల్సిందేనని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రపతి ఎన్నికలు, రాహుల్‌గాంధీని ఈడీ ప్రశ్నించడంపై ఢిల్లీలో మీడియా అడిగిన ప్రశ్నలపై ఆయన స్పందించారు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఏ అభ్యర్థికి మద్దతు తెలపాలనేది వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. రాహుల్‌గాంధీని ఈడీ ప్రశ్నించడంలో కేంద్రానికి సంబంధం ఏముంటుందని ప్రశ్నించారు. ‘కర్మ సిద్ధాంతం ప్రకారం పుణ్యం చేసిన వారు పుణ్య ఫలం, పాపం చేసిన వారు పాప ఫలం ఇప్పుడు కాకపోతే వచ్చే జన్మలోనైనా అనుభవించక తప్పదు. కర్మ సిద్ధాంతాన్ని బలంగా నమ్ముతా’’ అని పేర్కొన్నారు. -
రాజ్యసభలో 72మంది సభ్యుల పదవీకాలం పూర్తి
-
అనుభవాన్ని అందరికీ పంచండి!
న్యూఢిల్లీ: త్వరలో రాజ్యసభ నుంచి రిటైరవుతున్న సభ్యులు దేశ ప్రయోజనాలకు అనుగుణంగా, యువతలో ఆసక్తి రేపేలా తమ అనుభవసారాన్ని అన్నిదిశలకు వ్యాపింపజేయాలని ప్రధాని నరేంద్రమోదీ సూచించారు. జ్ఞానం కన్నా అనుభవం గొప్పదని, సభ్యులంతా తమ అనుభవాన్ని దేశ సేవకు వినియోగించాలని కోరారు. రాజ్యసభలో రిటైరవుతున్న 72 మంది సభ్యులకు గురువారం వీడ్కోలు పలికారు. ఈ ఏడాది మార్చి– జూలై సమయంలో వీరంతా పదవీ విరమణ చేయనున్నారు. చట్టసభల సభ్యులు సమర్థవంతమైన పనితీరు చూపాలని, చట్టసభల విధులకు అంతరాయం కలిగించకుండా పనిచేయాలని రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. -
చట్టసభల్లో నిరసనకు హద్దులుండాలి
సాక్షి, న్యూఢిల్లీ: చట్టసభల్లో నిరసనలు తెలపడంలో తప్పు లేదని, అదే సమయంలో సభా గౌరవాన్ని, గొప్పతనాన్ని కాపాడుకోవాలని ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు అన్నారు. ప్రభుత్వ నిర్ణయాలు, చట్టాల్లోని లోపాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేయడం ప్రజా ప్రతినిధుల హక్కు అయినప్పటికీ, అవి భావోద్వేగాలకు దారి తీసి పరిమితులు దాటకూడదని హితవు పలికారు. చట్టసభల్లో కార్యకలాపాలకు తరచూ అంతరాయాలు కలుగుతుండటం, దేశ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం స్ఫూర్తికి విఘాతం కలిగే పరిస్థితులు చోటు చేసుకోవడంపై ఉపరాష్ట్రపతి ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తొలి స్మారకోపన్యాసం చేసిన ఉపరాష్ట్రపతి, చట్టసభల్లో అంతరాయాలపై సుదీర్ఘంగా మాట్లాడారు. ఈ కార్యక్రమాన్ని ప్రణబ్ ముఖర్జీ లెగసీ ఫౌండేషన్ వర్చువల్ వేదికగా నిర్వహించింది. ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి మాట్లాడే స్వేచ్ఛ ఉంటుందని, రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఉండడమే నిజమైన ప్రజాస్వామ్యాన్ని, సమగ్రాభివృద్ధిని ముందుకు తీసుకెళుతుందని ఉపరాష్ట్రపతి తెలిపారు. చట్టసభల్లో అంతరాయాలతో జవాబుదారీతనం కొరవడి, ఏకపక్ష ధోరణి ఏర్పడే ప్రమాదముందని ఉపరాష్ట్రపతి ఆందోళన వ్యక్తం చేశారు. ఇది రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రణబ్ ముఖర్జీ బుద్ధి కుశలత, అసాధారణ జ్ఞాపకశక్తి అనేక వివాదాస్పద అంశాలకు సమాధానాన్ని చూపిందన్న ఉపరాష్ట్రపతి, పన్ను సంస్కరణలను స్వయంగా ఆర్థికమంత్రిగా సేవలందించిన ప్రణబ్ స్వాగతించిన విషయాన్ని గుర్తు చేశారు. 