kits
-
Aadudam Andhra: క్రీడాకారుల కోసం రూ.41.43 కోట్ల విలువైన 5 లక్షల స్పోర్ట్స్ కిట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రమంతటా ‘ఆడుదాం ఆంధ్ర’ క్రీడా పోటీల సందడి నెలకొంది. క్రీడాకారుల రిజిస్ట్రేషన్‌తో పాటు క్రీడా పరికరాల పంపిణీ ఊపందుకుంది. సుమారు 50 రోజుల పాటు నిర్విరామంగా సాగే ఈ అతిపెద్ద మెగా టోర్నీ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.41.43 కోట్ల విలువైన దాదాపు 5.09 లక్షల స్పోర్ట్స్ కిట్లను సిద్ధం చేసింది. ఇప్పటికే వీటిని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ(డీఎస్ఏ)లకు తరలించింది. డిసెంబర్ తొలివారం నాటికి గ్రామ, వార్డు సచివాలయాలకు ఈ కిట్లను అందించేలా ప్రత్యేక దృష్టి సారించింది. వీటితో పాటు గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో విజేతలకు ‘ఆడుదాం ఆంధ్ర’ లోగోతో టీషర్టు, టోపీని ఇవ్వనున్నారు. కిట్ల నాణ్యత పక్కాగా పరిశీలన.. ప్రతి గ్రామ, వార్డు సచివాలయానికి మూడు వాలీబాల్లు, నెట్, మూడు బ్యాడ్మింటన్ రాకెట్లు, షటిల్స్, మూడు బేసిక్ క్రికెట్ కిట్లు, రెండు టెన్నీకాయిట్ రింగ్‌లను ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. ఇక నియోజకవర్గ పోటీల్లో భాగంగా ఖోఖో, కబడ్డీ క్రీడాకారులకు యాంక్లెట్స్, నీక్యాప్స్ అందిస్తోంది. మండల స్థాయిలో ఆరు వాలీబాల్లు, రెండు ప్రొఫెషనల్ క్రికెట్ కిట్లను సమకూరుస్తోంది. వీటితో పాటు 6 వేల ట్రోఫీలు, 84 వేల పతకాలు, సర్టిఫికెట్లు ప్రదానం చేయనుంది. క్రీడా పరికరాల తయారీలో మంచి పేరున్న సంస్థల నుంచి టెండర్లను ఆహ్వానించి స్పోర్ట్స్ కిట్లను కొనుగోలు చేసింది. ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థకు చెందిన అధికారులు, కోచ్‌లు స్వయంగా స్పోర్ట్స్ కిట్ల తయారీ పరిశ్రమలకు వెళ్లి వాటి నాణ్యతను పరిశీలించారు. ఆయా సంస్థలు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థలకు సరఫరా చేసిన పరికరాలను ప్రత్యేక కమిటీ ద్వారా మరోసారి పరిశీలించిన తర్వాతే క్షేత్రస్థాయికి తరలిస్తున్నారు. వెలుగులోకి ప్రతిభావంతులు ‘ఆడుదాం ఆంధ్ర’ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభ కలిగిన క్రీడాకారులు వెలుగులోకి వస్తారు. ప్రతి క్రీడాకారుడు పోటీల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. క్రీడాకారులకు అవసరమైన స్పోర్ట్స్ కిట్లను ప్రభుత్వమే సమకూరుస్తోంది. జిల్లా క్రీడాప్రాధికార సంస్థలకు చేరిన కిట్లను మరోసారి పరిశీలించి క్షేత్రస్థాయికి వేగంగా పంపించేలా ఆదేశించాం. ఈ మెగా టోర్నీని ప్రజలందరూ వీక్షించేలా ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు వీలుగా వెబ్‌సైట్‌ను, సిబ్బందిని సమకూర్చేందుకు ప్రయత్నిస్తున్నాం. – ధ్యాన్‌చంద్ర, ఎండీ, ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ . ప్రత్యక్ష ప్రసారానికి సన్నాహాలు ‘ఆడుదాం ఆంధ్ర’ క్రీడా పోటీలను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం ‘ఆడుదాం ఆంధ్ర’ పేరుతో వెబ్‌సైట్‌ను రూపొందించింది. ఇందులో గ్రామ, వార్డు సచివాలయాల్లో జరిగే మ్యాచ్‌ల వివరాలు, స్కోర్‌ను ఆన్లైన్లో ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయనుంది. దీనికోసం గ్రామ, వార్డు సచివాలయాల నుంచి 10 మంది చొప్పున వలంటీర్లను ఎంపిక చేసి ప్రత్యేక శిక్షణ ఇస్తోంది. నియోజకవర్గస్థాయి పోటీలను యూట్యూబ్ చానెల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేసేలా ప్రణాళికలు రచిస్తోంది. -
వైఎస్సార్ సంపూర్ణ పోషణ అందజేసిన సీఎం జగన్ (ఫొటోలు)
-
సింగుపురం పాఠశాలలో జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీ
-
జగనన్న విద్యాకానుక కిట్ల పంపిణీకి స్వర్వం సిద్ధం
-
స్మార్ట్ సేద్యం: వ్యవసాయ సాధనాల కోసం స్మార్ట్ కిట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, రైస్ ట్రాన్స్ప్లాంటర్లు వంటి వ్యవసాయ సాధనాల వినియోగాన్ని పర్యవేక్షించేందుకు ఉపయోగపడేలా ఎంఅండ్ఎం గ్రూప్‌లో భాగమైన కృష్–ఈ సంస్థ స్మార్ట్ కిట్ (కేఎస్కే)ని తెలంగాణ మార్కెట్లో ఆవిష్కరించింది. దీనితో రైతులు తమ ట్రాక్టర్లు, వ్యవసాయ సాధనాల వినియోగం వివరాలను స్మార్ట్ ఫోన్ ద్వారా ట్రాక్ చేయొచ్చని ఎంఅండ్ఎం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రమేష్ రామచంద్రన్ తెలిపారు. ఇదీ చదవండి: iPhone 14 Offers: ఐఫోన్14పై ఆఫర్లే ఆఫర్లు.. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌తో పాటు మరో సంస్థలోనూ భారీ డిస్కౌంట్లు! తద్వారా నిర్వహణ వ్యయాలను గణనీయంగా తగ్గించుకోవచ్చని, ఆదాయాన్ని మెరుగుపర్చుకోవచ్చని ఆయన వివరించారు. ప్రారంభ ఆఫర్ కింద దీన్ని రూ. 4,995కి (పన్నులు, ఆరు నెలల సబ్స్క్రిప్షన్ ప్యాకేజీ కూడా కలిపి) అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే 25,000 పైచిలుకు కిట్స్ వినియోగంలో ఉన్నట్లు కేఎస్‌కేని రూపొందించిన కార్నట్ టెక్నాలజీస్ సీటీవో పుష్కర్ లిమాయే తెలిపారు. కార్నాట్‌లో ఎంఅండ్ఎంకు గణనీయంగా వాటాలు ఉన్నాయి. ఇదీ చదవండి: FASTag Record: ఒక్క రోజులో రూ.1.16 కోట్లు.. ఫాస్ట్‌ట్యాగ్ వసూళ్ల రికార్డు -
ఫింగర్ ప్రింట్స్ కోసం సీఐడీకి అధునాతన కిట్లు
సాక్షి, హైదరాబాద్: నేరాలు జరిగినప్పుడు వాటిని ఛేదించేందుకు ఫింగర్ ప్రింట్స్ కీలక భూమిక పోషిస్తాయి. అలాంటి ఫింగర్ ప్రింట్స్ సేకరణ, తరువాత వాటిని విశ్లేషించడానికి అవసరమైన అధునాతన కిట్స్‌ను రాష్ట్ర సీఐడీ విభాగం సమకూర్చుకుంది. రూ.1.33 కోట్ల వ్యయంతో కొనుగోలు చేసిన ఫింగర్ ప్రింట్ కిట్స్‌ను సీఐడీ అడిషనల్ డీజీపీ మహేశ్ భగవత్ బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆరు జోన్లలోని అధికారులకు అందజేశారు. ప్రస్తుతం రాచకొండ కమిషనరేట్‌లోని ఎల్బీ నగర్ జోన్, సైబరాబాద్‌లోని శంషాబాద్ జోన్, హైదరాబాద్ నగరంలోని సౌత్, నార్త్, వెస్ట్, సెంట్రల్ జోన్లకు ఈ కిట్లను అందించారు. త్వరలోనే రాష్ట్రంలోని అన్ని ఫింగర్ ప్రింట్ యూనిట్లకు వీటిని అందచేయనున్నట్లు మహే ష్భగవత్ చెప్పారు. సీఐడీలోని ఫింగర్ ప్రింట్ బ్యూరో డైరెక్టర్ తాతా రావు మాట్లాడుతూ ఒక్కో కిట్‌లో మొత్తం తొమ్మిది రకాల వస్తువులు ఉంటాయని తెలిపారు. మాస్టర్ ఎక్స్పర్ట్ లేటంట్ ప్రింట్ కిట్, ఫింగర్ ప్రింట్ కెమికల్ ప్రాసెసింగ్ కిట్, లెటంట్ బ్రషెస్, మాగ్నటిక్ పౌడర్ అప్లికేటర్, పోస్టు మార్టమ్ ఇంక్ టూల్, ఇంక్డ్ స్ట్రిప్స్, మాగ్నటిక్ పౌడర్స్, లెటెంట్ ప్రింట్ బేసిక్ పౌడర్స్, పోర్టబుల్ మల్టీబాండ్ లైట్సోర్స్ ఉంటాయి. కార్యక్రమంలో సీఐడీ అధికారులు ఎం.నారాయణ(అడ్మిన్), ఆర్ వెంకటేశ్వర్లు(ఎస్సీఆర్బీ) రవీందర్(నార్కొటిక్స్), డీఎస్పీ నందుకుమార్(ఎఫ్‌పీబీ) పాల్గొన్నారు. -
అరకొరగానే అమలవుతోన్న కేసీఆర్ కిట్స్ పథకం..!
-
2025 నాటికి టీబీ సమూల నిర్మూలన: మైల్యాబ్ కీలక ఆవిష్కారం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డయాగ్నోస్టిక్ కిట్స్ తయారీలోఉన్న మైల్యాబ్ డిస్కవరీ సొల్యూషన్స్.. క్షయ వ్యాధిని గుర్తించేందుకు పాథోడిటెక్ట్ పేరుతో ఆర్టీ-పీసీఆర్ ఆధారిత కిట్‌ను రూపొందించింది. క్షయ చికిత్సలో వాడే రిఫాంపిసిన్, ఐసోనియాజిడ్ ఔషధాలు రోగిపై ఏ మేరకు పనిచేస్తాయో కూడా ఒకే పరీక్షలో తెలుసుకోవచ్చు. ఈ కిట్‌కు సీడీఎస్‌సీవో, టీబీ ఎక్స్పర్ట్ కమిటీ, ఐసీఎంఆర్ ఆమోదం ఉందని కంపెనీ తెలిపింది. క్షయవ్యాధికి సంబంధించి ఒకే పరీక్షలో రిఫాంపిసిన్, ఐసోనియాజిడ్‌లకు బహుళ ఔషధ నిరోధకతనుగుర్తించే మేడ్ ఇన్ ఇండియా టీబీ డిటెక్షన్ కిట్ ఉపయోగపడుతుందని కంపెనీ తెలిపింది. పెద్ద ఎత్తున ఫీల్డ్ ట్రయల్స్ తర్వాత ఈ కిట్‌కు అనుమతినిచ్చినట్టు ఐసీఎంఆర్ ఆధ్వర్యంలో TB నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. ఏకకాలంలో రెండు సమస్యల్ని పరిష్కరిస్తున్నామని మైల్యాబ్ ఎండీ హస్ముఖ్ రావల్ తెలిపారు.దేశంలో 2025 నాటికి టీబీనీ సమూలంగా నిర్మూలించాలనే ప్రధానమంత్రి దార్శనికతకు మద్దతు ఇవ్వడంలో కీలకమైనదిగా భావిస్తున్నారు. -
మంకీపాక్స్ నిర్ధారణ కిట్ విడుదల
దొండపర్తి (విశాఖ దక్షిణ): ప్రపంచాన్ని కలవర పెడుతున్న మంకీపాక్స్ వైరస్‌ను నిర్ధారించే కిట్ అందుబాటులోకి వచ్చింది. విశాఖలోని మెడ్ టెక్ జోన్లో ట్రాన్సాసియా బయో–మెడికల్స్ సంస్థ ఆర్టీపీసీఆర్ విధానంలో ఈ కిట్‌ను అభివృద్ధి చేసింది. స్వదేశంలో తయారైన మొట్టమొదటి మంకీపాక్స్ నిర్ధారణ కిట్ ఇదే కావడం విశేషం. ట్రాన్సాసియా–ఎర్బా పేరుతో తయారు చేసిన ఈ కిట్‌ను కేంద్రంలోని ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ ప్రొఫెసర్ అజయ్‌కుమార్ సూద్ శుక్రవారం మెడ్‌టెక్ జోన్లో ఆవిష్కరించారు. అత్యంత సున్నితమైన, కచ్చితమైన ఫలితం కోసం ఈ కిట్‌ను ప్రత్యేకంగా రూపొందించినట్లు సంస్థ పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న మంకీపాక్స్ కేసులను ముందస్తుగా గుర్తించడం ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఈ కిట్ ఉపయోగపడుతుందని ట్రాన్సాసియా వ్యవస్థాపక చైర్మన్ సురేష్ వాజిరాణి తెలిపారు. ఈ కార్యక్రమంలో సైంటిఫిక్ సెక్రటరీ అరబింద మిత్ర, ఐసీఎంఆర్ మాజీ డైరెక్టర్ బలరాం భార్గవ, బయోటెక్నాలజీ విభాగం సలహాదారుడు అల్క శర్మ తదితరులు పాల్గొన్నారు. (చదవండి: 13 ఏళ్లకే 10వ తరగతి పూర్తి.. యాంకర్‌గా అదరగొడుతున్న అభిషేక్ ) -
విద్యార్థులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్..
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో 1నుంచి 10వ తరగతి విద్యార్థులకు మూడో విడత జగనన్న విద్యా కానుక కిట్లను వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోనే అందజేయాలని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అధికారులను ఆదేశించారు. ఇందుకు అవసరమైన టెండర్ల ప్రక్రియను త్వరగా పూర్తిచేసి ఏజెన్సీలకు వర్క్ ఆర్డర్లు జారీ చేయాలన్నారు. మంగళవారం సచివాలయంలో విద్యా శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. చదవండి: ఆర్జీవీకి మంత్రి పేర్ని నాని కౌంటర్ మంత్రి సురేష్ మాట్లాడుతూ వేసవి సెలవుల్లోనే విద్యాకానుక కిట్లు పాఠశాలలకు చేరేలా చర్యలు చేపట్టాలన్నారు. జగనన్న అమ్మ ఒడి, విద్యాదీవెన పథకాలకు అర్హుల జాబితాను సిద్ధం చేయాలని సూచించారు. నాడు–నేడు పథకం కింద పాఠశాలల్లో మౌలిక వసతుల మెరుగుదల, క్రీడా ప్రాంగణాల అభివృద్ధి పనుల పురోగతిపై ఆరా తీశారు. విద్యా సంస్కరణల్లో భాగంగా తీసుకొస్తున్న ఫౌండేషన్ స్కూళ్ల అమలుకు ప్రభుత్వ పాఠశాలలు, టీచర్ల మ్యాపింగ్, హైస్కూళ్లలో ఉపాధ్యాయుల భర్తీపై చర్చించారు. -
వైరస్ ఉధృతి: అనుమానితులు ఎక్కువ.. కిట్లు తక్కువ
సాక్షి, జగిత్యాల: జిల్లాలో కిట్ల కొరత తీవ్రంగా ఉంది. కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తుండడంతో పీహెచ్‌సీలకు అనుమానితులు బారులు తీరుతున్నారు. పీహెచ్‌సీలకు అరకొర కిట్లు వస్తుండడంతో పలువురు పరీక్షలు చేయించుకోకుండానే వెనుదిరుగుతున్నారు. మళ్లీ మరుసటి రోజు వచ్చి లైన్లో ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయి. నిత్యం వందలకొద్ది అనుమానితులు వస్తుండగా పరీక్షలు మాత్రం వందలోపే చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా నిత్యం 1600లకు మించి పరీక్షలు చేయడం లేదు. బారులు తీరుతున్న జనం జిల్లాలోని ప్రతీ ఆరోగ్య కేంద్రంతోపాటు కమ్యూనిటీ ఆస్పత్రుల్లో నిర్ధారణ పరీక్షలు చేస్తున్నప్పటికీ సరిపోవడం లేదు. కమ్యూనిటీ ఆస్పత్రుల్లో 100, జిల్లా ఆస్పత్రిలో 200, పీహెచ్‌సీల్లో 50 చొప్పున కిట్లు కేటాయిస్తూ రోజుకు అంతమందికే చేస్తున్నారు. సెకండ్‌వేవ్ తీవ్రత ఎక్కువగా ఉండడంతో అనుమానితులు సెంటర్లకు పరుగులు తీస్తున్నారు. మొదట్లో టీకాలు వేసుకునేందుకు ముందుకురాని వారు, సెకండ్‌వేవ్ తీవ్రత ఎక్కువగా ఉండడంతో మొదట కరోనా పరీక్షలు చేసుకుని టీకాలు వేసుకునేందుకు మొగ్గుచూపుతున్నారు. ముందు పరీక్షలు చేయించుకుందామంటే ర్యాపిడ్టెస్ట్ కిట్ల కొరత ఏర్పడింది. ముఖ్యంగా మున్సిపాలిటీల్లో ఉదయం నుంచే బారులు తీస్తున్నారు. పూర్తిస్థాయిలో కిట్లు పంపిణీ కాకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కొరత ఉన్నట్లు వైద్యాధికారులు పేర్కొంటున్నారు. రోజుకు 1,600 మాత్రమే వ్యాక్సినేషన్ ప్రక్రియ ఊపందుకోవడంతో టెస్ట్‌ల కోసం అనుమానితులు బారులుతీరుతున్నారు. గతంలో పరీక్షలు చేసుకునేందుకు ముందుకురాని వారు ప్రస్తుతం వైరస్ ఉధృతిని చూసి పరుగులు పెడుతున్నారు. దీంతో కిట్ల నిల్వలు తగ్గిపోతున్నాయి. సరఫరా సైతం అంతంతే ఉండడంతో కొరత ఏర్పడుతోంది. జగిత్యాలలోనే ఆర్టీపీసీఆర్ జగిత్యాలలోని ఓల్డ్హైస్కూల్లో ఆర్టీపీసీఆర్ టెస్ట్‌లు చేస్తున్నారు. జిల్లాలోని అన్ని పీహెచ్‌సీల్లో ర్యాపిడ్ టెస్ట్‌లు చేస్తున్నారు. ర్యాపిడ్ టెస్ట్‌ల్లో నెగెటివ్ వస్తే ఆర్టీపీసీఆర్కు పంపుతున్నారు. ఆర్టీపీసీఆర్లో పాజిటివ్ వస్తుండడంతో పలువురు ఆందోళన చెందుతున్నారు. -
ఏజెన్సీలలో కరోనా వ్యాప్తి.. కిట్లు లేవు.. పరీక్షలు లేవు
సాక్షి, ఉట్నూర్(ఆదిలాబాద్): కరోనా వైరస్ వ్యాప్తి మొదట్లో రోజుకు ఉట్నూర్ సీహెచ్‌సీల్లో వంద మందికి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో యాభై చొప్పున కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించేవారు. రానురాను కిట్ల కొరతతో పరీక్షల సంఖ్య తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం ఆరోగ్య కేంద్రాలకు సరిపడా కిట్లు రావడం లేదు. దీంతో పరీక్షల కోసం వచ్చిన వారు వెనుదిరుగుతున్నారు. అందులో వైరస్ ఉన్న వారితో మరింతగా వ్యాప్తి చెందుతోంది. గిరి గ్రామాల్లో వైరస్ ఉధృతి.. ఏజెన్సీ గిరిజన గ్రామాల్లో కరోనా వైరస్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. సాధారణంగా గిరిజన గ్రామాల్లో వ్యాధులు, జ్వరాలు వస్తే వైద్యం కంటే మూఢనమ్మకాలు, ఆరాధ్యాదైవాలను ఎక్కువగా నమ్ముతారు. ఇప్పటికీ ఆదివాసీ గిరిజనుల్లో కరోనా వైరస్‌పై పూర్తిస్థాయిలో అవగాహన లేక వైరస్ వేగంగా విస్తరిస్తోంది. ఫలితంగా ఏజెన్సీలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే పదుల సంఖ్యలో కేసులు వెలుగుచూస్తున్నాయి. దీంతో వైద్యశాల ప్రతి గిరిజన గ్రామాల్లో నిర్ధారణ పరీక్షలు నిర్వహించి వైరస్ సోకిన వారికి హోం క్వారంటైన్లో ఉండేలా ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం కరోనా నిర్ధారణ ర్యాపిడ్ అంటిజెన్ కిట్ల కొరత ఏర్పడడంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఒక్కప్పుడు యాభై చొప్పున వచ్చే కిట్లు ఇప్పుడు ఎన్ని వస్తాయో తెలియని పరిస్థితి. వచ్చే అరకొర కిట్లతో సిబ్బంది నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచే ఆరోగ్య కేంద్రాలకు... ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఉదయం నుంచే గిరిజనులు కరోనా నిర్ధారణ పరీక్షల కోసం బారులు తీరుతున్నారు. కిట్ల కొరతతో వైద్యాధికారులు వచ్చిన వారందరికీ పరీక్షలు నిర్వహించలేకపోతున్నారు. ఇలా ప్రతి రోజు వైరస్ సోకినవారు, అనుమానిత బాధితులు పరీక్షల కోసం ఆరోగ్య కేంద్రాలకు బారులు తీరుతుండడంతో అనుమానితులు కూడా వైరస్ బారిన పడుతున్నారు. అప్పటికే ఒక్కటి రెండు రోజులు పరీక్షలకు వెళ్లి వెనుదిరిగి ఇంటికి రావడం, అప్పటికీ పరీక్ష నిర్ధారణ కాకపోవడంతో అలాంటి వారు బయట విచ్చలవిడిగా తిరగడం, కుటుంబ సభ్యులతో కలిసి ఉండడంతో కుటుంబ సభ్యులు వైరస్ బారిన పడుతున్నారు. ఏజెన్సీ తట్టుకోగలదా...? ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 6138.50 స్కేర్ కిలో మీటర్ల పరిధిలో ఏజెన్సీ ప్రాంతం విస్తరించి ఉంది. ఈ ప్రాంతాల్లో 4,95,794 గిరిజన జనాభా నివసిస్తోంది. వీరందరికీ వైద్య సౌకర్యాల కోసం ఏజెన్సీలో మూడు సామాజిక ఆరోగ్య కేంద్రాలు, 31 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 186 ఉప ఆరోగ్య కేంద్రాలున్నాయి. ప్రతి ఏటా ఏజెన్సీలో గిరిజనులు జ్వరాలు, వ్యాధుల బారిన పడుతూ మృత్యువాతపడుతుంటారు. దీనికి తోడు ఇప్పటికే సికెల్‌సెల్, తలసేమియా లాంటి ప్రాణాంతక వ్యాధులు గిరిజనుల పాలిట శాపంగా మారాయి. సహజంగా మహిళల్లో హీమోగ్లోబిన్ 12నుంచి 15 శాతం, పరుషుల్లో 14 నుంచి 16శాతం ఉంటే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా వైద్యులు చెబుతుంటారు. ఏజెన్సీలో ఏళ్ల తరబడి నెలకొన్న పోషకాహార లోపంతో మహిళల్లో హీమోగ్లోబిన్ 6 నుంచి 9శాతం, పురుషుల్లో 12శాతం వరకు, చిన్నారుల్లో 5 నుంచి 10శాతం వరకే ఉంటోంది. వీరిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండడంతో చిన్న సమస్యలకే అనారోగ్యం పాలు అవుతుంటారని పలు సందర్భాల్లో వైద్య బృందాలు తేల్చాయి. గిరి గ్రామాల్లో పరిస్థితులు అదుపు తప్పకముందే చర్యలు తీసుకుంటే మేలు. అవగాహన కల్పిస్తున్నాం ఏజెన్సీ గిరిజన గ్రామాల్లో కరోనా వ్యాప్తి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్య సిబ్బంది ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నారు. గ్రామాల్లో క్యాంపులు ఏర్పాటు చేస్తూ పరీక్షలు నిర్వహిస్తున్నారు. వైరస్ సోకినవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అవగాహన కల్పిస్తున్నాం. ప్రతి గ్రామంలోని ఆశ కార్యకర్తలు గ్రామాల్లోని గిరిజనుల ఆరోగ్య స్థితిగతులపై అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు పైఅధికారులకు సమాచారం అందించాలని ఆదేశాలు జారీ చేశాం. వైరస్ నిర్ధారణ కోసం జిల్లా కేంద్రం నుంచి వస్తున్న కిట్ల సంఖ్యను బట్టి పీహెచ్‌సీలకు పంపిణీ చేస్తున్నాం. – మనోహర్, ఏజెన్సీ అదనపు వైద్యాధికారి -
ఏందీ కిరికిరి: ఒకటి పాజిటివ్.. మరొకటి నెగిటివ్
బోయిన్పల్లి గిరిజన సంక్షేమ వసతిగృహానికి చెందిన ఓ పదో తరగతి విద్యార్థి అకస్మాత్తుగా జ్వరం, ఆయాసంతో బాధపడుతుండటంతో అనుమానం వచ్చి శనివారం ఉదయం కోవిడ్ టెస్ట్ చేయించగా, పాజిటివ్ వచ్చింది. దీంతో ఆ విద్యార్థికి సన్నిహితంగా ఉన్న హాస్టల్లోని మరో 103 మంది విద్యార్థులు, హాస్టల్ సిబ్బందికి అదే రోజు ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు చేశారు. వీరిలో 36 మంది విద్యార్థులు సహా నలుగురు సిబ్బందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆ తర్వాత అదే రోజు వారందరికీ ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయించగా, వీరిలో పదో తరగతి విద్యార్థి(16), ఒక వర్కర్(55) మినహా మిగిలిన వారందరికీ నెగిటివ్ వచ్చింది. దీంతో ర్యాపిడ్ యాంటిజెన్ కిట్ల నాణ్యత, పనితీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి సాక్షి, సిటీబ్యూరో: కరోనా వైరస్ నిర్ధారణ కోసం ప్రభుత్వం సరఫరా చేసిన ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టు కిట్ల నాణ్యత ప్రశ్నార్థకంగా మారింది. దగ్గు, జలుబు, జ్వరం, ఒంటి నొప్పులు, ఆయాసం వంటి లక్షణాలతో బాధపడుతూ వైరస్ నిర్ధారణ కోసం వచ్చిన బాధితులకు చుక్కలు చూపిస్తున్నారు. వైరస్ లేనివారికి ఉన్నట్లు...