విజయసాయి రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు: రాజ్యసభ చైర్మన్‌ | Rajya Sabha Chairman Jagdeep Dhankhar Birthday Wishes To V Vijaysai Reddy | Sakshi
Sakshi News home page

విజయసాయి రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు: రాజ్యసభ చైర్మన్‌

Published Mon, Jul 1 2024 11:34 AM | Last Updated on Mon, Jul 1 2024 11:34 AM

Rajya Sabha Chairman Jagdeep Dhankhar Birthday Wishes To  V Vijaysai Reddy

ఫైల్‌ ఫోటో

న్యూఢిల్లీ, సాక్షి: వైఎ‍స్సార్‌సీపీ సీనియర్‌ నేత, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి పుట్టినరోజు నేడు(జులై 1). ఈ సందర్భంగా రాజ్యసభ చైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ‘‘విజయసాయిరెడ్డి రెండోసారి ఎన్నికై రాజ్యసభలో వైఎస్సార్‌సీపీ పక్ష నేతగా ఉన్నారు. ఆయన అపార జ్ఞానం, అనుభవం సభలో చట్టాల రూపకల్పనకు ఎంతో ఉపయోగపడింది. అంతేకాదు.. 

స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా విజయసాయిరెడ్డి విశేష సేవలందించారు. వృత్తిరీత్యా చార్టెడ్ అకౌంటెంట్, టీటీడీ మెంబర్ గా, పబ్లిక్ సర్వీస్ బ్యాంకు డైరెక్టర్ గానూ గతంలో ఆయన పని చేశారు. ఆయన సంతోషకరమైన జీవితం గడపాలని కోరుకుంటూ రాజ్యసభ తరఫున  జన్మదిన శుభాకాంక్షలు అని చైర్మన్‌ ధన్‌ఖడ్‌ తెలిపారు. అలాగే.. రాజ్యసభలో కొందరు సభ్యులు ఆయనకు పుట్టినరోజు విషెస్‌ తెలియజేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement