తిరుపతి టౌన్: తిరుపతి పట్టణంలో ఆదివారం సాయంత్రం 5 గంటల సమయంలో వడగళ్లతో కూడిన వర్షం కురిసింది. వడగళ్లు పెద్ద గోళీల పరిమాణంలో ఉన్నాయి. అక్కడే ఉన్న స్థానికులు వడగళ్ల వాన పడటంతో దగ్గర్లోని షెల్టర్ల వద్దకు పరుగు లంకించుకున్నారు. అనంతరం వడగళ్లను బాటిళ్లలోకి ఏరుకొని సంబరపడిపోయారు.