2018లో నాగపూర్‌లో జరిగిన ఆర్.ఎస్.ఎస్. శిక్షణా శిబిరంలో ప్రణబ్ ముఖర్జీ పాల్గొన్న విషయాన్ని ప్రస్తావిస్తూ, దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, హుందాగా వ్యవహరించగల ప్రణబ్ వ్యక్తిత్వానికి ఇది ఉదాహరణ అన్నారు. జాతీయవాదం గురించి మాటల్లో చెప్పే వారికి, నిజమైన జాతీయవాదాన్ని చేతల్లో చూపించారని తెలిపారు. దేశాభివృద్ధికి ప్రణబ్ విశేష సేవలు: మోదీ మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దార్శనికతగల గొప్ప నేత అని ప్రధాని మోదీ శ్లాఘించారు. అత్యుత్తమ ప్రజాజీవితం, పరిపాలనా దక్షత, సునిశిత దృష్టి కలిగిన ఆయన వివిధ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారన్నారు. ప్రణబ్ ముఖర్జీ ప్రథమ స్మారకోపన్యాసంలో ప్రధాని ఈ మేరకు పేర్కొన్నారు. అమోఘ ప్రజ్ఞాపాటవాలు కలిగిన ప్రణబ్ దేశాభివృద్ధికి గుర్తుంచుకోదగ్గ సేవలందించారని తెలిపారు. దేశ ప్రజాస్వామ్య విలువలను ఆయన పరిపుష్టం చేశారన్నారు. ఈ సందర్భంగా బంగ్లాదేశ్ ప్రధాని షేక్ ఖలీదా జియా వర్చువల్‌గా ప్రసంగించారు. యువ ఎంపీగా బంగ్లాదేశ్ అవతరణకు తోడ్పాటునందిం చారని ప్రణబ్‌ను కొనియాడారు. బంగ్లాదేశ్‌ను స్వతంత్ర దేశంగా గుర్తించాలంటూ 1971 జూన్‌లో రాజ్యసభలో ఆయన తీర్మానం ప్రవేశపెట్టారని గుర్తుకు తెచ్చుకున్నారు. భూటాన్ రాజు జింగ్మే కేసర్ నామ్‌గ్యాల్ వాంగ్‌చుక్ తన ఉపన్యాసంలో.. ప్రణబ్‌తో పలుమార్లు తాను భేటీ అయ్యాయని చెప్పారు. ఆయన నుంచి ఎన్నో నేర్చుకున్నాననీ, ఆయన లోటు తీర్చలేనిదని తెలిపారు. ప్రణబ్‌ముఖర్జీ దేశానికి 13వ రాష్ట్రపతిగా 2012–17 మధ్య కాలంలో పనిచేశారు. కాంగ్రెస్ నేత అయిన ఆయన కేంద్ర ప్రభుత్వంలో పలు శాఖలకు మంత్రిగా కూడా ఉన్నారు. -
ప్రభుత్వ ప్రతిపక్షాలు రెండు కళ్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ ప్రతిపక్షాలు తనకు రెండు కళ్లని రాజ్యసభ ౖచైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభివర్ణించారు. ఇరుపక్షాలు సమష్టి బాధ్యతతో వ్యవహరిస్తేనే పార్లమెంట్ సమావేశాలు సజావుగా జరుగుతాయన్నారు. రాజ్యసభలో ఇటీవల చోటుచేసుకున్న ఘటనల నేపథ్యంలో వెంకయ్య అభిప్రాయాలతో ఆయన కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అధికార, విపక్ష పార్టీల పరస్పర మొండి వైఖరితో ఉభయ సభలూ వాయిదాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. పెగసస్, వివాదాస్పద వ్యవసాయ చట్టాలుపై ప్రతిపక్షాలు చర్చకు పట్టుబట్టడంతో పాటు నిరసన ప్రదర్శనలతో ఉభయ సభల్ని స్తంభింపజేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు కళ్లతోనే సరైన దృష్టి కుదురుతుందని, ఇరుపక్షాలను తాను సమానంగా గౌరవిస్తాననని వెంకయ్య చెప్పినట్లు ప్రకటన తెలిపింది. చట్టసభలు చర్చలకోసం ఉద్దేశించినవని గుర్తు చేశారు. బయట చేసుకోవాల్సిన రాజకీయ పోరాటాలను సభలో చేయాలనుకోవడం సరికాదని ఆయన హితవు చెప్పారు. రభస ఘటనలపై పరిశీలన ఇటీవలి సమావేశాల్లో కొందరు అనుచితంగా ప్రవర్తించి సభా గౌరవాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించిన విషయంలో చర్యలు తీసుకోవడంపై లోతుగా పరిశీలిస్తున్నట్టు వెంకయ్యనాయుడు చెప్పారని ప్రకటన తెలిపింది. బుధవారం సమావేశాల్లో విపక్ష సభ్యులు, పార్లమెంట్ సెక్యూరిటీ మధ్య తీవ్ర ఘర్షణ నెలకొన్న సంగతి తెలిసిందే! గురువారం సాయంత్రం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో జరిగిన సమావేశంలో కూడా పార్లమెంట్లో ఘటనలపైనే చర్చించారని తెలిసింది. -
సభ్యుల తీరుపై వెంకయ్య కంటతడి
సాక్షి, న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు సభలో భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టారు. సభలో సభ్యులు వ్యవహరించిన తీరుతో తాను నిద్రలేని రాత్రి గడిపినట్టు పేర్కొన్నారు. బుధవారం సభ ప్రారంభం కాగానే ముందురోజు మంగళవారం సభలో విపక్ష సభ్యులు వ్యవహరించిన తీరును ఖండిస్తూ ప్రకటన చేశారు. పార్లమెంటును ప్రజాస్వామ్య దేవాలయంగా, సభలో సెక్రటరీ జనరల్, ఇతర అధికారులు కూర్చునే టేబుల్ ఉండే చోటును గర్భగుడిగా అభివర్ణిస్తూ, అలాంటి ప్రదేశం పవిత్రతను నాశనం చేస్తున్నారంటూ తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. ‘నిన్న ఈ పవిత్రతను నాశనం చేశారు. కొంతమంది సభ్యులు టేబుల్ మీద కూర్చున్నారు. మరికొందరు టేబుల్ పైకి ఎక్కారు. నా ఆవేదనను తెలియజేయడానికి, ఈ చర్యను ఖండించడానికి నాకు మాటలు లేవు..’ అని పేర్కొన్నారు. మంగళవారం జరిగిన సంఘటన వల్ల తాను నిద్ర లేని రాత్రి గడిపానని చెబుతూ చైర్మన్ భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టారు. ‘వ్యవసాయ సమస్యలు, పరిష్కారాలు’ అంశం చర్చ జరుగుతున్నప్పుడు సభ్యులు తమ అభిప్రాయాలను తెలియజేయడానికి, ప్రత్యేకించి గత సంవత్సరం తెచ్చిన మూడు వ్యవసాయ బిల్లులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్న వారికి సువర్ణావకాశం లభించిందని, కానీ చర్చ జరపకుండా సభ్యులు అంతరాయం సృష్టించారని ఆవేదన వ్యక్తంచేశారు. -
రూల్ 267కింద ఏపీ ప్రత్యేక హోదాపై చర్చించాలి: విజయసాయి రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: ప్రత్యేక హోదాపై వెంటనే చర్చ జరపాలంటూ.. సభా నియమ నిబంధనలలోని రూల్ 267 కింద రాజ్యసభ చైర్మన్‌కు వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నోటీసు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంపై రాజ్యసభలో వెంటనే చర్చ చేపట్టాలని ఆయన కోరారు. రాజ్యసభలో ఈరోజు నిర్వహించే ఇతర వ్యవహారాలన్నింటిని పక్కన పెట్టి రూల్ 267 కింద ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే అంశంపై చర్చను ప్రారంభించాలని ఆయన నోటీసులో కోరారు. ఈ అంశం ఎందుకు అత్యంత ప్రధాన్యతతో కూడుకున్నదో విజయసాయి రెడ్డి తన నోటీసులో క్లుప్తంగా వివరించారు. నోటీసులో ‘‘రాష్ట్ర విభజన సందర్భంగా అప్పటి ప్రధానమంత్రి ఆంధ్రప్రదేశ్‌కు పలు హామీలను ప్రకటించారు. అందులో రాష్ట్రానికి ప్రత్యేక హోదా అతి ప్రధానమైనది. ప్రధానమంత్రి ఇచ్చిన హామీని మార్చి 1, 2014లో జరిగిన కేంద్ర మంత్రి మండలి సమావేశం చర్చించి ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఆమోదించింది. కానీ ఇది జరిగి ఏడేళ్ళు కావస్తున్న కేంద్ర మంత్రి మండలి ఈ హామీని నెరవేర్చలేదు. కాబట్టి ఈరోజు సభా కార్యక్రమాలన్నింటినీ సస్పెండ్ చేసి సభలో తక్షణమే ఈ అంశంపై చర్చించి తగిన నిర్ణయం తీసుకోవాలి’’ అని విజయసాయి రెడ్డి రాజ్యసభ చైర్మన్‌కు ఇచ్చిన నోటీసులో విజ్ఞప్తి చేశారు. -
సభ సజావుగా సాగేందుకు సహకరించాలి
సాక్షి, న్యూఢిల్లీ: సోమవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను సజావుగా నిర్వహించేందుకు ప్రభుత్వం, ప్రతిపక్షాలు ఒకరికొకరు సహకరించుకోవాలని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు కోరారు. శనివారం ఉపరాష్ట్రపతి నివాసంలో జరిగిన అఖిలపక్ష సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. సుమారు గంటపాటు జరిగిన ఈ సమావేశంలో వివిధ రాజకీయపక్షాల నేతలు తమ అభిప్రాయాలను చైర్మన్ దృష్టికి తీసుకెళ్ళారు. కోవిడ్ వల్ల దేశంలో ఏర్పడిన పరిస్థితుల దృష్ట్యా ప్రజల పక్షాన నిలబడాలని, సంబంధిత అంశాలపై చర్చించాలని వెంకయ్య నాయుడు కోరారు. వర్షాకాల సమావేశాల్లో 6 ఆర్డినెన్స్‌లతో కలిపి మొత్తం 29 బిల్లులను సభ ముందు ఉంచుతున్నామని, సభ సజావుగా సాగేందుకు అన్ని పార్టీల సహకారాన్ని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి కోరారని సమాచారం. ఈ సమావేశానికి రాజ్యసభ నాయకుడు పీయూష్ గోయల్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రైల్వే, ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ సహా పలువురు మంత్రులు హాజరయ్యారు. -
వెంకయ్య విందుకు కాంగ్రెస్ గైర్హాజరు
సాక్షి, న్యూఢిల్లీ : ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు శుక్రవారం ఇవ్వనున్న అల్పాహార విందుకు కాంగ్రెస్ పార్టీ సభ్యులు గైర్హాజరు అవుతున్నట్లు ప్రకటించారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా ఎన్డీయే అభ్యర్థి, జేడీయూ ఎంపీ హరివంశ్ నారాయణ్ సింగ్ గురువారం ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు పార్లమెంట్ సభ్యులకు మర్యాద పూర్వకంగా ఏర్పాటు చేసిన అల్పాహార విందుకు కాంగ్రెస్ పార్టీ సభ్యులు హాజరుకావట్లేదని ఓ సీనియర్ నేత ప్రకటించారు. రఫెల్ ఒప్పందం, ఎస్సీ, ఎస్టీ చట్టంపై తమ సభ్యులకు రాజ్యసభలో మాట్లాడే అవకాశం ఇవ్వలేదని, వెంకయ్య నాయుడు సభను ఏకపక్షంగా నడుపుతున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ నేతల నిర్ణయంపై వెంకయ్య నాయుడు తీవ్రం అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. -
ఆ రాష్ట్రాలకు అన్యాయం జరగదు
న్యూఢిల్లీ: జనాభాను సమర్థంగా నియంత్రించిన రాష్ట్రాలకు నిధుల కేటాయింపులో అన్యాయం జరగకుండా 15వ ఆర్థిక సంఘం తగిన విధానాన్ని అవలంబిస్తుందని రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు చెప్పారు. రాష్ట్రాలకు నిధులను కేటాయించేందుకు గత ఆర్థిక సంఘాల మాదిరి 1971 నాటి జనాభా లెక్కలను కాకుండా 15వ ఆర్థిక సంఘం 2011 నాటి జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకుంటుండటం తెలిసిందే. దక్షిణాది రాష్ట్రాలన్నీ జనాభాను సమర్థంగా నియంత్రించడం ద్వారా అభివృద్ధిలో ముందున్నాయనీ, ఇప్పుడు 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకుంటే దక్షిణాది రాష్ట్రాలకు నిధులు తగ్గి అన్యాయం జరుగుతుందని అన్నాడీఎంకే ఎంపీ మైత్రేయన్ ప్రస్తావించారు. -
వెంకయ్య అసహనం ఎంతలా అంటే...
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ సభ్యుల నినాదాలు.. పదే పదే సభలో అంతరాయం కలిగించటం ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయడుకు చికాకు తెప్పిస్తున్నాయి. ఒకనొక సమయంలో ఆయన ముఖంలోనే భావాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాజ్యసభ ఎక్స్ అఫీషియో చైర్మన్ హోదాలో తొలి సమావేశాలను నిర్వహిస్తున్న ఆయన ఓ కార్యక్రమంలో తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ‘‘ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు ఎలా జరుగుతున్నాయంటే.. మొదలవుతున్నాయ్.. వెంటనే ఆగిపోతున్నాయ్. ఇది దేశానికి అంత మంచిది కాదు. విలువైన సభా సమయం.. ప్రజా ధనం వృధా అవుతోంది. ప్రజలకు నేతలు సమాధానం చెప్పాల్సి ఉంటుంది’’ అని ఢిల్లీలో ఓ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన వ్యాఖ్యానించారు. ఇక గతంలో ఇదే సభలో ఆయన సుదీర్ఘకాలం సభ్యుడిగా ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. పరిస్థితులు రాను రాను మరీ అద్వానంగా తయారవుతున్నాయని.. కీలకమైన బిల్లులపై చర్చించే పరిస్థితులు కనిపించటం లేదని వెంకయ్య ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఆర్థిక పురోగతి.. లక్ష్యాలు అన్న అంశంపై కూడా ఆయన ప్రసగించారు. కాగా, మన్మోహన్పై మోదీ వ్యాఖ్యలకు నిరసనగా రాజ్యసభ సమావేశాలకు అంతరాయం ఏర్పడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు కూడా సభ ప్రారంభమైన కాసేపటికే వాయిదా పడింది. -
బిల్లు సవరణలపై ఛైర్మన్‌కు 'శీలం' నోటీసులు
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు బుధవారం రాజ్యసభకు చేరుకుంది. ఈ నేపథ్యంలో బిల్లుపై సవరణలకు కేంద్ర సహాయ మంత్రి జేడీ శీలం రాజ్యసభ ఛైర్మన్‌కు నోటిసులు ఇచ్చారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని చేయాలని సీమాంధ్ర నేతల నిర్ణయంపై చర్చ జరగాలన్నారు. అలాగే సీమాంధ్రలో అత్యంత వెనకబడిన ప్రాంతాలు ఉత్తరాంధ్ర, రాయలసీమలకు కేటాయించే నిధులపై స్పష్టత ఇవ్వాలని, వీటితోపాటు రాయలసీమలోని కొన్ని జిల్లాలను కలసి రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలని చైర్మన్‌కు ఇచ్చిన నోటీసులలో పేర్కొన్నారు. అలాగే విభజన వల్ల సీమాంధ్ర పాంత్రం తీవ్రంగా నష్ట పోతుంది. ఈ నేపథ్యంలో పన్ను రాయితీలపై స్పష్టత ఇవ్వాలన్నారు. ఆ పన్ను రాయతీలన్ని వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో కేటాయింపులు జరగాలని సూచించారు. అయితే టి. బిల్లుపై 10 సవరణలు చేయాలని రాజ్యసభలో బీజేపీ కోరింది. సీమాంధ్రకు రూ. 10 వేల కోట్ల ఆర్థిక ప్యాకేజీ కోరాలని బీజేపీ ఇప్పటికే నిర్ణయించింది.