నందమూరు పాత అక్విడెక్ట్‌ తొలగింపు | nandamur old accudit removed | Sakshi
Sakshi News home page

నందమూరు పాత అక్విడెక్ట్‌ తొలగింపు

Published Sat, May 20 2017 12:22 AM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM

నందమూరు పాత అక్విడెక్ట్‌ తొలగింపు - Sakshi

నందమూరు పాత అక్విడెక్ట్‌ తొలగింపు

తాడేపల్లిగూడెం  రూరల్‌ : తాడేపల్లిగూడెం మండలంలోని ఎర్ర కాలువ ముంపు రైతులకు శుభతరుణం మొదలైంది. ఏళ్ల కాలంగా ఈ రైతాంగాన్ని పట్టిపీడిస్తున్న నందమూరు పాత అక్విడెక్ట్‌ తొలగింపు పనులు గురువారం రాత్రి నుంచి ప్రారంభమయ్యాయి. దీంతో జగన్నాథపురం, మారంపల్లి, అప్పారావుపేట, మాధవరం, వీరంపాలెం తదితర గ్రామాల్లో 326 హెక్టార్లలోని బాడవా రైతాంగానికి ముంపు సమస్య తీరనున్నది. కలెక్టర్‌ కాటంనేని భాస్కర్‌ ఆదేశాల మేరకు ఇంజినీరింగ్‌ అధికారులు ఈ పనులు చేపట్టారు. శుక్రవారం కూడా పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఎంతో మంది ప్రజాప్రతినిధులు వచ్చినా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించలేదు. ఎట్టకేలకు రైతులే రంగంలోకి దిగి ఉద్యమ బాట పట్టడంతో అధికార యంత్రాంగం దిగివచ్చింది. 
ఫలించిన రైతుల ఆందోళన 
సార్వాలో కురిసిన వర్షాలకు జగన్నాథపురం, మారంపల్లి, అప్పారావుపేట, మాధవరం వీరంపాలెం గ్రామాల ఆయకట్టులోని పంట భూములు నీటమునిగాయి. దీంతో గత ఏడాది సెప్టెంబరు 23వ తేదీన ఆయకట్టు బాడవ రైతులు నందమూరు అక్విడెక్ట్‌ వద్ద ఆందోళన చేపట్టారు. 
అధికార యంత్రాంగం స్పందించకపోతే తామే పాత అక్విడెక్ట్‌ను కూల్చివేస్తామని హెచ్చరించారు. దీంతో పోలీస్‌ పహారా కూడా ఏర్పాటు చేశారు. ఎట ్టకేలకు దిగివచ్చిన అధికార యంత్రాంగం అప్పట్లో పాత అక్విడెక్ట్‌ వద్ద గుర్రపు డెక్క తొలగింపు పనులు చేపట్టారు. ఈ నేపథ్యం లోనే పాత అక్విడెక్ట్‌ను తొలగిస్తామని ఇరిగేషన్‌ అధికారులు వాగ్దానం చేశారు. పాత అక్విడెక్ట్‌ పనులను శుక్రవారం చేపట్టారు. దీంతో రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement