ఆర్.ప్రీతా
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): ఇస్రో తొలినాళ్లలో ఎడ్లబండి, సైకిల్‌పై శాటిలైట్, రాకెట్ పరికరాలను తీసుకువెళ్లే స్థాయి నుంచి చంద్రుడు, అంగారకుడు గ్రహాల మీద పరిశోధనలు చేసేస్థాయికి చేరడానికి నాడు విక్రమ్ సారాభాయ్ వేసిన పునాదులే కారణమని షార్ శాస్త్రవేత్త ఆర్.ప్రీతా చెప్పారు. విద్యార్థులు పరిశోధనలపై ఆసక్తిని పెంపొందించుకుని ఇస్రోలో చేరి దేశానికి సేవ చేయాలని సూచించారు.
ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా డాక్టర్ విక్రమ్ సారాభాయ్ జన్మదినాన్ని పురస్కరించుకుని భారత అంతరిక్షయానంపై స్థానిక గోకులకృష్ణ కళాశాలలో విద్యార్థులకు శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ప్రీతా మాట్లాడుతూ భారత అంతరిక్ష పరిశోధనా సంస్థను స్థాపించి ప్రపంచస్థాయికి తీసుకువెళ్లడంలో డాక్టర్ విక్రమ్ సారాభాయ్ పాత్రను చరిత్ర మరువలేనిదని చెప్పారు. నెల రోజుల్లో సూర్యుడిపై పరిశోధనల కోసం ఆదిత్య ఎల్–1 అనే ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నట్లు తెలిపారు. కళాశాల సెక్రటరీ శ్రీనివాసబాబు, ఇంజినీరింగ్, ఫార్మసీ విభాగాల అధ్యాపకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment