YSRCP MP Vijaya Sai Reddy Issue Notice To Rajya Sabha Chairman On AP Special Status - Sakshi
Sakshi News home page

రూల్‌ 267కింద ఏపీ ప్రత్యేక హోదాపై చర్చించాలి: విజయసాయి రెడ్డి

Published Mon, Jul 19 2021 1:02 PM | Last Updated on Mon, Jul 19 2021 3:54 PM

YSRCP MP Vijaya Sai Reddy Issue Notice To Rajya Sabha Chairman On AP Special Status - Sakshi

వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ( ఫైల్‌ ఫోటో )

సాక్షి, న్యూఢిల్లీ: ప్రత్యేక హోదాపై వెంటనే చర్చ జరపాలంటూ.. సభా నియమ నిబంధనలలోని రూల్‌ 267 కింద రాజ్యసభ చైర్మన్‌కు వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నోటీసు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంపై రాజ్యసభలో వెంటనే చర్చ చేపట్టాలని ఆయన కోరారు. రాజ్యసభలో ఈరోజు నిర్వహించే ఇతర వ్యవహారాలన్నింటిని పక్కన పెట్టి రూల్‌ 267 కింద ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే అంశంపై చర్చను ప్రారంభించాలని ఆయన నోటీసులో కోరారు. ఈ అంశం ఎందుకు అత్యంత ప్రధాన్యతతో కూడుకున్నదో విజయసాయి రెడ్డి తన నోటీసులో క్లుప్తంగా వివరించారు. 

నోటీసులో ‘‘రాష్ట్ర విభజన సందర్భంగా అప్పటి ప్రధానమంత్రి ఆంధ్రప్రదేశ్‌కు పలు హామీలను ప్రకటించారు. అందులో రాష్ట్రానికి ప్రత్యేక హోదా అతి ప్రధానమైనది. ప్రధానమంత్రి ఇచ్చిన హామీని మార్చి 1, 2014లో జరిగిన కేంద్ర మంత్రి మండలి సమావేశం చర్చించి ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఆమోదించింది. కానీ ఇది జరిగి ఏడేళ్ళు కావస్తున్న కేంద్ర మంత్రి మండలి ఈ హామీని నెరవేర్చలేదు. కాబట్టి ఈరోజు సభా కార్యక్రమాలన్నింటినీ సస్పెండ్‌ చేసి సభలో తక్షణమే ఈ అంశంపై చర్చించి తగిన నిర్ణయం తీసుకోవాలి’’ అని విజయసాయి రెడ్డి రాజ్యసభ చైర్మన్‌కు ఇచ్చిన నోటీసులో విజ్ఞప్తి చేశారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement