machinery
-
రూ.1,814 కోట్ల డ్రగ్స్ సీజ్
అహ్మదాబాద్/న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో భారీగా మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. ఓ ఫ్యాక్టరీ నుంచి రూ.1,814 కోట్ల విలువైన 907 కిలోల మెఫెడ్రిన్‌తోపాటు, ముడి సరుకును, యంత్ర పరికరాలను అధికారులు స్వా«దీనం చేసుకున్నారు. గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్(ఏటీఎస్), ఢిల్లీ నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ)సంయుక్తంగా జరిపిన దాడిలో బగ్రోడా పారిశ్రామిక ఎస్టేట్‌పై శనివారం దాడి జరిపినట్లు అధికారులు తెలిపారు. గుజరాత్ ఏటీఎస్ యూనిట్ సారథ్యంలో ఇంతభారీగా డ్రగ్స్ పట్టుబడిన ఘటన ఇదే. ఫ్యాక్టరీలో రోజుకు 25 కిలోల మెఫెడ్రిన్ తయారవుతోందని చెప్పారు. ఈ సందర్భంగా ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒకరు 2017లో మహారాష్ట్రలోని అంబోలిలో మెఫెడ్రిన్ పట్టుబడిన కేసులో ఐదేళ్ల జైలు శిక్ష అనుభవించాడని అధికారులు వివరించారు. అమృత్‌సర్‌లో రూ.10 కోట్ల కొకైన్ లభ్యం అమృత్‌సర్‌లో రూ.10 కోట్ల విలువైన కొకైన్‌ను స్వా«దీనం పోలీసులు చేసుకున్నారు. ఇటీవల ఢిల్లీలో రూ.5,620 కోట్ల విలువైన 560 కిలోల కొౖకైన్, 40 కిలోల మారిజువానాను సీజ్ చేయడం తెలిసిందే. ఆ కేసు దర్యాప్తు క్రమంలోనే తాజాగా కొకైన్ పట్టుబడింది. ఈ సందర్భంగా ఒక వ్యక్తితోపాటు అతడి టయోటా కారును స్వా«దీనం చేసుకున్నారు. నిందితుడు విదేశాలకు పరారయ్యేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడని అధికారులు తెలిపారు. -
‘చిరు’ యంత్రాల ఫౌండేషన్!
టేబుల్ టాప్ హల్లర్: దేశంలోనే తొలి ‘స్మాల్ మిల్లెట్ టేబుల్ టాప్ ఇంపాక్ట్ హల్లర్ వి3’ ఇది. చిన్న చిరుధాన్యాల పైపొట్టు తీసి బియ్యం తయారు చేసుకోవడానికి ఉపయోగపడే చిన్న యంత్రం ఇది. బరువు 30 కిలోలు. ముప్పావు మీటరు ఎత్తు, అర మీటరు పొడవు, అర మీటరు వెడల్పు ఉంటుంది. ఇంట్లో చిన్న టేబుల్ మీద పెట్టుకొని వాడుకోవచ్చు. మహిళలు, పిల్లలు సైతం ఉపయోగించడానికి అనువైనది. ఎక్కడికైనా సులువుగా తీసుకెళ్లవచ్చు. అతి తక్కువ 0.5 హెచ్ పి విద్యుత్తుతో పనిచేస్తుంది. సింగిల్ ఫేజ్ విద్యుత్తు లేదా సౌర విద్యుత్తు లేదా పెట్రోలు మోటారుతోనూ నడుస్తుంది. 90% సామర్థ్యంతో పనిచేస్తుంది. ఒకసారి మర పడితే 10% మెరికలు వస్తాయి. రెండోసారి మళ్లీ మరపడితే వంద శాతం బియ్యం సిద్ధమవుతాయి. చిరుధాన్యం రకాన్ని బట్టి గంటకు 30 నుంచి 80 కిలోల ధాన్యాన్ని మర పట్టొచ్చు. ఏ రకం చిన్న చిరుధాన్యాన్నయినా ఈ యంత్రానికి ఎటువంటి మార్పులు చేయాల్సిన అవసరం లేకుండానే మర పట్టుకోవచ్చు. అర కేజీ ధాన్యం ఉన్నా సరే దీన్ని ఉపయోగించవచ్చు. తక్కువ శబ్దం చేస్తుంది. 2 గంటల తర్వాత ఓ గంట విరామం ఇవ్వాలి. దీని ధర రూ. 88 వేలు (18% జిఎస్టీ అదనం). కొర్రలు, అండుకొర్రలు, సామలు, ఊదలు, అరికెలు వంటి చిన్న చిరుధాన్యాల (స్మాల్ మిల్లెట్స్) ధాన్యాన్ని వండుకొని తినాలంటే పైపొట్టు తీసి బియ్యం తయారు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్వం దంపుకొని చిరుధాన్యాల బియ్యం తయారు చేసుకునే వారు. ఇది చాలా శ్రమతో కూడిన పని. కొన్ని సంవత్సరాలుగా మిక్సీలను ఉపయోగించి ఇంటి స్థాయిలో మిల్లెట్ బియ్యం తయారు చేసుకోవటం ప్రారంభమైంది. అయితే, మిక్సీకి ఉన్న పరిమితుల దృష్ట్యా వాణిజ్య దృష్టితో చిన్న చిరుధాన్యాల బియ్యం ఉత్పత్తి చేయదలచిన రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, సహకార సంఘాలు, మహిళా స్వయం సహాయక బృందాలు, చిన్న వ్యా΄ారులు యంత్రాలను ఆశ్రయించక తప్పట్లేదు. యంత్రాల ధర అందుబాటులో లేని పరిస్థితుల్లో చిన్న చిరుధాన్యాల ప్రాసెసింగ్ పెద్ద సంస్థలు, కంపెనీలకే పరిమతం అవుతూ వచ్చింది. ఇది గ్రామాల్లో పేద రైతులు, మహిళా బృందాలు, చిన్న వ్యా΄ారులకు ఈ ప్రక్రియ పెద్ద సవాలుగా నిలిచింది. ఈ సవాలును అధిగమించడానికి ఇంటి స్థాయిలో, గ్రామస్థాయిలో మహిళలు, పిల్లలు సైతం ఉపయోగించడానికి అనువైన అనేక చిన్న యంత్రాల రూపుకల్పనలో అనేక ఏళ్లుగా విశేష కృషి చేస్తున్న తమిళనాడుకు చెందిన స్మాల్ మిల్లెట్ ఫౌండేషన్ (డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్ యాక్షన్ – ధాన్ – ఫౌండేషన్ అనుబంధ సంస్థ) విజయం సాధించింది. ఈ సంస్థ రూపొదించిన చిన్న యంత్రాల్లో ఒకటి.. దేశంలోనే తొలి ‘టేబుల్ టాప్ డీహల్లర్ మిషన్’. కొర్రలు, అండుకొర్రలు, సామలు, ఊదలు, అరికెలు వంటి ఏ రకం చిరుధాన్యాలతోనైనా, అర కిలో అయినా సరే, ఈ యంత్రంతో బియ్యం తయారు చేసుకోవచ్చు. ఇటువంటివే మనికొన్ని చిన్న యంత్రాలను ఈ ఫౌండేషన్ రూపొందించింది. అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి వచ్చిన మేలైన సాగు, శుద్ధి, విలువ జోడింపు పద్ధతులు, యంత్రాలపై నీతి ఆయోగ్ ‘మిల్లెట్ సంకలనం’ను న్యూఢిల్లీలో ఇటీవల విడుదల చేసింది. స్మాల్ మిల్లెట్ ఫౌండేషన్ ప్రజలు, శాస్త్రవేత్తలు, రైతులు అవసరాల మేరకు తయారు చేసి అందుబాటులోకి తెచ్చిన చిన్న యంత్రాలను ప్రశంసిస్తూ ఒక కథనం ప్రచురించటం విశేషం. నీతి ఆయోగ్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ నీలం పటేల్ తదితరులు ఈ సంకలనానికి సం΄ాదకులుగా వ్యవహరించారు. పోర్టబుల్ ఇంపాక్ట్ హల్లర్ టేబుల్ టాప్ హల్లర్ కన్నా కొంచెం పెద్దది స్మాల్ మిల్లెట్ పోర్టబుల్ ఇంపాక్ట్ హల్లర్ (ఎస్.ఎం.ఎఫ్. వి2). ఇది గంటకు 100 నుంచి 500 కిలోల చిన్న చిరుధాన్యాలను ్ర΄ాసెస్ చేస్తుంది. 1 హెచ్‌పి మోటారుతో త్రీఫేస్ విద్యుత్తుతో పనిచేస్తుంది. బరువు 98 కిలోలు. మీటరు ΄÷డవు, మీటరు ఎత్తు, ము΄్పావు మీటరు వెడల్పు ఉంటుంది. ఎక్కువ గంటల పాటు వాడొచ్చు. మహిళలు సైతం సురక్షితంగా, సులువుగా వాడటానికి అనువైనది. ఎస్.ఎం.ఎఫ్. వి2 ధర రూ. 1,68,000. (18% జిఎస్టీ అదనం). ఈ యంత్రాలపై ఆసక్తి గల వారు తమిళనాడులోని కృష్ణగిరి కేంద్రంగా పనిచేస్తున్న స్మాల్ మిల్లెట్ ఫౌండేషన్ (ఎస్.ఎం.ఎఫ్.) సాంకేతిక విభాగం ఇన్చార్జ్ శరవణన్‌ను 86675 66368 నంబరులో ఇంగ్లిష్ లేదా తమిళంలో సంప్రదించవచ్చు. 11న దేశీ గోవ్యాధులపై సదస్సు ఫిబ్రవరి 11(ఆదివారం) న ఉ. 7 గం. నుంచి సా. 4 గం. వరకు గుంటూరు జిల్లా కొర్నె΄ాడులోని రైతునేస్తం ఫౌండేషన్ ఆవరణలో దేశీ గో–జాతుల వ్యాధులు, ఇతర సమస్యలపై రాష్ట్ర స్థాయి సదస్సు, ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ యడ్లపల్లి వేంకటేశ్వరరావు తెలిపారు. దేశీ ఆవుల ఆరోగ్య పరిరక్షణకు తీసుకోవలసిన చర్యలపై గో పోషకులకు అవగాహన కల్పిస్తారు. గోవులకు ఉచిత వైద్య శిబిరంతోపాటు ఉచితంగా మందులు ఇవ్వనున్నట్లు తెలిపారు. అందరూ ఆహ్వానితులే. ప్రవేశం ఉచితం. వివరాలకు 97053 83666. -
హ్యాపీ ఫోర్జింగ్స్ @ రూ. 808–850
న్యూఢిల్లీ: ఆటో విడిభాగాల కంపెనీ హ్యాపీ ఫోర్జింగ్స్ ఈ నెల 19న పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. 21న ముగియనున్న ఇష్యూలో భాగంగా రూ. 400 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటితోపాటు మరో 71.6 లక్షల షేర్లను ప్రమోటర్, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. షేరుకి రూ. 808– 850 ధరల శ్రేణిలో చేపట్టనున్న ఇష్యూ ద్వారా దాదాపు రూ. 1,009 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. యాంకర్ ఇన్వెస్టర్లకు 18న షేర్లను కేటాయించనుంది. ఈక్విటీ జారీ నిధులను ఎక్విప్మెంట్, ప్లాంట్లు, మెషీనరీ కొనుగోలుతోపాటు.. రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 17 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. లూధియానా కంపెనీ ఆటో విడిభాగాలు, వ్యవసాయ పరికరాలు, ఇండస్ట్రియల్ మెషీనరీ విభాగాలలో కార్యకలాపాలు విస్తరించింది. కస్టమర్లలో అశోక్ లేలాండ్, జేసీబీ ఇండియా, ఎంఅండ్ఎం, ఎస్ఎంఎల్ ఇసుజు, టాటా కమిన్స్ తదితరాలున్నాయి. గతేడాది(2022–23) ఆదాయం 39 శాతం ఎగసి రూ. 1,197 కోట్లకు చేరగా.. నికర లాభం 47 శాతం జంప్‌చేసి రూ. 209 కోట్లను తాకింది. -
Uttarkashi tunnel collapse: నెమ్మదించిన రెస్క్యూ ఆపరేషన్
ఉత్తరకాశీ: ఉత్తరాఖండ్‌లోని ఛార్‌ధామ్ మార్గంలో సొరంగం కుప్పకూలి నాలుగు రోజులుగా లోపల చిక్కుబడిపోయిన 40 మంది కార్మికులను రక్షించే పనులను అధికారులు వేగవంతం చేశారు. ఇందుకోసం మరో భారీ యంత్రాన్ని తెప్పించారు. మూడు విడిభాగాలుగా యుద్ధవిమానాల్లో తరలించిన ఈ యంత్రాన్ని అసెంబుల్ చేసి, మరికొద్ది గంటల్లో డ్రిల్లింగ్ ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. కుప్పకూలిన టన్నెల్ శిథిలాల గుండా ఆగర్ మెషీన్ సాయంతో వెడల్పాటి స్టీల్ పైపులను లోపలికి పంపే పనులు అధికారులు మంగళవారం ప్రారంభించిన విషయం తెలిసిందే. 800, 900 మిల్లీమీటర్ల వ్యాసమున్న స్టీలు పైపులను ఒకదాని తర్వాత ఒకటి లోపలికి పంపించి వాటి గుండా కార్మికులను వెలుపలికి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. అయితే, రాత్రి వేళ డ్రిల్లింగ్ పనులు జరుగుతున్న సమయంలో మరోసారి టన్నెల్ శిథిలాలు విరిగిపడటంతో ఇద్దరు సిబ్బంది గాయపడ్డారు. ఈ ఘటనతో పనులకు అంతరాయం ఏర్పడింది. రంగంలోకి అమెరికన్ ఆగర్ అధికారులు హుటాహుటిన భారీ అమెరికన్ ఆగర్ డ్రిల్లింగ్ మిషన్ భాగాలను భారత వాయుసేన విమానాల ద్వారా 30 కిలోమీటర్ల దగ్గర్లోని చిన్యాలిసౌర్‌కు తెప్పించారు. అక్కడి నుంచి ఘటనాస్థలికి రోడ్డు మార్గంలో తీసుకువస్తున్నామని ఎస్పీ అర్పణ్ తెలిపారు. వీటిని అసెంబ్లింగ్ చేసి, పనులు ప్రారంభిస్తామని చెప్పారు. సొరంగం లోపల చిక్కుకున్న వారిని కాపాడేందుకు థాయ్‌లాండ్, నార్వే నిపుణుల సలహాలను తీసుకుంటున్నట్లు నేషనల్ హైవేస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్(ఎన్‌హెచ్‌ఐడి) డైరెక్టర్ అన్షు మాలిక్ తెలిపారు. 2018లో థాయ్‌లాండ్‌లోని ఓ గుహలో చిక్కుకుపోయిన ఫుట్‌బాల్ జట్టు జూనియర్ ఆటగాళ్లను అక్కడి సంస్థ నిపుణులు వారం పాటు శ్రమించి సురక్షితంగా తీసుకువచి్చన విషయం తెలిసిందే. -
20 శాతం వృద్ధి: టాటా హిటాచీ
కోల్‌కత: నిర్మాణ రంగానికి అవసరమైన యంత్రాల తయారీలో ఉన్న టాటా హిటాచీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 15–20 శాతం ఆదాయ వృద్ధి లక్ష్యంగా చేసుకుంది. 2021–22లో కంపెనీ రూ.4,000 కోట్ల టర్నోవర్ సాధించింది. అధిక విలువ కలిగిన మైనింగ్ యంత్రాలకు డిమాండ్ నేపథ్యంలో.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అమ్మకాల పరిమాణం 10–12 శాతం అధికం కానుందని టాటా హిటాచీ ఎండీ సందీప్ సింగ్ తెలిపారు. ‘మౌలిక రంగం నుంచి డిమాండ్ వృద్ధి 12–15 శాతం ఉంది. మైనింగ్ విభాగం నుంచి ఇది 20–25 శాతానికి ఎగసింది. మొత్తం విక్రయాల్లో మైనింగ్ విభాగం యూనిట్ల పరంగా 8 శాతం సమకూరుస్తోంది. వచ్చే మూడేళ్లలో ఈ సెగ్మెంట్ వాటా 15 శాతానికి చేరనుంది. పొరుగు దేశాలు ఆర్థిక కారణాల వల్ల దిగుమతులను తగ్గించిన తర్వాత మధ్యప్రాచ్య, ఆఫ్రికా వంటి కొత్త భౌగోళిక ప్రాంతాలలో ఎగుమతులు పెరగడానికి కంపెనీ కృషి చేస్తోంది. ఎగుమతులు ప్రస్తుతం మొత్తం వ్యాపారంలో ఏడు శాతం వాటాను కలిగి ఉన్నాయి. వచ్చే మూడేళ్లలో ఎగుమతుల వాటా 10 శాతానికి చేరాల్సి ఉంది’ అని వివరించారు. జేవీలో హిటాచీకి 60 శాతం, టాటా కంపెనీకి 40 శాతం వాటా ఉంది. కర్నాటకలోని ధార్వాడ్, పశ్చిమ బెంగాల్‌లోని ఖరగ్‌పూర్‌లో కంపెనీకి ప్లాంట్లు ఉన్నాయి. -
రైతు ఆదాయం పెంచే పట్టు యంత్రం
పట్టు గూళ్లు సాగు చేసే రైతుల ఇబ్బందులను తీర్చడంతో పాటు కూలీల ఖర్చును గణనీయంగా తగ్గించే సమగ్ర యంత్రాన్ని రైతు శాస్త్రవేత్త గురుమూర్తి శెట్టి (ఏడూరు బాబు) ఆవిష్కరించారు. చిత్తూరు జిల్లా గంగవరం మండలం ఏడూరు వాస్తవ్యుడైన ఆయన కుటుంబం రెండు తరాలుగా పట్టు గూళ్ల సాగులో నిమగ్నమై ఉంది. పదో తరగతి వరకు చదివిన గురుమూర్తి ఊహ తెలిసిన నాటి నుంచి పట్టు గూళ్ల సేకరణ ప్రక్రియలో చాకిరీని గమనిస్తున్నారు. వెదురు చంద్రికలు లేదా రోటరీ మోటేజ్ లేదా ప్లాస్టిక్ నేత్రికల్లో పెరిగిన పట్టు గూళ్లను విడిపించి అమ్మకానికి సిద్ధం చేయటం ఖర్చుతో, శ్రమతో కూడిన పని. 35 మంది కూలీలు రోజంతా శ్రమిస్తే 600 కిలోల పట్టు గూళ్లను మార్కెట్‌కు సిద్ధం చేస్తారు. ఈ పనిలో చాకిరీని తగ్గించగలిగితేనే రైతు నికరాదాయం పెరుగుతుందని ఆలోచనతో కృషి చేసిన గురుమూర్తి అందుకు ఉపయోగపడే ఓ యంత్రాన్ని మూడేళ్ల క్రితం రూపొందించారు. ఆచరణలో ఎదురైన కొన్ని సమస్యలను సైతం పరిష్కరించి సమగ్రమైన కకూన్ హార్వెస్టర్‌కు ఇటీవల రూపొందించారు. ఈ యంత్రం ఉంటే కేవలం 11 మంది కూలీలతో 600 కిలోల గూళ్లను ప్లాస్టిక్ నేత్రికల నుంచి సులువుగా విడిపించవచ్చని గురుమూర్తి తెలిపారు. పెద్దలు, పిల్లలు, ఆడ, మగ ఎవరైనా దీనిపై సులువుగా పనిచేయవచ్చు. విద్యుత్తు మోటారు లేదా మోటారు సైకిల్ ద్వారా దీన్ని నడపవచ్చు. ఇవేవీ లేకపోతే మనుషులే దీని చక్రం తిప్పుతూ గూళ్లను చంద్రికల నుంచి వేరు చేయవచ్చు. ఆకు గూళ్లు లేదా బెడ్ గూళ్లను శుభ్రం చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుండటం విశేషం. పట్టు గూళ్లపైన ఉండే నూగు లేదా ప్లాస్ లేదా జుంజరను తీసివేసి గూళ్లను నున్నగా చేసే శక్తి కూడా ఈ యంత్రానికి ఉంది. ఈ యంత్రం బరువు తక్కువ. ఆటోలో పెట్టి ఎక్కడికైనా తరలించవచ్చు. ఈ యంత్రం ధర రూ. 40 వేలు. దీనికి వాడిన నట్లు, బోల్టులు, బెల్టు.. అన్నీ గ్రామస్థాయిలో రైతులకు అందుబాటులో ఉండేవే. మరమ్మతు వచ్చినా రైతులే చేసుకోవచ్చని గురుమూర్తి వివరించారు. ఈ యంత్రాన్ని ఉత్పత్తి చేసి సెరికల్చర్ రైతులకు అందించడానికి గురుమూర్తి ‘గురూస్ ఎంటర్ప్రైజెస్’ స్టార్టప్ కంపెనీని నెలకొల్పారు. ‘రఫ్తార్’ పథకం కింద రూ.1.80 లక్షలను అందించి ప్రభుత్వం ప్రోత్సహించింది. తిరుపతి వ్యవసాయ పరిశోధనా స్థానం అధికారులు డా. సి. రమణ, డా. బాలహుస్సేన్‌రెడ్డి ఈ యంత్రం పనితీరును చూసి ముగ్ధులయ్యారు. సొంత తెలివితో యంత్రాన్ని ఆవిష్కరించిన గురుమూర్తి శెట్టి(98491 26223)కి జేజేలు! ఎలుకలకు అడుగున్నర దూరం! వరి సాగులో నారు మడి నుంచి పంట దిగుబడి వరకు ఎలుకల సమస్య రైతులను సతమతం చేస్తుంటుంది. 5–10% ధాన్యం దిగుబడి నష్టం జరుగుతూ ఉంటుంది. విష గుళికలు చల్లటం, గమ్ స్టిక్లర్ల ఎరలు పెట్టడం, బుట్టలు పెట్టి (ఎలుకకు రూ. 20–30 చెల్లించి) పట్టుకోవటం.. ఎన్ని ఉపాయాలు చేసినా ఎలుకలు తప్పించుకుంటూ నారును, పాల కంకులను కొరికేస్తూనే ఉంటాయి. అయితే, కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం వేకనూరుకు చెందిన మాజీ సాఫ్ట్వేర్ ఇంజనీర్, నాలుగేళ్లుగా సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయం చేస్తున్న మాదివాడ సురేంద్ర అనుభవాలు వేరుగా ఉన్నాయి. ఆయన ఎలుకలకు విభిన్నంగా చెక్ పెడుతున్నారు. 45 సెం.మీ. దూరంలో.. శ్రీవరి పద్ధతిలో సాధారణంగా వరి మొక్కల్ని 25–30 సెం. మీ. దూరంలో నాటేస్తూ ఉంటారు. సురేంద్ర మాత్రం కుల్లాకర్, నారాయణ కామిని, మైసూర్ మల్లిగ వంటి దేశీ వరి వంగడాల నారును ఎటు చూసినా 45 సెం.మీ. (అడుగున్నర) దూరంలో నాటేస్తున్నారు. మొక్కలు ఇంత దూరంలో ఉండటం వల్ల గాలి, వెలుతురు బాగా తగిలి ఎక్కువ దుబ్బులు కట్టడం వల్ల, ఎలుకలు కంకులను కొరికేయకుండా ఉండటం వల్ల దిగుబడి ఏమీ తగ్గటం లేదు. ఎలుకల సమస్యకు ఇది అద్భుత పరిష్కారంగా కనిపించిందని ఆయన తెలిపారు. ఇంత దూరంగా నాట్లేయటం వల్ల ఎలుకల సమస్య 90% తీరిపోయిందన్నారు. ఎలుకలు, బహుశా ప్రాణభయంతో కావచ్చు, వత్తుగా ఉండే పంట పొలాలనే ఎంచుకుంటాయి. ఎడం ఎడంగా దుబ్బులు ఉన్నప్పుడు ఏ కాకులో, ఏ గుడ్లగూబో తన్నుకుపోతాయన్న భయం వీటికి కలుగుతూ ఉండొచ్చు. అందుకే నా పొలంలోకి రావట్లేదు. వత్తుగా ఉన్న పొరుగు పొలాల్లో ఎలుకలు ఎడతెగని సమస్యగా ఉన్నాయన్నారు. రేడియో ప్రసారాలతో నారుమడికి రక్షణ! వరి నారుమడిలో కూడా ఎలుకల సమస్య తీవ్రంగా ఉంటుంది. విత్తనాలు తినేస్తాయి. మొలకలనూ కొరికేస్తూ ఉంటాయి. పొలం అంతా ఖాళీగా ఉంటుంది కాబట్టి కూడా నారుమళ్లకు ఎలుకల బెడద ఎక్కువగా ఉంటుంది. అందుకని కొందరు రైతులు కలిసి ఒకే చోట నార్లు పోసుకుంటూ ఉంటారు. అయినా, ఎలుకల సమస్య ఉండనే ఉంటుంది. సురేంద్ర ఇంటర్నెట్లో వెతికితే.. అలజడిగా ఉంటే, వెలుతురుగా ఉంటే ఎలుకలను అరికట్టవచ్చని అర్థమై.. ఆ దిశగా ప్రయత్నించి విజయం సాధించారు. ఏ భాషలోనైనా సరే నిరంతరం ప్రసారాలుండే స్టేషన్‌ను ఆన్ చేసిన రేడియోను 2 సెంట్ల నారుమడిలో రాత్రి 8.30కి పెట్టేవారు. పొద్దున్నే తీసేసే వారు. ఈ పని చేయటం ప్రారంభిచిన తర్వాత నారుమడికి ఎలుకల సమస్య లేకుండా పోయింది. విస్తారమైన వరి/మినుము పొలంలో అయితే ఎక్కువ చోట్ల రేడియోలు పెట్టాలి లేదా ఒక రేడియో నుంచి దూరం దూరంగా పొలం అంతటా సౌండ్ బాక్స్లైనా పెట్టుకోవాలి. పొలాల్లో తాటి చెట్లు ఉంటే.. దానిపై గుడ్లగూబలు, కాకులు ఉండి.. ఎలుక పిల్లలను ఏరుకు తింటూ ఉంటాయి. తాటి చెట్లు కొట్టేయటం కూడా ఎలుకల సమస్య పెరగడానికి ఓ కారణమని సురేంద్ర (88862 31122) అంటున్నారు. సెన్సార్‌తో పని చేసే సోలార్ లైట్ల ద్వారా కూడా ఎలుకలను అరికట్టవచ్చన్నారు. -
రూ.1,500 కోట్ల కేటాయించినా..రైతన్నకు పనిముట్లు అందలే
టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక గ్రామాల్లో ఒకరకంగా వ్యవసాయ యాంత్రీకరణ విప్లవం వచ్చింది. తెలంగాణ ఏర్పడక ముందు నాటి పరిస్థితితో పోల్చుకుంటే, రైతులకు యంత్రాల పంపిణీ దాదాపు రెండింతలైంది. ఈ ఏడాది రూ.10 లక్షల వరకు విలువ చేసే వరి నాటు యంత్రాలను సైతం సబ్సిడీపై అందజేయాలనే ఉద్దేశంతో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం బడ్జెట్లో రూ. 1,500 కోట్లు కేటాయించింది. సీజన్ ప్రారంభంలోనే రైతులకు యంత్రాలు చేతికి అందితే సాగుకు బాగా మేలు జరిగేది. కానీ ఇప్పటివరకు పనిముట్ల పంపిణీకి మార్గదర్శకాలే ఖరారు కాలేదు. సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ యాంత్రీకరణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తోంది. రైతులకు అవసరమైన ట్రాక్టర్లు, కోత, నూర్పిడి యంత్రాలు, పవర్ టిల్లర్లు వంటి భారీ యంత్రాలతో పాటు స్ప్రేయర్ల వంటి వ్యవసాయ పనిముట్లు సబ్సిడీపై ఇచ్చేందుకు గతంలో ఎన్నడూ లేని విధంగా రూ.1,500 కోట్లను ఈ ఏడాది బడ్జెట్లో కేటాయించింది. కానీ ప్రభుత్వ ప్రాధాన్యతకు అనుగుణంగా రైతులకు లబ్ధి చేకూర్చడంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. వానాకాలం సీజన్ మొదలుకావడం, పెరిగిన నీటి వనరుల లభ్యత, పెట్టుబడి సాయం (రైతుబంధు) సైతం అందిన నేపథ్యంలో ఇప్పటికే దాదాపు 30 లక్షల ఎకరాల్లో పంటల సాగుకు రైతులు సిద్ధమయ్యారు. ఈ సమయంలో సర్కారు లక్ష్యం మేరకు వ్యవసాయ యంత్రాలు, పనిముట్లు అందితే వారికి మరింత ఊతం లభించినట్టయ్యేది. కానీ వ్యవసాయ శాఖ ఈ దిశగా అడుగులు ముందుకు వేయకపోవడంతో, కనీసం తైవాన్ స్ప్రేయర్ వంటివి కూడా రైతులకు సబ్సిడీపై దొరకని పరిస్థితి నెలకొంది. మరోవైపు రైతుల్లో అవగాహన కల్పించేందుకు నిర్వహించాల్సిన రైతు చైతన్య యాత్రల నిర్వహణలో, రైతులకు శిక్షణ ఇచ్చే ఉద్దేశంతో నిర్మించిన రైతు వేదికల ప్రారంభంలోనూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. ఆధునికత సంతరించుకున్న సాగు వాస్తవానికి అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ వ్యవసాయ యాంత్రీకరణకు టీఆర్ఎస్ ప్రభుత్వం దన్నుగా నిలుస్తోంది. 2018 వరకు పెద్ద సంఖ్యలో ట్రాక్టర్లతో సహా పలు రకాల యంత్రాలను సబ్సిడీపై రైతులకు ఇచ్చింది. ఎస్సీ, ఎస్టీలకు ట్రాక్టర్లు సహా కొన్నింటిపై 95 శాతం, ఇతరులకు 50 శాతం సబ్సిడీతో సరఫరా చేసింది. దాదాపు 8 వేల వరకు ట్రాక్టర్లను వ్యవసాయశాఖ రైతులకు సబ్సిడీపై అందజేసింది. దీంతో రాష్ట్రంలో వ్యవసాయం ఆధునికత సంతరించుకుంది. ఒకవైపు సాగునీటి ప్రాజెక్టులతో కొత్త ఆయకట్టు పెరగడం, మరోవైపు యాంత్రీకరణ జరగడంతో పంటల ఉత్పత్తి, ఉత్పాదకత కూడా గణనీయంగా పెరిగింది. కంపెనీలు సిద్ధంగా ఉన్నా.. గతంలో ట్రాక్టర్లు పెద్ద సంఖ్యలో ఇచ్చినందున ఈ ఏడాది ప్రధానంగా వరినాట్లు పెట్టే యంత్రాలను సబ్సిడీపై ఇచ్చి రైతులకు మేలు చేయాలని ప్రభుత్వం భావించింది. ఒక్కో వరి నాటు యంత్రం రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ధర ఉండే నేపథ్యంలో మండలానికి 10 యంత్రాలను ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. అలాగే ఇతర యంత్రాలు అందజేసేందుకు పలు కంపెనీలతో మాట్లాడింది. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా అవసరమైన 5 వేలకు పైగా వరినాటు యంత్రాలను ఆయా కంపెనీలు కూడా సిద్ధం చేసి ఉంచాయి. వీటితో పాటు ఇతర యంత్రాల కోసం ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపి, నిధులు మంజూరు చేయించుకుని, రైతులకు సబ్సిడీపై పంపిణీ చేయడంలో వ్యవసాయ శాఖ విఫలమయ్యింది. ఇప్పటికే ఆలస్యం వ్యవసాయ సీజన్ ప్రారంభానికి ముందే వ్యవసాయ యంత్రాలను రైతులకు సరఫరా చేయాలి. కానీ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. వరినాట్ల యంత్రాలను సరఫరా చేయాలంటే పెద్ద తతంగమే ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు రైతుల నుంచి దరఖాస్తులు తీసుకున్నా అర్హులను తేల్చి పంపిణీ చేయడానికి కనీసం రెండు నెలల సమయం పడుతుందని గతంలో ట్రాక్టర్ల పంపిణీ అనుభవాలు చెబుతున్నాయి. ఇప్పుడు వరినాట్ల యంత్రాల పంపిణీ కూడా పారదర్శక విధానంలో చేపట్టాలంటే ఖచ్చితంగా సమయం తీసుకుంటుందని రైతు సంఘాల నేతలు చెబుతున్నారు. ప్రభుత్వంరూ.1,500 కోట్ల బడ్జెట్ కేటాయించినా సద్వినియోగం కాని తీరుపై వారు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రైతు చైతన్య యాత్రలేవీ? వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులు, ఆధునిక పోకడలు, అధునాతన సాంకేతికత వినియోగంపై రైతుల్లో అవగాహన కల్పించేందుకు నిర్వహించాల్సిన రైతు చైతన్య యాత్రలు గత మూడేళ్లుగా జరగడం లేదు. ఏటా వానాకాలం సీజన్ ప్రారంభానికి ముందు వేసవిలో 15 రోజుల పాటు రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో ఈ యాత్రలు నిర్వహించేవారు. ప్రస్తుతం అవి జరగకపోవడంతో పంటల సాగులో వస్తున్న మార్పులపై అవగాహన లేకుండా పోతోందని రైతు సంఘాలు చెబుతున్నాయి. అధికారులు మాత్రం రైతుబంధు, రైతు బీమా పథకాల అమల్లో నిమగ్నం అవ్వడం వల్లే ఈ యాత్రలు నిర్వహించలేకపోతున్నామని పేర్కొంటున్నారు. ప్రారంభం కాని రైతు వేదికలు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు వేదికలు చాలాచోట్ల ప్రారంభం కాకపోవడం కూడా విమర్శలకు తావిస్తోంది. రైతులంతా ఒకచోట సమావేశమై సాగు సమస్యలు చర్చించుకునేందుకు, రైతులకు అవసరమైన శిక్షణ ప్రధాన లక్ష్యంగా రైతు వేదికలు నిర్మించారు. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 2,601 వేదికలను నిర్మించినా చాలాచోట్ల ఇవి ప్రారంభానికి నోచుకోలేదు. ఆదిలాబాద్ జిల్లాలో 101 రైతు వేదికలు నిర్మించారు. అయితే పంచాయతీరాజ్ శాఖ ఇంకా ఆ భవనాలను వ్యవసాయ శాఖకు అప్పగించకపోవడంతో అవి ప్రారంభం కాలేదు. ఆసిఫాబాద్‌లో 70కి గాను 46 నిర్మాణాలు పూర్తికాగా, ఇందులో 13 ప్రారంభించలేదు. నిజామాబాద్ జిల్లాలో 103 వేదికలు నిర్మిస్తే 54, పాలమూరులో 88కి 25 ప్రారంభించారు. నారాయణపేట జిల్లాలో 77 రైతు వేదికలు నిర్మిస్తే కేవలం మూడు మాత్రమే ప్రారంభం కావడం ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపాన్ని స్పష్టం చేస్తోంది. సాగుకు రైతులు సిద్ధమయ్యారు. ఈ సమయంలో సర్కారు లక్ష్యం మేరకు వ్యవసాయ యంత్రాలు, పనిముట్లు అందితే వారికి మరింత ఊతం లభించినట్టయ్యేది. కానీ వ్యవసాయ శాఖ ఈ దిశగా అడుగులు ముందుకు వేయకపోవడంతో, కనీసం తైవాన్ స్ప్రేయర్ వంటివి కూడా రైతులకు సబ్సిడీపై దొరకని పరిస్థితి నెలకొంది. మరోవైపు రైతుల్లో అవగాహన కల్పించేందుకు నిర్వహించాల్సిన రైతు చైతన్య యాత్రల నిర్వహణలో, రైతులకు శిక్షణ ఇచ్చే ఉద్దేశంతో నిర్మించిన రైతు వేదికల ప్రారంభంలోనూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. ఆధునికత సంతరించుకున్న సాగు వాస్తవానికి అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ వ్యవసాయ యాంత్రీకరణకు టీఆర్ఎస్ ప్రభుత్వం దన్నుగా నిలుస్తోంది. గతంలో కూలీల కొరత సమస్యను అధిగమించడంతో పాటు ఉత్పత్తి పెంపునకు దోహదపడుతుందనే ఉద్దేశంతో పెద్ద సంఖ్యలో ట్రాక్టర్లు సహా పలు రకాల యంత్రాలను సబ్సిడీపై రైతులకు ఇచ్చింది. ఎస్సీ, ఎస్టీలకు ట్రాక్టర్లు సహా కొన్నింటిపై 95 శాతం, ఇతరులకు 50 శాతం సబ్సిడీతో సరఫరా చేసింది. దాదాపు 8 వేల వరకు ట్రాక్టర్లను వ్యవసాయశాఖ రైతులకు సబ్సిడీపై అందజేసింది. దీంతో రాష్ట్రంలో వ్యవసాయం ఆధునికత సంతరించుకుంది. ఒకవైపు సాగునీటి ప్రాజెక్టులతో కొత్త ఆయకట్టు పెరగడం, మరోవైపు యాంత్రీకరణ జరగడంతో ప్రభుత్వం ఆశించినట్లుగానే పంటల ఉత్పత్తి, ఉత్పాదకత గణనీయంగా పెరిగింది. -
అనవసర యంత్రాలతో అధిక హాని
అత్యధిక వ్యయంతో కూడిన వ్యవసాయ యంత్రాల అనవసర భారం వల్లే దేశీయ వ్యవసాయం దురవస్థల పాలవుతోందని గుర్తించకపోవడం వలన వ్యవసాయిక ప్రధాన రాష్ట్రాలైన పంజాబ్, హరియాణాలు తమ రైతులకు మరిన్ని యంత్రాలను అమ్మడానికి శతథా ప్రయత్నిస్తున్నాయి. వరి పంట కోతల కాలం సమీపిస్తుండటం, ఢిల్లీలో వాయు కాలుష్యం భీతి కలిగిస్తుండటం వల్ల, ఈ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలూ పంట కోతలు పూర్తయ్యాక మిగిలే దుబ్బు తగులబెట్టడం లేదా తొలగించడం పేరిట మరిన్ని యంత్రాలను రైతులకు అంటగట్టేందుకు రాత్రింబవళ్లు పనిచేస్తున్నాయి. పంటకోతలు పరాకాష్టకు చేరుతున్నందున, పంజాబ్ 27,972 వ్యవసాయ యంత్రాల సరఫరాను లక్ష్యంగా పెట్టుకుంది. వరి నాటు యంత్రాలు, పంట కోత యంత్రాలు, దుబ్బును తొలగించే యంత్రాలు, పొలం దున్నే యంత్రాలు వంటి పలు రకాల పనిముట్లు వీటిలో భాగం. ఇక హరియాణాలో అలాంటి 40 వేల యంత్రాలను ఇప్పటికే 900 కిరాయి కేంద్రాలకు, వేలాది విడివిడి రైతులకు ప్రత్యక్ష కొనుగోలు పద్ధతిలో సరఫరా చేశారు. రైతులకు కలుపుతీత, వరిపంట కోత యంత్రాన్ని –హ్యాపీ సీడర్ మెషీన్– 50 శాతం సబ్సిడీతో అందిస్తున్నారు. ఇకపోతే కో–ఆపరేటివ్ లేదా రైతుల బృందాలకు దీన్ని 80 శాతం సబ్సిడీతో అందిస్తున్నారు. వ్యవసాయ పనిముట్ల ఉత్పత్తిదారులకు ఇది వరం లాంటిది. చాలా కాలంగా ఈ యంత్రాలను అమ్మడానికి వీరు పెద్ద ఎత్తున లాబీ చేస్తున్నారు. పంజాబ్‌లో లక్ష ట్రాక్టర్లు అవసరమైన చోట ఇప్పటికే నాలుగున్నర లక్షల ట్రాక్టర్లను ఉనికిలోకి తెచ్చారు. ఒక యంత్రం అవసరమైన చోట పంజాబ్ రైతులు ఆరు నుంచి ఎనిమిది వరకు అదనపు యంత్రాల భారాన్ని ఎందుకు మోస్తున్నారనేది నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. ట్రాక్టర్లను మోతాదుకు, అవసరానికి మించి మోస్తుండటమే పంజాబ్ రైతులు అప్పుల ఊబిలో చిక్కుకుపోవడానికి ప్రధాన కారణమవుతోంది. వ్యవసాయ కార్యకలాపాల్లో అధిక యంత్రాల వినియోగం రైతుల రుణభారాన్ని మరింతగా పెంచుతోంది. వ్యవసాయ యంత్రాల కొనుగోళ్ల కోసం సబ్సిడీ కేటాయింపును పరిశీలిస్తే ప్రభుత్వ వ్యవసాయ విధానాలు ఎంత హ్రస్వ దృష్టితో ఉంటున్నాయో అర్థమవుతుంది. ఈ కేటాయింపుల అసలు లక్ష్యం వ్యవసాయదారుల పేరుతో వ్యవసాయ పనిముట్ల ఉత్పత్తిదారులకు సహాయం చేయడమేనా అని నాకు ఆశ్చర్యం కలుగుతుంటుంది. గతంలో కూడా పాలీ హౌస్‌ల (పాలిథిన్ షీట్ల నీడలో చేసే వ్యవసాయం)ను ఏర్పాటు చేయడానికి వాటి పరిమాణాన్ని బట్టి రూ. 25 లక్షల భారీ సబ్సిడీని అందుబాటులోకి తెచ్చారు. కానీ ఈ పాలీ హౌస్‌లలో 80 శాతం కంటే ఎక్కువగా పని చేయడం లేదని అనేక అధ్యయనాలు కోడై కూస్తున్నాయి. ఇది భారీ కుంభకోణానికి ఏమాత్రం తక్కువ కాదు. అయితే పంజాబ్, హరియాణా, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లకు ఏది అవసరమో పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ గతంలోనే సూచిం చారు. దుబ్బును తగులబెట్టకుండా, తొలగించడానికి కేంద్రప్రభుత్వం 2 వేల కోట్ల రూపాయలను మదుపు పెట్టాల్సి ఉంది. ‘క్వింటాల్ దుబ్బు తొలగింపునకు కనీసం రూ. 100లు ఇవ్వాలని మేం కేంద్రాన్ని డిమాండ్ చేశాం. ఈ మొత్తం రూ. 2 వేల కోట్లకు సమానం’ అని చెప్పారాయన. అమరీందర్ సింగ్ చెప్పింది యథార్థం. కానీ అంత డబ్బు తమ వద్ద లేదని కేంద్రం తేల్చి చెప్పేసింది. అయితే జాతీయ రహదారుల నిర్మాణం కోసం ప్రతిపాదించిన 6.9 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీలో ఒక చిన్న మొత్తాన్ని ఈ దుబ్బు తొలగింపు సమస్య పరిష్కారం కోసం ఎందుకు వెచ్చించలేరో అర్థం కాదు. కానీ వ్యవసాయం విషయానికి వచ్చేసరికి మాత్రం ప్రభుత్వం ప్రతిసారీ మొండిచేయి చూపిస్తుంటుంది. పంట అవశేషాలను తగులబెట్టడాన్ని నిరోధించే చర్యలు తీసుకుంటున్నందుకు తమపై పడుతున్న అదనపు ఖర్చులకోసం గాను ఎకరాకు రూ.6 వేలను పరిహారంగా అందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. పైగా పంజాబ్‌లో పనికి ఆహార పథకంలో 12.5 లక్షల మంది కార్డుదారులు ఉన్నారు. ఈ పథకం కింద అందుబాటులో ఉన్న రూ. 4 వేల కోట్లను ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించలేకపోతోంది. పంట కోతల అనంతరం పొలంలో మిగిలే దుబ్బు నిర్వహణను పనికి ఆహార పథకంలో భాగం చేసినట్లయితే ఖాళీగా ఉన్న రైతుకూలీలకు పని కల్పించడమే కాకుండా, దుబ్బును తగులబెట్టడం ద్వారా కలుగుతున్న పర్యావరణ విధ్వంసాన్ని పరిష్కరించవచ్చు కూడా. వ్యాసకర్త: దేవిందర్‌శర్మ, వ్యవసాయ నిపుణులు ఈ–మెయిల్ : hunger55@gmail.com -
వ్యవసాయోత్పత్తులకు గడ్డుకాలం
వ్యవసాయ రంగంలో 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని 2016 ఫిబ్రవరి 22న ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలిలో ప్రధాని మోదీ ప్రకటించారు. ఈ ప్రతిపాదనను సాఫల్యం చేయడానికి నీతి ఆయోగ్‌ను ఆదేశించారు. ప్రణాళికాబోర్డును రద్దుచేసి, దానిస్థానంలో నీతి ఆయోగ్‌ను ఏర్పర్చిన తర్వాత ఈ సంస్థ ప్రతిపాదించిన సూచనలు, నివేదికలు కార్పొరేట్లకు అనుకూలంగా వున్నాయే తప్ప, సామాన్య ప్రజలకు ఏమాత్రం ప్రయోజనకరంగా లేవని ఆచరణ రుజువు చేసింది. రైతుల ఆదాయం రెట్టింపుచేసే బాధ్యతను తీసుకున్న నీతి ఆయోగ్ 4 సూచనలను ప్రకటించింది. 1. వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పించటం 2. వ్యవసాయ ఉత్పత్తులు పెంచటం 3. భూసంస్కరణలు అమలుచేసి పేదలకు భూములు పంచటం 4. రైతులకు సహాయం అందించటం ద్వారా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయవచ్చని సూచించింది. అసలు పెరుగుదల అంటే ఏమిటి? ఏ ప్రాతిపదికగా పెరుగుదలను పరిశీలించాలి? 1. రైతుల ఆదాయం 2. ఉత్పత్తి పెరుగుదల 3. వ్యవసాయ రంగంలో అదనపు విలువ పెంపుదల 4. దేశీయ స్థూల ఉత్పత్తిలో వ్యవసాయ ఉత్పత్తుల పెరుగుదల. పై నాలుగింటిలో ఏ రంగంలో పెరుగుదల వల్ల రైతుల ఆదాయం పెరుగుతుంది? ఈ నాలుగు అంశాలను పరిశీలించిన నిపుణుల కమిటీ భారతదేశంలో ప్రస్తుత విధానాల ఫలితంగా వ్యవసాయ ఉత్పత్తులు పెరగడం కానీ, రైతు ఆదాయం పెరగడం కానీ అసాధ్యమని ఈ మధ్య తేల్చారు. గిట్టుబాటు ధరలు రెండు విధాలుగా చూడాలి. 1. మార్కెట్ సంస్కరణలు 2. కనీస మద్దతు ధర నిర్ణయం. మార్కెట్ సంస్కరణల విషయంలో రాజ్యాంగం రీత్యా రాష్ట్ర ప్రభుత్వం సంస్కరణలు చేపట్టాలి. కానీ కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు మార్కెట్ చట్టాలను కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా మార్చి బిల్లులు తయారుచేసి తమ తమ శాసనసభలలో ఆమోదానికి పెట్టాల్సిందిగా ఆదేశిం చింది. తెలుగు రాష్ట్రాలు రెండూ ఆ బిల్లులను ఆమోదించాయి. ఈ చట్ట సభల ద్వారా కార్పొరేట్ సంస్థలకు మార్కెట్లలో కొనుగోలుచేసే అవకాశం కల్పిం చారు. ధరలను ఆ సంస్థలే నిర్ణయిస్తాయి. కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరల నుంచి వైదొలిగి రాష్ట్రాలపై నెట్టివేసింది. గిట్టుబాటు ధరలు నిర్ణయించటం, వాటిని అమలుచేసే బాధ్యతను కేంద్రం గానీ, రాష్ట్రంగానీ ఇంతవరకూ ప్రకటించలేదు. కేంద్రం ధరలు ప్రకటించి చేతులు దులుపుకోగా, రాష్ట్రం నేటికీ ధరల అమలుపై తన బాధ్యతను ప్రకటించలేదు. ఉత్పత్తిని పెంచడం: గత సంస్కరణల నుండి (1997 నుండి) మన దేశీయ పరిశోధనల విభాగాలను దాదాపుగా మూసివేశారు. బహుళజాతి సంస్థలైన మోన్శాంటో, డూపాంట్, కార్గిల్, సింజెంటా సంస్థలు 80% ప్రయోగాలను చేస్తుండగా, వాటిని మన దేశంలో వినియోగిస్తున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో 27 కేంద్రాలలో 5 వేల ఎకరాల భూమి పరిశోధనల కొరకు కేటాయించబడినప్పటికీ, ఆ పరి శోధనా కేంద్రాలన్నింటినీ మూసివేయడం జరిగింది. ఇలాంటి స్థితిలో ఉత్పాదకత ఎలా పెరుగుతుంది? సహాయక చర్యలు: ప్రస్తుతం బడ్జెట్లో 2.5% మాత్రమే వ్యవసాయ రంగానికి కేటాయిస్తున్నారు. పేద దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్, టర్కీ దేశాలు తమ బడ్జెట్లో 5 నుంచి 8 శాతం కేటాయించాయి. 8 రకాల సబ్సిడీలను రైతులకు అందచేస్తున్నారు. పంటల బీమా ప్రీమియం పూర్తిగా ప్రభుత్వాలే చెల్లిస్తున్నాయి. నిర్ణయించిన ఆదాయం, నిర్ణయించిన ధరలు మార్కెట్లో తగ్గితే ఆ లోటును కూడా ప్రభుత్వాలు రైతుకు నగదుగా ఇస్తున్నాయి. కానీ ఇందులో ఏ ఒక్కటీ భారతదేశంలో అమలు జరగడం లేదు. రెట్టింపు కావడానికి చేపట్టాల్సిన చర్యలు: నాణ్యత గల వ్యవసాయ ఉపకరణాలు స్వదేశీ టెక్నాలజీలో పరిశోధన చేసి రైతులకు సకాలంలో అందించాలి. వ్యవసాయ భూమి తగ్గుదలను అరికట్టాలి. సకాలంలో పంటలకు సాగునీటి వసతి కల్పించాలి. సకాలంలో రుణాలు ఇవ్వాలి. ముఖ్యంగా దీర్ఘకాలిక రుణాలు వడ్డీ లేకుండా ఇవ్వడంతోపాటు, సహకార వ్యవస్థను బలపర్చాలి. పంటలు వేసేటప్పుడే ధరలు నిర్ణయించి, ఆ ధరలను అమలు జరపాలి. ప్రభుత్వమే అన్ని పంటలకు ప్రీమియం చెల్లించాలి. 60 సం.లు దాటిన రైతులకు పెన్షన్లు ఇవ్వాలి. బడ్జెట్లో 6% వ్యవసాయ రంగానికి కేటాయించాలి. పరిశోధనా కేంద్రాలలో స్థానిక వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా విత్తనోత్పత్తి చేసి, రైతులకు అందించాలి. కార్పొరేట్ల జోక్యం ఉన్నంతకాలం రైతుల ఆదా యం పెరగదని ప్రపంచబ్యాంకు అనుకూల నిపుణులే వ్యాఖ్యానిస్తున్న అంశాలను కేంద్రం దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం ప్రకటించిన విధానాలను మార్చాలి. వ్యాసకర్త: సారంపల్లి మల్లారెడ్డి, వ్యవసాయ నిపుణులు మొబైల్ : 94900 98666 -
యంత్రం...కుతంత్రం
► యంత్రాలతో ఉపాధి పనులు ► కూలీల నగదు దిగమింగే ప్రయత్నం ఉదయగిరి/వరికుంటపాడు : జాతీయ ఉపాధిహామీ పనులకు సంబంధించి యంత్రాలు ఉపయోగించకూడదు. కానీ ఈ నిబంధనను తుంగలో తొక్కి యంత్రాలతో పనులు చేస్తూ ఉపాధి కూలీల సొమ్మును దిగమింగే ప్రయత్నం వరికుంటపాడు మండలంలో యథేచ్ఛగా సాగుతోంది. కొంతమంది అధికార పార్టీ కార్యకర్తలు ఉపాధి హామీ సిబ్బందిలో స్థానం సంపాదించుకొని అందులో పనిచేస్తున్న అధికారులను ప్రసన్నం చేసుకొని నిధులు దోపిడీ చేస్తున్నారు. అధికారులు కూడా అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి ఏమీ చేయలేని నిస్సహాయస్థితిలో చేతులెత్తేస్తున్నారు. యంత్రాలతో ఉపాధి పనులు చేయిస్తే ఇంటికెళ్లవలసిందేనని ఓ వైపు జిల్లా కలెక్టర్, డ్వామా పీడీ హెచ్చరిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయి సిబ్బంది మాత్రం ఖాతరు చేయడం లేదు. వరికుంటపాడు మండలం గువ్వాడిలో వర్క్ ఐడీ నం.091240219021170083తో ఎస్సీ కాలనీల్లో ఇంటి స్థలాల లెవెలింగ్ పేరుతో రూ.3,17,591 నిధులు మంజూరు చేశారు. దీనికి 771 మంది కూలీలను వినియోగించవలసి ఉంది. ఇందులో కూలీలు మట్టిని తవ్వి ట్రాక్టర్లకు పోస్తారు. దీనిని ఎస్సీ కాలనీల్లో అవసరమైన వారికి ఇంటి స్థలాలు చదును చేసేందుకు తోలుతారు. ట్రాక్టరు రవాణాకు సంబంధించి యజమానికి నగదు ఇస్తారు. కానీ ఇక్కడ నిబంధనలు తుంగలో తొక్కి అధికార పార్టీకి చెందిన ఓ మేట్ తన పలుకుబడి ఉపయోగించి ముందస్తు వ్యూహం ప్రకారం గురు, శుక్రవారాల్లో పొక్లయిన్ ఉపయోగించి ట్రాక్టర్ల ద్వారా ఎస్సీ కాలనీల్లో ఇంటింటికి అవసరమున్నా, లేకపోయినా మట్టి తోలారు. ఎటువంటి అభ్యంతరాలు లేకపోతే తమకు అనుకూలమైన గ్రూపుల పేర్లతో మస్టర్లు వేసి నగదు కాజేసేందుకు వ్యూహరచన చేశారు. ఒకవేళ అభ్యంతరాలు వస్తే ప్రస్తుతానికి ఆ వర్క్‌కు మస్టర్లు వేయకుండా ఆపివేసి అనుకూలమైన సమయంలో మస్టర్లు వేసుకొని నిధులు దిగమింగే విధంగా ప్రణాళిక రూపొందించుకున్నారు. అదేవిధంగా గ్రామంలో చెరువుకట్టపైనున్న చెట్లను యంత్రాలతో తొలగిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి ఉపాధిహామీ పథకం కింద ఈ పని మంజూరు కాలేదు. ముందుగా పనిచేసి ఆ తర్వాత ఆ పనికి సంబంధించి మంజూరుపొంది దానికి సంబంధించిన నిధులను కాజేసేందుకు ఈ ప్రయత్నం చేస్తున్నట్లు పలువురు గ్రామస్తులు చెబుతున్నారు. మట్టి తోలకంతో ఇక్కట్లు ఎస్సీ కాలనీల్లో నీరు నిలబడే ఇళ్లను గుర్తించి ఆ ఇళ్లకు అవసరమైన మేరకు మంచి మరసతో కూడిన మట్టిని తోలవలసి ఉంది. కానీ ఈ పనిచేయించిన కాంట్రాక్టరు తాను గతంలో ఇరిగేషన్ కింద పనిచేసిన చెక్‌డ్యాంలో ఉన్న మట్టిని ఎస్సీ కాలనీలకు తరలించారు. ఈ మట్టి నాణ్యత లేకపోవడం, పెద్దపెద్ద రాళ్లు, గుండులతో కూడి ఉండటంతో దీనిని ఎలా చదును చేసుకోవాలని ఎస్సీ కాలనీవాసులు ప్రశ్నిస్తున్నారు. పైగా అవసరం లేకపోయినప్పటికీ పలువురి ఇళ్లముందు మట్టి తోలారు. దీంతో తమకు చాలా ఇబ్బందిగా ఉందని వారు చెబుతున్నారు. అయితే సదరు కాంట్రాక్టరు ఒకే పనికి రెండు బిల్లులు పొందే ప్రయత్నం చేశారు. ఇరిగేషన్ కింద చేపట్టిన చెక్‌డ్యాం పూడికతీత పనికి సంబంధించిన బిల్లు, ఈ పూడికను ఎస్సీ కాలనీలకు తోలడం ద్వారా ఆ పనికి సంబంధించిన నగదును కాజేసే ప్రయత్నం చేసినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. -
వ్యవ‘సాయం’లో మహీంద్రా ట్రింగో
♦ అద్దెకు ట్రాక్టర్లు, యంత్రాలు ♦ సొంత యంత్రాలుంటే... వారే ఫ్రాంచైజీలు ♦ దశలవారీగా దేశవ్యాప్త విస్తరణ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ట్రాక్టర్లు కొనలేని వారికి వాటిని అద్దెకివ్వటం కూడా చేయాలని వాహన తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా భావిస్తోంది. ఇందుకోసం ‘ట్రింగో’ పేరిట ఓ యాప్ ద్వారా పలు సేవల్ని అందుబాటులోకి తెస్తోంది. సాగుకు కావాల్సిన ట్రాక్టర్లు, యంత్ర పరికరాలను అద్దెకివ్వడమే ఈ కొత్త సేవల లక్ష్యం. ఖరీదైనవి కావడంతో లక్షలాది మంది రైతులు ట్రాక్టర్లు, యంత్ర పరికరాల కొనుగోలుకు దూరంగా ఉంటున్నారు. వ్యవసాయం ఒకవంక పెరుగుతున్నా... ట్రాక్టర్ల పరిశ్రమ గతంలో ఏడాదికి 6.30 లక్షల యూనిట్లు విక్రయించి... ఇపుడు 5 లక్షల లోపే నమోదు చేస్తోందంటే... కారణమదే. దీంతో ఫ్రాంచైజీలను ప్రోత్సహించడం ద్వారా తక్కువ అద్దెకు అత్యాధునిక యంత్ర పరికరాలను రైతులకు అందుబాటులో ఉంచాలని మహీంద్రా భావిస్తోంది. ట్రింగో యాప్ లేదా ఫోన్ ద్వారా రైతులు తమ అవసరం ఏంటో చెబితే చాలు... చెప్పిన సమయానికి పొలం ముందు ఇవి ప్రత్యక్షమవుతాయి. తొలుత ఈ సేవలు మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, మధ్యప్రదేశ్, కర్ణాటకలో అందుబాటులోకి రానున్నాయి. దశల వారీగా దేశవ్యాప్తంగా విస్తరిస్తారు. అదనపు ఆదాయం..: రెండు మూడు నెలల అవసరానికి ట్రాక్టర్లు, యంత్రాలను కొనుగోలు చేయడం వృథా అన్న భావన చాలామందికి ఉంటుంది. మరోవైపు రైతులందరికీ వీటిని కొనుగోలు చేసే స్తోమత లేదని మహీంద్రా ఈడీ పవన్ గోయెంకా చెప్పారు. ఇటువంటి వారికి ట్రింగో పెద్ద ఉపశమనమని చెప్పారాయన. కాగా, ట్రాక్టర్లు, వీడర్లు, రైస్ ట్రాన్స్‌ప్లాంటర్, ఫెర్టిలైజర్ స్ప్రెడర్, హార్వెస్టర్, బేలర్, ష్రెడ్డర్, ముల్చర్, కేన్ థంపర్ తదితర యంత్రాలు సొంతానికి కొన్నా వీటి వినియోగం కొన్ని రోజులకే పరిమితమవుతోంది. మిగిలిన రోజులు ఓ మూలన పడి ఉంటున్నాయి. ఇటువంటి యజమానులు ఫ్రాంచైజీలుగా మారి తమవద్ద ఉన్న యంత్రాలను అద్దెకు ఇవ్వవచ్చు. కంపెనీతో చేతులు కలపడం ద్వారా అదనపు ఆదాయం సమకూర్చుకోవచ్చు. ట్రింగో అగ్రిగేటర్ పాత్ర పోషిస్తూ రైతులను, యజమానులతో అనుసంధానిస్తుంది. సేవలకుగాను ఫ్రాంచైజీల నుంచి కమిషన్ తీసుకుంటుంది. మహీంద్రాతోపాటు ఇతర బ్రాండ్ల ట్రాక్టర్లనూ అద్దెకు ఇవ్వవచ్చు. నియంత్రణలో చార్జీలు..: కర్ణాటక ప్రభుత్వం చేపట్టిన కస్టమ్ హైరింగ్ స్కీంలో మహీంద్రా సైతం భాగస్వామిగా ఉంది. రైతులకు తక్కువ ధరకే అద్దెకు ట్రాక్టర్లు, యంత్రాలు అందుబాటులో ఉండేందుకు ప్రభుత్వం నిధులు సమకూరుస్తోంది. ఇతర రాష్ట్ర ప్రభుత్వాలతోనూ తాము చర్చిస్తున్నామని సాహా తెలిపారు. గుజరాత్లో చేపట్టిన పైలట్ ప్రాజెక్టు విజయవంతమైందన్నారు. ఔత్సాహికులకు వ్యాపార అవకాశమని, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని చెప్పారు. ఇక ట్రింగో సేవల్లో యంత్రాలు, నేల రకాలు, సమయాన్నిబట్టి అద్దె ఎంత ఉండాలో మహీంద్రా నిర్ణయిస్తుంది. మహీంద్రాతో తొలి అడుగు.. భారత్‌లో ట్రాక్టర్లు, యంత్రాల అద్దె వ్యాపారం పూర్తిగా అవ్యవస్థీకృత రంగంలో ఉంది. ఏటా రూ.15,000 కోట్ల వ్యాపారం జరుగుతోంది. మహీంద్రా అడుగు పెట్టడం ద్వారా పరిశ్రమకు కొత్తరూపు రానుంది. మరో విశేషమేమంటే ట్రాక్టర్ల అమ్మకాల పరంగా భారత్‌లో తొలి స్థానాన్ని సొంతం చేసుకున్న మహీంద్రా... వ్యవసాయ పనిముట్ల తయారీలోనూ తనదైన ముద్రవేసింది. 2015-16లో సుమారు 5 లక్షల ట్రాక్టర్లు అమ్ముడయితే దీన్లో 41 శాతం వాటా మహీంద్రాకు ఉంది. 85-90 శాతం మంది వాయిదా పద్ధతిలో ట్రాక్టర్లను, యంత్రాలను కొనుగోలు చేస్తున్నారు. తమ కస్టమర్లలో ప్రస్తుతం 35-40 శాతం మందికి మహీంద్రా ఫైనాన్స్ రుణం సమకూరుస్తోందని కంపెనీ సేల్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఎస్.సాహా సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. -
హరితవిల్లు
త్వరలో జిల్లా నందనవనంగా మారనుంది. ప్రతి మూలన పచ్చలహారం పరచడానికి జిల్లా యంత్రాంగం కార్యాచరణ సిద్ధం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘హరితహారం’ కింద జిల్లావ్యాప్తంగా 2.34 కోట్ల మొక్కలను నాటేందుకు ప్రణాళిక రూపొందించింది. జూలై 3 నుంచి 10వ తేదీ వరకు ఖాళీ ప్రదేశాల్లో విరివిగా మొక్కలు నాటాలని నిర్ణయించిన యంత్రాంగం.. దీంట్లో ప్రజలను భాగస్వాములను చేయాలని సంకల్పించింది. అందులో భాగంగా శనివారం జెడ్పీ హాల్లో ప్రజాప్రతినిధులతో హ రితహారం అమలుపై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. - సాక్షి , రంగారెడ్డి జిల్లా ప్రతినిధి సాక్షి , రంగారెడ్డి జిల్లా ప్రతినిధి జిల్లావ్యాప్తంగా ఏడు వేల హెక్టార్లలో మొక్కలు నాటాలని సూత్రప్రాయంగా ప్రతిపాదనలు తయారు చేశారు. దీంట్లో ప్రభుత్వ స్థలాల్లేకుండా.. పారిశ్రామిక అవసరాలకు నిర్దేశించిన స్థలాలూ ఉన్నాయి. వీటి తోపాటు 315 కిలోమీటర్ల పొడవున ఉన్న ఆర్అండ్బీ రోడ్లకిరువైపులా మొక్కల పెంపకాన్ని చేపట్టాలని నిర్ణయించారు. 2,982 కి.మీ మేర పంచాయతీరాజ్ మార్గాలు, 60కి.మీ. మున్సిపల్ రహదారులు.. ఇలా ప్రతి దారికి రెండువైపులా పచ్చదనం అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ‘ఉపాధి’కే మొక్కల సంరక్షణ నియోజకవర్గానికి 40లక్షల మొక్కల చొప్పున నాటాలని లక్ష్యంగా పెట్టుకున్న యంత్రాంగం.. వీటి సంరక్షణను ఉపాధి కూలీలకు అప్పగించాలని యోచిస్తోంది. గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎన్ఆర్ఈజీఎస్)లో మొక్కల పెంపకానికి (వాచ్ అండ్ వార్డ్) ప్రత్యేక పద్దు ఉన్నందున.. వీటిని హరితహారం మొక్కల సంరక్షణకు వినియోగించుకోవాలని నిర్ణయించినట్లు కలెక్టర్ రఘునందన్‌రావు తెలిపారు. మొక్కల సంఖ్యను బట్టి కూలీని నిర్ధారిస్తామని, బ్లాకులు, బహిరంగ ప్రదేశాల్లో మొక్కల పోషకులకు ఉపాధి కూలీలను నియమిస్తామని చెప్పారు. ప్రైవేటు సం స్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో మొక్క ల నిర్వహణను ఆయా సంస్థలే చూసుకోవాలని స్పష్టం చేశారు. రిజర్వ్ ఫారెస్ట్‌లో వనాల సంరక్షణ బాధ్యత అటవీశాఖదేనని చెప్పారు. సాగర్ హైవేకిరువైపులా హరితహారం మొక్కల నిర్వహణ బాధ్యత ఆర్‌అండ్‌బీకి అప్పగించినట్లు ఆయన వివరించారు. జిల్లా వైశాల్యం 7.49 లక్షల హెకార్లు. ఇందులో 9.75% మాత్రమే అట వీ విస్తీర్ణం ఉంది. అటవీ ప్రాంతం వెలుపల సుమారు 3.45% చెట్లు ఉన్నాయి. అంటే జిల్లాలో 13.20 శాతం మాత్రమే పచ్చదనం ఉందన్నమాట. జిల్లా భూభాగంలో 33.33 శాతం ఉద్యానం కావాలంటే మిగతా 20.13శాతం ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటాలని నిర్ణయించారు. ఈ మేరకు హరితహారం కార్యక్రమంలో 2.34 కోట్ల మొక్కల (26 వృక్ష జాతులు)కు ఊపిరిలూదడానికి ప్రణాళిక తయారు చేశారు. ఏజెన్సీ= మొక్కలు (లక్షల్లో) సామాజిక అడవులు (రంగారెడ్డి జిల్లా)= 80 హైదరాబాద్ (ప్రాదేశిక)= 50 నీటి యాజమాన్యసంస్థ= 102 ఉద్యానశాఖ= 2 -
అన్నీ సంస్కృతంలోనే ఉన్నాయి!
సైన్స్ కాంగ్రెస్‌లో కేంద్ర మంత్రి జవదేకర్ మన ప్రాచీన సైన్స్ సిద్ధాంతాలు తర్క సహితం ముంబై: భారత శాస్త్రవేత్తలంతా ప్రాచీన సంస్కృత విజ్ఞాన శాస్త్రాలను మదించాలని.. ఆ శాస్త్రాల్లోని సాంకేతిక నిధిని మానవాళి అభివృద్ధికి ఉపయోగించాలని కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. భారతీయ ప్రాచీన సైన్స్ సిద్ధాంతాలు శతాబ్దాల అనుభవ సారం, తర్కం ఆధారంగా రూపుదిద్దుకున్నాయని అన్నారు. శాస్త్రీయ అంశాల్లో వందల ఏళ్ల పరిశీలనలు, అనుభవాలను అత్యంత సూక్ష్మస్థాయిలో అవగాహన చేసుకున్నాకే మన పూర్వీకులు ఆయా సిద్ధాంతాలను రూపొందించారన్నారు. శాస్త్రీయ పరికరాలు, యంత్రాలు పెద్దగా అందుబాటులో లేకున్నా.. సూక్ష్మస్థాయిలో పరిశీలనలు, అనుభవాలు, తర్కం ఆధారంగానే భారతీయ విజ్ఞానం ఆవిర్భవించిందని, ఆ విజ్ఞానాన్ని తప్పనిసరిగా గుర్తించాలన్నారు. ముంబై యూనివర్సిటీలో ‘102వ భారత సైన్స్ కాంగ్రెస్’లో రెండోరోజైన ఆదివారం ‘సంస్కృతం ద్వారా ప్రాచీన భారతీయ విజ్ఞానం’ అంశంపై జరిగిన గోష్టిలో మంత్రి ప్రసంగించారు. ‘మన సంస్కృతం, పురాతన సైన్స్ ఆధారంగా జర్మన్లు, ఇతరులు కొత్త ఆవిష్కరణలు చేసినప్పుడు మనం మాత్రం ఎందుకు చేయలేం?’ అని ప్రశ్నించారు. జర్మన్లు శ్రద్ధతో సంస్కృతాన్ని ఉపయోగించుకుని కొత్త ఆవిష్కరణలు చేశారని, భారత్‌కు నేడు సృజనాత్మక ఆవిష్కరణలు చేసే సంస్కృతి చాలా అవసరమన్నారు. వేదకాలంలోనే జంబో విమానాలు! భారత్‌లో పురాతన కాలంలోనే విమాన సాంకేతికత అందుబాటులో ఉండేదని పైలట్ శిక్షణ కేంద్రం రిటైర్డ్ ప్రిన్సిపల్, కెప్టెన్ ఆనంద్ జె బోదస్ వెల్లడించారు. రుగ్వేదాన్ని పేర్కొంటూ ఆయన ప్రాచీన విమానయానానికి సంబంధించిన ఆధారాలను వివరించారు. సదస్సులో ఆదివారం ‘వేదాల్లో ప్రాచీన విమానయాన సాంకేతికత’ అంశంపై ఆనంద్ ప్రసంగించారు. ఆయనేమన్నారంటే.. ‘ఒక దేశం నుంచి మరో దేశానికే కాదు.. ఒక గ్రహం నుంచి మరో గ్రహానికి సైతం వెళ్లగల విమానాల గురించి భరద్వాజ మహర్షి 7 వేల ఏళ్ల క్రితమే మాట్లాడారు. భారత్‌లో ప్రాచీన విమానయానానికి సంబంధించి 97 పుస్తకాల్లో ఆధారాలున్నాయి. అప్పటి విమానాల్లో 40 చిన్న ఇంజిన్లు ఉండేవి. ‘రూపర్కన్ రహస్య’ రాడార్ ద్వారా విమానం ఆకారం పరిశీలకుడికి కనిపించేది’ అని చెప్పారు. భారత ప్రాచీన సైన్స్‌పై చర్చించేందుకు ఐఎస్సీ వందేళ్లు ఎందుకు తీసుకుందని సదస్సులో ప్రసంగించిన పరమ్ సూపర్ కంప్యూటర్స్ రూపకర్తవిజయ్ భట్కర్ ప్రశ్నించారు. ఇది ప్రతి సదస్సులోనూ భాగం కావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కాగా, సదస్సులో భాగంగా చిల్డ్రన్స్ సైన్స్ కాంగ్రెస్‌ను మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ప్రారంభించారు. మానవజాతికి వివిధ వ్యాధుల చికిత్సకు జెనెటిక్ ఇంజనీరింగ్ పరిష్కారం వంటి పలు అంశాలపై విద్యార్థులతో మాట్లాడారు. -
మీకేం కాదు..మేమున్నాం
సాక్షి ప్రతినిధి, కడప: రేషన్ డీలర్ల వ్యవహారంలో అక్రమ ఆదాయానికి చెక్ పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. పక్కాగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేస్తూ విధివిధానాలు రూపొందిస్తోంది. అమలు చేయాల్సిన యంత్రాంగం క్షేత్రస్థాయిలో నీరుగారుస్తోంది. అక్రమార్కులకు దొరల మార్గాన్ని చూపిస్తున్నారు. దీంతో ప్రభుత్వం అనుకున్న లక్ష్యం నెరవేరడం లేదు. చేతులు బరువెక్కడంతో ోగస్ ఏరివేతకు రెవిన్యూ యంత్రాంగం మంగళం పలుకుతున్నారు. దీంతో రేషన్‌షాపు డీలర్ల అక్రమ ఆదాయానికి డోకా లేకుండా పోతోంది. జిల్లాలో 6.85లక్షల రేషన్ కార్డులు, 50వేల పైచిలుకు అంత్యోదయ కార్డులున్నాయి. ఇందుకుగాను 1704 చౌకదుకాణాల ద్వారా నిత్యావసర సరుకులు అందుతున్నాయి. వీటి పరిధిలో బోగస్ కార్డులను ఇదివరకే నాలుగు విడతల్లో ఏరివేత నిర్వహించారు. అప్పట్లో 50వేల వరకూ బోగస్ కార్డులున్నట్లు గుర్తించారు. కాగా రేషన్ కార్డులను ఆధార్ ద్వారా సీడింగ్ చేయాలని ప్రభుత్వం నిర్ధేశించింది. తద్వారా బోగస్ కార్డుల సమస్య ఉత్పన్నం కాదని భావించింది. వాస్తవంగా ఆధార్ సీడింగ్ నిర్వహించడం ద్వారా బోగస్ ఏరివేతకు మార్గం సుగమం అవుతుంది. రేషన్‌కార్డుదారుల నుంచి డీలర్లు ఆధార్ కార్డులు సేక రించారు. ఆధార్ ఇవ్వకపోతే బియ్యం మంజూరు కావని తెలియడంతో నిరుపేద కుటుంబాల వారు ఆధార్ సీడింగ్‌కు సహకరించారు. ఒక్కొక్క రేషన్ డీలర్ పరిధిలో 10 నుంచి 20 శాతం కార్డులు ఆధార్ సీడింగ్ కాలేదు. అలాంటి లబ్ధిదారుల జాబితాకు బియ్యం కోటా నిలిపేశారు. వారిలో కొందరు సకాలంలో ఆధార్ అందించకపోగా, తక్కినవి బోగస్ కార్డులుగా తెలుస్తోంది. ఆధార్ లేకపోతే రేషన్ నిలిపాం: ఏఎస్ఓ సుబ్బారెడ్డి ఆధార్ సీడింగ్ కాకపోతే రేషన్ నిలిపిన విషయం వాస్తవమే. బోగస్ కార్డులకు పక్క రాష్ట్రాల నెంబర్లు వేస్తున్నారన్న విషయం ఇప్పుడే తెలుస్తోంది. ఈవిషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తాం. వరద సహాయక కార్యక్రమాలకు వెళ్లిన డీఎస్ఓ రాగానే ఆయన దృష్టికి తీసుకెళతాం. అక్రమాలకు పాల్పడే రేషన్ డీలర్లతో పాటు రెవిన్యూ సిబ్బందిపై కఠిన చర్యలు తప్పకుండా తీసుకుంటాం. చేతివాటం ప్రదర్శిస్తున్న రెవెన్యూ యంత్రాంగం.... రేషన్‌కార్డుల ఆధార్ సీడింగ్ విధానాన్ని నిక్కచ్చిగా అమలు చేయాల్సిన అధికార యంత్రాంగం చేతివాటం ప్రదర్శిస్తోంది. ఆధార్ కార్డులు లేని లబ్ధిదారులకు రేషన్ కోత విధించారు. దీంతో నీటిలోని చేప ఒడ్డున పడ్డట్లుగా రేషన్ డీలర్లు గిలగిలలాడిపోయారు. వారి పరిధిలోని బోగస్ కార్డులకు ఆధార్ సీడింగ్ ఎలా సాధ్యమో దారి చూపాలంటూ అభ్యర్థనలు మొదలయ్యాయి. దీంతో రెవెన్యూ యంత్రాంగం రేషన్ డీలర్ల మధ్య ఒప్పందం కుదిరింది. అందులో భాగంగా ఆధార్ 14అంకెల సంఖ్యను బోగస్ కార్డులకు పొందుపరుస్తున్నారు. కర్నాటక రాష్ట్రానికి చెందిన ఆధార్ నెంబర్లను బోగస్ కార్డులకు వేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఒక్కొక్క కార్డుకు రూ. వంద చొప్పున నూరు బోగస్ కార్డులు కల్గిన రేషన్ డీలర్ రూ.10వేలు సమర్పిస్తే వ్యవహారం చక్కబెడుతున్నట్లు తెలుస్తోంది. జిల్లా కేంద్రానికి సమీపంలోని మండలాలలో జరుగుతున్న ఈ తతంగం ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా పాకుతున్నట్లు సమాచారం.