ఉన్న వారికి లేనట్లు రిపోర్టులు వస్తుండటంతో ఇటు వైద్యులే కాకుండా అటు బాధితులు ఆందోళన చెందుతున్నారు. బోయిన్పల్లి గిరిజన సంక్షేమ వసతి గృహం విద్యార్థులకు నిర్వహించిన యాంటిజన్ టెస్టులు, జారీ చేసిన రిపోర్టులే ఇందుకు నిదర్శనం. తెలంగాణ వైద్య మౌలిక సదుపాయాల సంస్థలో పనిచేస్తున్న కొంత మంది అధికారులు కమీషన్లకు కక్కుర్తి పడి నాణ్యతను పరిశీలించకుండా నాసిరకం కిట్లను కొనుగోలు చేయడమే ఇందుకు ప్రధాన కారణమని పలువురు సీనియర్ వైద్యులు ఆరోపిస్తున్నారు. వైరస్ విస్తరణకు ఈ తప్పుడు రిపోర్టులు కూడా ఓ కారణమని చెబుతున్నారు. ప్రశ్నార్థకంగా ర్యాపిడ్ కిట్ల నాణ్యత.. నిజానికి కోవిడ్ నిర్ధారణలో ఆర్టీపీసీఆర్‌ను గోల్డెన్ స్టాండర్డ్‌గా భావిస్తారు. ఇందులో వైరస్ నిర్ధారణకు 24 గంటలకుపైగా సమయం పడుతుంది. అదే ర్యాపిడ్ యాంటిజెన్‌లో అరగంటలోనే ఫలితం తేలుతుంది. సత్వర వైరస్ నిర్ధారణ, చికిత్సల కోసం ప్రభుత్వం ఈ కిట్ల వైపు మొగ్గుచూపింది. నగరంలో ప్రస్తుతం 20 ప్రభుత్వ, 60 ప్రైవేటు కేంద్రాల్లో ఆర్టీపీసీఆర్ చేస్తున్నారు. ఒక్కో సెంటర్లో రోజుకు సగటున 25 పరీక్షలు చేస్తుండగా, ప్రస్తుతం 404 టెస్టులకు సంబంధించిన రిపోర్టులు వెయిటింగ్లో ఉన్నాయి. ఇక హైదరాబాద్‌లో 97, మేడ్చల్‌లో 88, రంగారెడ్డిలో 60 పట్టణ ఆరోగ్యకేంద్రాల్లో ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు చేస్తున్నారు. ఒక్కో సెంటర్లో రోజుకు సగటున 50 మందికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే దగ్గు, జలుబు, జ్వరం, ఒంటి నొప్పులు, ఆయాసం వంటి కోవిడ్ లక్షణాలు ఉన్నవారికి ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులో నెగిటివ్ రావడం సహజమే. ఇలాంటి వారికి వైద్యులు ఖచ్చితత్వం కోసం ఆర్టీపీసీఆర్‌ను సిఫార్సు చేసి, ఆ రిపోర్ట్ ఆధారంగా వైరస్‌ను నిర్ధారిస్తారు. నిజానికి యాంటిజెన్‌లో పాజిటివ్ వచ్చిన వారికి ఆర్టీపీసీఆర్లోనూ పాజిటివ్ రావాలి. కానీ బోయిన్పల్లి గిరిజన సం క్షేమ వసతి గృహంలో నిర్వహించిన క్యాంపులో పాజిటివ్ వచ్చిన వారిలో, ఇద్దరికి మినహా అందరికీ ఆ తర్వాత నెగిటివ్ రావడం వైద్య ఆరోగ్యశాఖ అధికారులను సైతం ఆశ్చర్యానికి గురిచేయడమే కాకుండా కిట్ల నాణ్యత ప్రశ్నార్థకంగా మార్చింది. ఒక్క రోజే 300కుపైగా కేసులు.. ఒక వైపు కిట్ల నాణ్యతపై విమర్శలు వెల్లువెత్తుతుండగా...మరో వైపు గ్రేటర్లో చాపకిందినీరులా వైరస్ విస్తరిస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు మరింత పెరుగుతుండటమే ఇందుకు నిదర్శనం. తాజాగా సోమవారం కేసుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. ఆగస్టు తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. కూకట్పల్లి ఆరోగ్య కేంద్రం పరిధిలో 47, కుత్బుల్లాపూర్‌లో 22, సరూర్‌నగర్‌లో 27, ముసారంబాగ్‌లో 7, ముషీరాబాద్‌లో 16, గచ్చిబౌలిలో 19, ఉప్పల్‌లో 26, అంబర్‌పేటలో 29, గోల్కొండలో 13, మేడ్చల్‌లో 25, సుభాష్‌నగర్‌లో 10, అల్వాల్ లో 7, మల్కజ్గిరిలో 27, వనస్థలిపు రం ఏరియా ఆస్పత్రిలో 30, ఘోషామహల్లో 9, సనత్‌నగర్‌లో 2, మలక్‌పేట్‌లో 4, బంజారాహిల్స్‌లో 3, ఆమన్నగర్లో 3, మల్లాపూర్‌లో 3, కాప్రాలో 11, యునానీ ఆస్పత్రిలో 2 పాజిటివ్ కేసుల చొప్పున నమోదు కావడం గమనార్హం. ఇవేకాకుండా ప్రైవేటు డయాగ్నోస్టిక్స్‌లోనూ కేసుల సంఖ్య భారీగానే నమోదైనట్లు తెలిసింది. గ్రేటర్లో కరోనా కేసులు ఇలా.. తేదీ హైదరాబాద్ మేడ్చల్ రంగారెడ్డి 16 29 41 10 17 35 21 12 18 47 20 29 19 75 32 31 20 81 34 64 21 91 28 37 చదవండి: కరోనా కట్టడికి 15 రోజుల ప్రచార కార్యక్రమాలు -
కిట్..హాంఫట్..!
రాష్ట్రంలో ఓ కీలక నేతకు చెందిన మెడికల్ కాలేజీ, దాని అనుబంధ ఆసుపత్రిలో కరోనా చికిత్సలు జరుగుతున్నాయి. తనకున్న పలుకుబడితో ఆయన ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి ఆర్టీ–పీసీఆర్, ర్యాపిడ్ యాంటిజెన్ కిట్లను బెదిరించి తీసుకెళ్తున్నాడు. అలా ఉచితంగా తీసుకెళ్లిన కిట్లతో పరీక్షలు చేస్తూ రూ. 3,500 చొప్పున వసూలు చేస్తున్నాడు. దీంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో కిట్లకు కొరత ఏర్పడింది. ఉన్నతస్థాయిలో ఫిర్యాదు చేయాలంటే ఆసుపత్రి వర్గాలు భయపడుతున్నాయి. హైదరాబాద్ పాతబస్తీలోని ఓ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ)లో రోజుకు కనీసం 50 ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు చేస్తుంటారు. కానీ ఒక్కోసారి 30 పరీక్షలు మాత్రమే చేసి మిగిలిన కిట్లను అక్కడి డాక్టర్ సొంత క్లినిక్‌కు తీసుకెళ్తున్నాడు. టెస్టుల కోసం వచ్చే బాధితులకేమో ఆ రోజు కోటా అయిపోయిందని చెబుతూ రికార్డుల్లో మాత్రం 50 టెస్ట్‌లు చేసినట్లు చూపుతున్నాడు. అలా మిగిలిన 20 కిట్లను తన క్లినిక్‌కు తీసుకెళ్లి ఒక పరీక్షకు రూ. 3 వేల చొప్పున వసూలు చేస్తున్నాడు. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విరివిగా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన లక్షల ర్యాపిడ్ యాంటిజెన్ కిట్లను కొందరు డాక్టర్లు, నర్సులు, టెక్నీషియన్లు, ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు పక్కదారి పట్టిస్తున్నాయి. సాధారణంగా యాంటిజెన్ కిట్ ధర రూ.500 మాత్రమే ఉంటే, వాటిని తమ సొంత క్లినిక్‌లలో వాడుతూ రూ.3,000–3,500 వసూలు చేస్తూ పరీక్షలు చేస్తున్నారు. ఓ ప్రజాప్రతినిధి తన బోధనాసుపత్రిలో టెస్టులు చేసేందుకు బలవంతంగా ఒక జిల్లా ఆసుపత్రి నుంచి యాంటిజెన్ సహా ఆర్టీ–పీసీఆర్, యాంటి జెన్ కిట్లను తీసుకెళ్తుండటంపై ఆ జిల్లాలో దుమారం నెలకొంది. ఆ జిల్లా ఆసుపత్రిలో టెస్టులు చేయించుకోవాలంటే పలుకుబడి కలిగిన వారితో పైరవీలు చేయించుకోవాల్సిందేనన్న ఫిర్యాదులున్నాయి. ఇళ్లకు తీసుకుపోతున్న వీఐపీలు కరోనా ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలను కేవలం ప్రభుత్వ ఆధ్వర్యంలోనే 1,076 ప్రభుత్వాసుపత్రులు, కేంద్రాల్లో నిర్వహిస్తున్నారు. ప్రైవేట్ ఆసుపత్రులకు, డయాగ్నోస్టిక్ సెంటర్లకు ప్రభుత్వం ర్యాపిడ్ టెస్టులకు అనుమతి ఇవ్వలేదు. దీంతో ప్రైవేట్ ఆసుపత్రులు, క్లినిక్‌లు, లేబొరేటరీలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోని కిట్లను అక్కడి సిబ్బందిని ప్రలోభపెట్టి కాజేస్తున్నాయి. ఇక ఆయా ఆసుపత్రుల్లో పనిచేసే కొందరు డాక్టర్లు కూడా వాటిని పక్కదారి పట్టిస్తున్నారు. ఇక కొందరు వీఐపీలు, నేతల ఇళ్లలోనూ కిట్లు కనిపిస్తున్నాయి. వారు టెక్నీషియన్లను పిలిపించుకొని టెస్టులు చేయించుకుంటున్నారు. ర్యాపిడ్ పరీక్ష అక్కడికక్కడే చేయడానికి వీలుండటంతో ఇలా ఎవరికివారు యాంటిజెన్ కిట్లను పక్కదారి పట్టిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. దొంగ ఓటీపీలు.. దొంగ రిజిస్ట్రేషన్లు ఒక యాంటిజెన్ పరీక్ష చేయాలంటే.. పరీక్షకు వచ్చిన బాధితుడి ఫోన్ నంబర్‌ను సంబంధిత ప్రభుత్వ వెబ్సైట్లో నమోదు చేయాలి. ఆపై ఆ నంబర్‌కు వన్ టైం పాస్వర్డ్ (ఓటీపీ) వస్తుంది. దాన్ని మళ్లీ ఎంటర్ చేశాకే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగుస్తుంది. అప్పుడు మాత్రమే బాధితుడికి టెస్టు చేయాలి. ఇంత పకడ్బందీ వ్యవస్థను కూడా కొందరు వైద్య సిబ్బంది ధ్వంసం చేస్తున్నారన్న ఫిర్యాదులున్నాయి. ఉదాహరణకు ఎలాంటి సెల్‌ఫోన్ లేని సాధారణ వ్యక్తి వచ్చి టెస్ట్ చేయమంటే, అప్పుడు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం స్థానికంగా ఉండే ఆరోగ్య కార్యకర్త ఫోన్ నంబర్ ఇచ్చే వెసులుబాటు ఉంది. ఈ పరిస్థితిని కిట్లను కొట్టేసేందుకు కొందరు వైద్య సిబ్బంది తెలివిగా ఉపయోగించుకుంటున్నారు. తద్వారా రికార్డుల్లో అన్ని పరీక్షలు చేసినట్లుగానే ఉంటుంది కానీ కిట్లు మాయమైపోతున్నాయి. -
పేషెంట్ల పేరుతో.. నేతల ఇళ్లలోనే కిట్లు
సాక్షి, సిటీబ్యూరో: సర్కారీ కోవిడ్ కిట్ల పంపిణీలో స్థానిక నేతల జోక్యం అధికారులకు ఇబ్బందిగా మారింది. కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయిన బాధితులకు అందాల్సిన కిట్లు...రోగుల పేరుతో నేతల ఇళ్లకు చేరుతున్నాయి. వాస్తవానికి క్షేత్రస్థాయిలో పని చేస్తున్న వైద్య సిబ్బంది నేరుగా హోం ఐసోలేషన్‌లో ఉన్న బాధితుల ఇళ్లకు వెళ్లి వీటిని అందజేయాల్సి ఉంది. అయితే స్థానికంగా కొందరు అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు వైద్య సిబ్బందికి అడ్డుతగులుతున్నారు. తమ డివిజన్ పరిధిలో తాము తప్ప మరెవరూ సర్కారీ కిట్లు పంపిణీ చేయడానికి వీల్లేదని హెచ్చరిస్తున్నారు. లబ్దిదారులకు కాకుండా ముందస్తుగా వాటిని తమ బంధువులకు అందజేస్తున్నారు. విధిలేని పరిస్థితుల్లో బాధితులే స్వయంగా ప్రైవేటు మెడికల్ షాపులకు వెళ్లి మందులు కొనుగోలు చేయాల్సి వస్తోంది. తీరా అక్కడ అజిత్రోమైసిన్ వంటి యాంటి బయాటిక్ సహా జింకోవిట్, విటమిన్ సీ, ఈ, డీ వంటి మల్టీవిటమిన్ టాబ్లెట్లు దొరకడం లేదు. సకాలంలో మందులు వాడక పోవడంతో శరీరంలో వైరస్ తీవ్రత పెరిగి శ్వాస సంబంధ సమస్యలు తలెత్తి, ఊపిరాడక ఉక్కిరిబిక్కిరై మృత్యువాత పడుతున్నారు. మరికొందరు బాధితులకు ఏకంగా పాజిటివ్ నుంచి నెగిటివ్ వచ్చిన తర్వాత ఐసోలేషన్ కిట్లను అందిస్తుండటం గమనార్హం. సర్కారీ కిట్ల కోసం బాధితుల నిరీక్షణ నగరంలోని మల్కజ్గిరి సర్కిల్ పరిధిలో ఇప్పటి వరకు 724 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ప్రస్తుతం 290 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్రభుత్వం 350 కిట్లు అందజేయగా, ఇప్పటి వరకు 199 మందికి పంపిణీ చేశారు. ఇక సర్కిల్ 19 పరిధిలో 1568 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ప్రస్తుతం 640 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్రభుత్వం 890 కిట్లను సరఫరా చేయగా, ఇప్పటి వరకు 800 కిట్లు మాత్రమే పంపిణీ చేశారు. గోషామహల్ పరిధిలో 490 కిట్లకు ఇప్పటి వరకు 430 పంపిణీ చేశారు. సికింద్రాబాద్ సర్కిల్ పరిధిలో 932 యాక్టివ్ కేసులు ఉండగా, ఇప్పటి వరకు 540 మందికే కిట్లు అందజేశారు. కుత్బుల్లాపూర్‌లో 1069 యాక్టివ్ కేసులు ఉండగా, 540 మందికే కిట్లు అందాయి. అంబర్‌పేటలో 981 యాక్టివ్ కేసులు ఉండగా, 460 మందికే కిట్లు అందాయి. ఉప్పల్‌లో 342 కేసులు నమోదు కాగా, వీటిలో ప్రస్తుతం 172 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరిలో ఒక్కరికి కూడా సర్కారీ కిట్లు అందలేదు. మేడ్చల్జోన్లో 734 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇప్పటి వరకు 219 మందికే కిట్లు అందజేశారు. మలక్‌పేటలో 1500 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ప్రస్తుతం 300 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. వీరిలో 250 మందికే కిట్లు అందాయి. ఎల్బీన గర్‌లో 827 కేసులు ఉండగా, వీరిలో 800 మందికే కిట్లు అందాయి. చాంద్రాయణగుట్టలో 561 మంది హోం ఐసోలేషన్‌లో ఉండగా, వీరిలో 500 మందికి, సంతోష్‌నగర్‌లో 168 మందిలో 150 మందికి, ఫలక్‌నుమాలో 128 మంది ఉండగా, వీరిలో 107 మందికి, చార్మినార్‌లో 91 మంది ఉం డగా, వీరిలో 80 మందికే కిట్లు సరఫరా చేశారు. ఇక మెహిదీపట్నంలో 364 మందికి 320 మందికే అందజేశారు. కూకట్‌పల్లిలో 365 మంది ఉంటే, వీరిలో 283 మందికే కిట్లు సరఫరా చేశారు. బ్లాక్ మార్కెట్లో ఆ మందులు కరోనా వైరస్ నియంత్రణకు ఇప్పటి వరకు ఎలాంటి వాక్సిన్ రాలేదు. అసింప్టమాటిక్, మైల్డ్ లక్షణాలతో బాధపడుతున్న వారు వైద్యుల సలహా మేరకు సాధారణ యాంటిబయాటిక్(జలుబు, దగ్గుకు అజిత్రోమైసిన్, జ్వరానికి డోలో 650, రోగ నిరోధక శక్తిని పెంచేందుకు విటమిన్ సీ,ఈ,డీ సహా జింకోవిట్ వంటి మల్టీవిటమిన్) మందులు వాడుతున్నారు. దగ్గు, జలుబు, జ్వరంతో పాటు శ్వాస సంబంధ సమస్యలు తలెత్తిన అత్యవసర బాధితులకు తాత్కాలిక ఉపశమనం కోసం వాడే రెమిడెసివియర్, ఫావిఫెరావిడ్, డెక్సామెథాసన్ ఫోర్ ఎంజీ, టోలిసిజుమబ్లు మార్కెట్లో దొరకడం లేదు. అపోలో, మెడిప్లస్ వంటి ప్రముఖ మెడికల్ షాపుల్లోనూ ఇవి అందుబాటులో లేవు. కొన్ని ఏజెన్సీలు మార్కెట్లో వీటికి కృత్తిమ కొరత సృష్టించి, గుట్టు చప్పుడు కాకుండా బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తున్నాయి. కార్పొరేట్ ఆస్పత్రుల్లోనూ ఈ మందులు లేక పోవడంతో అత్యవసర పరిస్థితిల్లో బాధితులు మధ్య వర్తుల సహాయంతో వీటిని అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఎప్పటికపుడు ఆయా తయారీ కంపెనీలు, సరఫరా ఏజెన్సీలపై నిఘా ఉంచాల్సిన డ్రగ్ కంట్రోల్ బోర్డు అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. పరోక్షంగా అక్రమార్కులకు సహకరిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
కరోనా పరీక్షలు : ఐసీఎంఆర్ కీలక నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న తరుణంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) కీలక ప్రకటన చేసింది. కరోనా వైరస్ సోకిందో లేదో నిర్ధారించే ఆర్టీ-పీసీఆర్ టెస్టులకు ఇప్పటివరకు వసూలు చేస్తున్న రూ.4500 గరిష్ఠ నిబంధనను ఎత్తివేసింది. ఇకపై ఈ చార్జీలు నిర్ణయించే అధికారాన్ని రాష్ట్రాలకు అప్పగిస్తూ ఐసీఎంఆర్ నిర్ణయం తీసుకుంది ఈ మేరకు ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఒక లేఖ రాశారు. కోవిడ్-19 నిర్ధారణ కిట్లు బహిరంగ మార్కెట్లో విరివిగా అందుబాటులో ఉండటం, ప్రైవేట్ ల్యాబ్‌ల మధ్య విపరీతమైన పోటీ నేపథ్యంలో ధరలు దిగి వచ్చే అవకాశం వుందని ఐసీఎంఆర్ తెలిపింది. ఈ విషయంలో ఆయా రాష్ట్రాలు, ప్రైవేట్ ల్యాబ్‌లు, సంస్థలు పరస్పర అంగీకారంతో ధర నిర్ణయించుకోవచ్చని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు రాసిన లేఖలో ఐసీఎంఆర్ పేర్కొంది. కరోనా నిర్ధారణ టెస్టుకు ఎంత చార్జ్ చేయాలి అనేది ఇప్పటివరకూ కేంద్ర పరిధిలో ఉన్న అంశం. తాజా నిర్ణయంతో దీన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు సవరించుకునే వెసులుబాటు కల్పించింది. (కోవిడ్-19 : పరిశీలనలో అతి చవకైన మందు ) ఐసీఎంఆర్ లేఖ ప్రకారం, దేశంలో 428 ప్రభుత్వ ప్రయోగశాలలు, 182 ప్రైవేట్ ల్యాబ్‌లు ఇందుకోసం అందుబాటులో ఉన్నాయి. అలాగే మే 25 నాటికి ఐసీఎంఆర్ ఇప్పటికే 35 టెస్టింగ్ కిట్ల (విదేశీ,స్వదేశీ )ను ఆమోదించింది. అలాగే మే 26 నాటికి, రోజుకు లక్ష పరీక్షలు చొప్పున 31లక్షలను దాటినట్టు వెల్లడించింది. ఈ పరీక్షల సామర్థ్యాన్ని రోజుకు 2 లక్షల పరీక్షలకు పెంచాలని యోచిస్తోంది. కాగా ఈ సంవత్సరం మార్చి17 న, పరీక్షా కిట్ల లభ్యత పరిమితంగా వుండటం, ప్రైవేట్ ల్యాబ్‌ల మోసాలను అరిట్టేందుకు ఒక్కో టెస్టుకు గరిష్టంగా రూ.4,500 మాత్రమే చార్జి చేయాలని నిబంధన పెట్టిన సంగతి తెలిసిందే. -
పరిశ్రమల ఊతానికి టూల్ ‘కిటుకు’
సాక్షి, హైదరాబాద్: కోవిడ్–19 మహమ్మారి మూలంగా వివిధ రంగాలు తీవ్రంగా దెబ్బతినగా, కొన్ని మాత్రం నెలలు, ఏళ్లు గడిచినా పూర్వ స్థితికి చేరుకునే పరిస్థితి కనిపించడం లేదు. మరికొన్నింటికి ప్రభుత్వ పరంగా కొంత ఊతమిస్తే తిరిగి కార్యకలాపాలను పూర్తి స్థాయిలో నిర్వహించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రంగాల వారీగా పరిశ్రమల స్థితిగతులను అధ్యయనం చేయడంతో పాటు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎలాంటి సాయం అందించాలనే అంశంపై రాష్ట్ర పరిశ్రమల శాఖ దృష్టి సారించింది. వివిధ రంగాల స్థితిగతులను అధ్యయనం చేసేందుకు ‘టూల్ కిట్ల’ను సిద్ధం చేసి 15 రోజుల్లో అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. పరిశ్రమలకు ముడి సరుకులు ఎంత మేర అందుబాటులో ఉన్నాయి, కార్మి కుల వలస వాటి పనితీరుపై ఎలాంటి ప్రభావం చూపుతోంది, డీలర్లు, షాపుల మూసివేత వల్ల ఎంత మేర నష్టం జరుగుతోంది, వినియోగదారులు ఏ తరహా సమస్యలు ఎదుర్కొంటున్నారు వంటి అంశాలను ‘టూల్‌కిట్’లో పొందుపరుస్తారు. టూల్ కిట్ రూపొందించడంలో భాగంగా భారీపరిశ్రమలతో పాటు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల(ఎంఎస్ఎంఈ) రంగం ఎదుర్కొంటున్న స్థితిగతులపై పరిశ్రమల శాఖ వివిధ కోణాల్లో సమాచారాన్ని సేకరిస్తోంది. తద్వారా ఏయే రంగాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేర్వేరుగా ఏ తరహా సాయం అందించవచ్చనే అంశాన్ని కూడా ‘టూల్‌కిట్’లో పొందు పరుస్తున్నట్లు పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ ‘సాక్షి’కి వెల్లడించారు. రాత్రి షిఫ్టులకు కూడా అనుమతి లాక్డౌన్ నిబంధనలను సడలించడంతో పారిశ్రామిక కార్యకలాపాలు పూర్తి స్థాయిలో పట్టాలెక్కినట్లు పరిశ్రమల శాఖ చెప్తోంది. చాలా పరిశ్రమలు ముడి సరుకుల కొరత, వాటి ధరలు పెరగడం, రవాణా, మార్కెటింగ్, కార్మికుల కొరత వంటి సమస్యలను ఎదుర్కొంటున్నాయి. కర్మాగారాల వద్దకు కార్మికులను చేరవేసేందుకు అవసరమైతే ఆర్టీసి బస్సులను తక్కువ అద్దెకు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు పరిశ్రమల శాఖ వర్గాలు చెప్తున్నాయి. గతంలో 33 శాతం సామర్థ్యంతో కార్యకలాపాలు నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వగా, ప్రస్తుతం ఎంత మంది కార్మికులను అయినా విధుల్లోకి తీసుకునేందుకు అనుమతిస్తోంది. అవసరమైతే రాత్రి షిఫ్టుల్లోనూ ఉత్పత్తికి కూడా అనుమతులు ఇస్తోంది.పరిశ్రమలు మాత్రం కార్మి కుల కొరతను ఎదుర్కొనేందుకు గతంలో ఉన్న 8 గంటల పని విధానాన్ని 12గంటలకు పెంచాలని కోరుతున్నాయి. కార్మిక చట్టాలు, నిబంధనలకు లోబడి 12 గంటల షిఫ్టునకు అనుమతించడంలో సా ధ్యాసాధ్యాలపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. యూపీ, మధ్యప్రదేశ్‌లో ఇప్పటికే 12 గంటల పని విధానానికి అనుమతిచ్చినా, వేతనాల్లో పెంపుపై స్పష్టత ఇవ్వలేదు. ఎంఎస్ఎంఈ పరిశ్రమలకు కార్మికుల కొరత రాష్ట్రంలోని పారిశ్రామికవాడల్లో సుమారు పది వేలకు పైగా ఎంఎస్ఎంఈ పరిశ్రమల్లో 15లక్షల మంది కార్మికులు పనిచేస్తుండగా, ఇందులో సగం మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారే ఉన్నారు. లాక్డౌన్ నిబంధనలు సడలించడంతో వలస కార్మికులు సొంత రాష్ట్రాలకు తిరుగుముఖం పడుతున్నారు. తమ కంపెనీలో పని చేసే 30 మంది కార్మికుల్లో అందరూ ఇతర రాష్ట్రాలకు చెందిన వారేనని, ఇప్పటికే ఎనిమిది మంది స్వస్థలాలకు వెళ్లడంతో ఉత్పత్తికి అంతరాయం కలుగుతోందని ఉప్పల్ పారిశ్రామిక వాడకు చెందిన ఓ పరిశ్రమ యజమాని ఆందోళన వ్యక్తం చేశారు. -
కరోనా టెస్ట్ కిట్‌ను రూపొందించిన ఢిల్లీ ఐఐటీ
సాక్షి, హైదరాబాద్: కేవలం వందల రూపాయల ఖర్చుతో తయారయ్యే ‘కోవిడ్ 19 డిటెక్షన్ కిట్’ను దేశీయ టెక్నాలజీతో ఢిల్లీ ఐఐటీ రూపొందించింది. దీనిని వైద్య పరిశోధనలో అత్యున్నత పరిశోధన సంస్థ ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) కూడా ఆమోదించింది. కోవిడ్‌ను గుర్తించడంలో ఈ కిట్ వంద శాతం కచ్చితత్వంతో పనిచేస్తున్నట్లు ఐసీఎంఆర్ ధ్రువీకరించింది. పాలిమరేజ్ చైన్ రియాక్షన్ (పీసీఆర్) ఆధారితంగా ఈ పరికరం పనిచేస్తుంది. సరైన పారిశ్రామిక భాగస్వామి దొరికితే వారం పది రోజుల్లో ఈ కిట్‌ను వాణిజ్యపరంగా అందుబాటులోకి తెచ్చేందుకు ఢిల్లీ ఐఐటీ సన్నాహాలు చేస్తోంది. తక్కువ ధరలో అందుబాటులోకి.. కరోనా జన్యుక్రమంలో కొన్ని ప్రత్యేక ప్రాంతాల్లో బలహీనమైన ఆర్ఎన్ఏ క్రమాలను గుర్తించారు. ఈ అంశం కోవిడ్–19ను గుర్తుపట్టడంలో కీలకంగా మారడంతో పీసీఆర్ ఆధారంగా కిట్‌ను రూపొందించారు. ఈ ఏడాది జనవరి నుంచి తక్కువ ఖర్చుతో తయారయ్యే పరికరాన్ని రూపొందించడంపై ఢిల్లీ ఐఐటీ బృందం దృష్టి సారించింది. ఈ పరికరాన్ని ఎక్కువ సంఖ్యలో ఉత్పత్తి చేస్తే ధర కూడా తగ్గే అవకాశం ఉందని ఆయా వర్గాలు చెబుతున్నాయి. ఢిల్లీ ఐఐటీ నిధులతో రూపొందించిన ఈ పరికరంపై పేటెంట్ కోసం పరిశోధక బృందం దరఖాస్తు చేసింది. -
చైనా కిట్లలో అత్యంత నాణ్యత ఉంది..
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ సోకిందో, లేదో వేగంగా నిర్ధారించే ‘రాపిడ్ టెస్టింగ్ కిట్స్’ అత్యంత నాణ్యత కలిగి ఉన్నాయని భారత్‌లోని చైనా రాయబార కార్యాలయం ప్రతినిధి జి రాన్ వెల్లడించారు. వైద్యానికి సంబంధించిన రాపిడ్ టెస్టింగ్ కిట్లను ఎగుమతి చేయడంలో నాసిరకం ఉత్పత్తులను చైనా ఎప్పుడూ ప్రోత్సహించదని ఆయన చెప్పారు. అదేవిధంగా చైనా నుంచి భారత ఉన్నతాధికారులకు ఎటువంటి అత్యవసర సాయమైన అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయన ట్విటర్లో పేర్కొన్నారు. (వాటిని రెండ్రోజులు వాడొద్దు) భారత్‌లో కరోనా వైరస్ రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో కరోనా టెస్టింగ్ కిట్లను చైనా నుంచి భారత్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. కానీ చైనా నుంచి కొనుగోలు చేసిన ఆ కిట్స్ ద్వారా జరిపిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో సరైన ఫలితాలు రావడం లేదని పలు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) రెండు రోజుల పాటు ఆ కిట్లను వాడవద్దని మంగళవారం రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. ఇక చైనా నుంచి వచ్చిన ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ వినియోగాన్ని నిలిపేస్తున్నట్లు రాజస్తాన్ ప్రకటించిన విషయం తెలిసిందే. Noticed reports concerning rapid testing kits. #China attaches great importance to the quality of exported medical products. Will keep close communication with #Indian concerned agency and provide necessary assistance. — Ji Rong (@ChinaSpox_India) April 21, 2020 -
వాటిని రెండ్రోజులు వాడొద్దు
న్యూఢిల్లీ/జైపూర్: కరోనా వైరస్ సోకిందో, లేదో వేగంగా నిర్ధారించే ‘రాపిడ్ టెస్టింగ్ కిట్స్’ను రెండు రోజుల పాటు వాడవద్దని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) మంగళవారం రాష్ట్రాలను కోరింది. చైనా నుంచి కొనుగోలు చేసిన ఆ కిట్స్ ద్వారా జరిపిన నిర్ధారణ పరీక్షల్లో సరైన ఫలితాలు రావడం లేదని ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. క్షేత్రస్థాయిలో ఆ కిట్స్ పనితీరును పరీక్షించి, అనంతరం రాష్ట్రాలకు వాటి వినియోగంపై సూచనలు చేస్తామంది. నిర్ధారణ పరీక్షల్లో సరైన ఫలితాలు రావడం లేదని తేలితే, ఆ కిట్స్‌కు బదులుగా, సంబంధిత సంస్థను వేరే కిట్స్‌ను సరఫరా చేయాలని కోరుతామన్నారు. ‘ఒక రాష్ట్రం నుంచి ఈ విషయమై ఫిర్యాదు వచ్చింది. వేరే 3 రాష్ట్రాలతో మాట్లాడాము. ఈ ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ ఫలితాలకు, ల్యాబ్ పరీక్షల ఫలితాలకు మధ్య తేడాలు వచ్చినట్లు మా దృష్టికి వచ్చింది. అందువల్ల రెండు రోజుల పాటు ఆ కిట్స్ వాడవద్దని రాష్ట్రాలకు సూచించాం’అని ఐసీఎంఆర్‌కు చెందిన డాక్టర్ రామన్ గంగాఖేడ్కర్ చెప్పారు. ఈ వ్యాధిని గుర్తించి మూడున్నర నెలలే గడిచినందున నిర్ధారణ పరీక్షల తీరును మెరుగుపర్చాల్సి ఉందన్నారు. కేసులు రెట్టింపయ్యే సమయం గణనీయంగా పెరిగిందని, అందువల్ల భారీగా కేసులు నమోదయ్యే పరిస్థితి రాకపోవచ్చని పేర్కొన్నారు. చైనా నుంచి వచ్చిన ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ వినియోగాన్ని నిలిపేస్తున్నట్లు రాజస్తాన్ ప్రకటించింది. ఆ కిట్స్ ద్వారా జరిపిన పరీక్షల్లో 90% çసరైన ఫలితాలు రావాల్సి ఉండగా.. 5.4% మాత్రమే కచ్చితమైన ఫలితాలు వస్తున్నట్లు తేలిందన్నారు. ఈ విషయాన్ని ఐసీఎంఆర్ దృష్టికి తీసుకు వెళ్లామని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రఘు తెలిపారు. ల్యాబ్ టెస్ట్‌లో పాజిటివ్ వచ్చినవారికి ఈ ర్యాపిడ్ టెస్ట్ కిట్ ద్వారా జరిపిన పరీక్షలో నెగటివ్ వస్తోందన్నారు.‘ఇవి చైనాలో తయారైన కిట్స్. ఐసీఎంఆర్ ఉచితంగా 30 వేల కిట్స్‌ను రాష్ట్రానికి ఇచ్చింది. అదనంగా 10 వేల కిట్స్‌ను కొనుగోలు చేశాం’అని రాజస్తాన్ అదనపు చీఫ్ సెక్రటరీ రోహిత్ తెలిపారు. ఈ కిట్స్ రక్త పరీక్ష ద్వారా, అత్యంత తక్కువ సమయంలో కరోనాను నిర్ధారిస్తాయి. ఈ కిట్స్ ద్వారా పాజిటివ్‌గా తేలిన వారికి మళ్లీ ల్యాబ్ టెస్ట్ ద్వారా నిర్ధారిస్తారు. లోక్‌సభ సెక్రెటేరియెట్ ఉద్యోగికి కరోనా లోక్‌సభ సెక్రెటేరియెట్‌లో పారిశుధ్య విధులు నిర్వర్తించే ఓ ఉద్యోగికి కరోనా వైరస్ సోకినట్లు అధికారులు చెప్పారు. అతడు గత వారం రోజులుగా విధులకు హాజరు కావడం లేదని తెలిపారు. 19 వేలకు చేరువలో.. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య మంగళవారం సాయంత్రానికి 18,985కి, మరణాల సంఖ్య 603కి చేరింది. సోమవారం సాయంత్రం నుంచి 24 గంటల వ్యవధిలో 1,329 కేసులు, 44 మరణాలు నమోదయ్యాయి. మరణాల్లో 11 రాజస్తాన్‌లో, 10 గుజరాత్లో, 9 మహారాష్ట్రలో, 3 యూపీలో, 2 చొప్పున ఢిల్లీ, తమిళనాడు, మధ్యప్రదేశ్‌ల్లో, ఒకటి కర్ణాటకలో సంభవించాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. 3,259 మంది కోలుకుని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని మంగళవారం వెల్లడించింది. 17% పైగా పేషెంట్లు కోలుకున్నారని పేర్కొంది. ఇప్పటివరకు మహారాష్ట్రలో అత్యధికంగా 232 మరణాలు చోటు చేసుకున్నాయి. కేసులవారీగా కూడా మొదటి స్థానంలో మహారాష్ట్ర ఉంది. ఆ రాష్ట్రంలో 4,669 కేసులు నమోదయ్యాయి. కరోనాపై టెలిఫోనిక్ సర్వే కరోనా వైరస్ వ్యాప్తి, నియంత్రణ చర్యలపై ప్రజల అభిప్రాయాలు తెలుసుకునేందుకు టెలిఫోన్ సర్వే నిర్వహించనున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం వెల్లడించింది. ఈ టెలిఫోన్ సర్వేలో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చింది. 1921 అనే నంబర్ నుంచి ఫోన్ వస్తుందని, అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని కోరింది. ఇలాంటి సర్వే పేరుతో ఇతర నంబర్ల నుంచి వచ్చే కాల్స్‌కు స్పందించవద్దని సూచించింది. ► ఇప్పటివరకు చేస్తున్న పాలిమెరేజ్ చైన్ రియాక్షన్(పీసీఆర్) పరీక్షల్లో గొంతు, ముక్కులో నుంచి తీసిన శాంపిల్‌ను పరీక్షించి, కరోనా సోకిందా? లేదా? అన్న విషయాన్ని నిర్ధారిస్తారు. అయితే, ఈ విధానంలో ఫలితాలు వచ్చేందుకు 5– 6 గంటల సమయం పడుతుంది. కానీ రక్త పరీక్ష ద్వారా జరిపే రాపిడ్ యాంటీబాడీ టెస్ట్‌లో ఫలితం అరగంటలోపే వచ్చేస్తుంది. హాట్‌స్పాట్స్‌లో ఈ ర్యాపిడ్ టెస్టింగ్ విధానాన్ని అవలంబించేందుకు ప్రభుత్వం అనుమతించింది. ► గతవారం ఐదు లక్షల కిట్స్‌ను ఐసీఎంఆర్ చైనాకు చెందిన రెండు సంస్థల నుంచి కొనుగోలు చేసి, కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్న రాష్ట్రాలకు పంపించింది. ► చైనా ఉత్పత్తుల్లో నాణ్యతాపరమైన లోపాలున్నట్లు వస్తున్న వార్తలపై గతవారం చైనా రాయబార కార్యాలయ అధికార ప్రతినిధి జి రాంగ్ స్పందిస్తూ అత్యంత నాణ్యమైన ఉత్పత్తులను ఎగుమతి చేసేలా తమ దేశంలో కఠినమైన నిబంధనలున్నాయన్నారు. -
కరోనా కిట్ల రవాణాకు ఎయిరిండియా విమానాలు
న్యూఢిల్లీ: లాక్డౌన్ నేపథ్యంలో రవాణావ్యవస్థ పూర్తిగా నిలిచిపోవడంతో కరోనా కిట్లను అత్యవసర ప్రాతిపదికన ఎయిరిండియా విమానాల ద్వారా ఆస్పత్రులకు అందిస్తున్నట్లు పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్సింగ్ పూరి వెల్లడించారు. ఐసీఎంఆర్(ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) రూపొందించిన కరోనా కిట్లను ఢిల్లీ నుంచి ఐజ్వాల్, కోల్‌కతా, హైదరాబాద్‌లకు ఇప్పటికే పంపాం. ముంబై నుంచి పుణే, బెంగళూరు, తిరువనంతపురంలకు .. కోల్‌కతా నుంచి దిబ్రూగర్‌కుకు పంపనున్నాం’అని ట్విట్టర్లో వివరించారు. -
‘జగనన్న విద్య కానుక’ కిట్ల కొనుగోలుకు అనుమతులు
సాక్షి, అమరావతి : ‘జగనన్న విద్యా కానుక’ కిట్స్ కొనుగోలుకు పరిపాలనా సంబంధిత అనుమతులు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కిట్లు కొనుగోలుకు మొత్తం రూ. 655.60 కోట్లు వ్యయం కానుంది. సమగ్ర శిక్షణ కేంద్ర పథకం ద్వారా ఈ కిట్లు పంపిణీ చేస్తారు. ఇందులో రాష్ట్ర వాటాగా రూ. 262.24 కోట్లు వెచ్చించనుంది. ఆరు రకాల వస్తువులతో కిట్లు.. కాగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులందరికీ వచ్చే విద్యా సంవత్సరం నుంచి ‘జగనన్న విద్యా కానుక’ కింద ఆరు రకాల వస్తువులతో కూడిన ప్రత్యేక కిట్లను ప్రభుత్వం పంపిణీ చేయనుంది. 1వ తరగతి నుంచి 10 తరగతి వరకు చదివే 42 లక్షల మందికి పైగా విద్యార్థులకు ఈ కిట్లను అందిస్తారు. ప్రతి కిట్‌లో 3 జతల యూనిఫామ్ క్లాత్, నోట్ పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, షూ– 2 జతల సాక్స్‌లు, స్కూల్ బ్యాగ్, బెల్టు ఉంటాయి. యూనిఫామ్ కుట్టించేందుకు అయ్యే ఖర్చులను విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వమే జమ చేస్తుంది. వేసవి సెలవుల అనంతరం స్కూళ్లు తెరిచే నాటికి ఈ కిట్లను పంపిణీ చేయనుంది.(6 వస్తువులతో జగనన్న విద్యా కానుక) -
గణితం ఇక సులువే..!
పశ్చిమగోదావరి, నిడమర్రు: మనిషి చేసే ప్రతి పనికి ఓ లెక్క ఉంటుంది. లెక్కగా నడుచుకుంటే ప్రతి విద్యార్థికీ లెక్కలంటే మక్కువ పెరుగుతుంది. లెక్కలు.. ఎక్కాలు.. చిన్నప్పటి నుంచి వింటున్నా.. ఒకటో తరగతి నుంచి బట్టీ పట్టినా చాలా మంది విద్యార్థులకు గణితం అంటే ఎందుకో భయం. ఆ భయమే వారిని ఆ సబ్జెక్టుకు దూరం చేస్తుంది. దీంతో ప్రాథమిక పాఠశాలల్లో లెక్కల హోమ్ వర్క్ చేయలేనివారు బడికి పోవడానికి జంకుతారు. ఇలా గణితం అంటే భయపడే విద్యార్థులే లక్ష్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో ‘గణిత మిత్ర’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు విద్యాశాఖాధికారులు. జిల్లాలోని ఆదర్శ పాఠశాలల్లో ఈ గణితమిత్రలను ఏర్పాటు చేయాలని ఎస్సీఈఆర్టీ అధికారులు భావించారు. తొలి విడతగా జిల్లాలో రోలు ఎక్కువగా ఉన్న 134 పాఠశాలలను ఎంపిక చేశారు. సత్ఫలితాలు పొందేందుకే రాష్ట్ర విద్యా శిక్షణ పరిశోధన సంస్థ, ఇతర స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ సాధన పరీక్ష, రాష్ట్ర స్థాయి సాధన పరీక్షల వంటి వాటిలో ప్రాథమిక స్థాయి విద్యార్థులు గణిత ప్రక్రియల్లో వెనుకబడి ఉన్నట్టు గుర్తించారు. ఐదో తరగతి పూర్తి చేసే నాటికి చతుర్విద ప్రక్రియలైన కూడికలు, తీసివేతలు, భాగాహారాలు, గుణకారంలో అవగాహన లేకుండానే 70 శాతం మంది ఆరో తరగతిలోకి ప్రవేశిస్తున్నట్లు గుర్తించారు. వీరిలో 50 శాతం కనీసం మూడో తరగతి లెక్కలు కూడా చేయలేకపోతున్నట్లు ఆయా మూల్యాంకాల పరిశీలనలో తేలింది. ఇలాంటి వారికోసం సరళంగా సులభంగా, ఆసక్తికరంగా గణిత పాఠాలు నేర్చుకోవడానికి అవసరమైన బోధనోపకరణాలు అందిస్తే సత్ఫలితాలు పొందవచ్చని విద్యాశాఖ అధికారులు భావించారు. ఈ ఆలోచనల నుండే పుట్టుకొచ్చింది ‘గణితమిత్ర’ కార్యక్రమం. గణిత కిట్స్‌తో బోధన ఉపాధ్యాయులు చెప్పడం, విద్యార్థులు వినడం ద్వారా 26 శాతం, చూడటం ద్వారా నేర్చుకునేది 78 శాతం గుర్తుంటుందని సైకాలజీ నిపుణులు హెబ్బింగ్ హౌస్ తెలిపారు. ఆయన చెప్పిన అక్షర సత్యాన్ని నిజం చేసేందుకు పాఠశాల విద్యాశాఖ, ఎస్సీఆర్టీ అ«ధ్వర్యంలో ఈ గణితమిత్ర కార్యక్రమం నిర్వహించనున్నారు. దీని అమలుకు రూపొందిం చిన గణిత కిట్స్ సోమవారం జిల్లా ఎస్ఎస్ఏ కార్యాలయానకి చేరుకున్నాయి. వీటిని ఒకటి రెండు రోజుల్లో ఎంపిక చేసిన పాఠశాలలకు సరఫ రా చేయనున్నారు. ఈ కిట్స్ వినియోగంపై ఆయా పాఠశాలల్లో ఎంపిక చేసిన టీచర్‌కు శిక్షణ ఇస్తారు. జిల్లాలో 134 పాఠశాలల ఎంపిక జిల్లాలో 334 ఆదర్శపాఠశాలు ఉన్నాయి. వీటిలో 134 పాఠశాలలను ఈ గణిత మిత్ర కార్యక్రమానికి తొలి విడత ఎంపిక చేశారు. గణిత కిట్లను పంపిణీ చేసి, వాటి వినియోగం ద్వారా స్పందనను ఫలితాల ఆధారంగా మిగిలిన పాఠశాలల్లో అమలు చేయాలని విద్యాశాఖాధికారులు నిర్ణయించారు. అభ్యసన సామగ్రి ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు గణితంలోని బోధనాభ్యసన కృత్యాలు, పూసల చట్రం, అబాకస్, ఎక్కాలు సులభంగా నేర్పడానికి, గుణిజాలు తెలపడానికి అభ్యసన సామగ్రి ఉంటుంది. వివిధ ఆకారాలు, కాలం, పొడవు, బరువులకు సంబంధించిన ప్రక్రియలను సులభంగా అవగాహన చేసుకోవడానికి కృత్యాలు ఉంటాయి. కారణాంకాలు, గుణిజాలు, సౌష్టవాలు, కొలజాడి, లీటర్లు, మిల్లీ మీటర్లు పాత్రలు తదితర సులభంగా అర్థమయ్యేలా బోధించేందుకు అభ్యసన సామగ్రి ఉంటుంది. -
ఏపీ సర్కారుకు హైకోర్టు సీరియస్ వార్నింగ్
-
మీపై ప్రభుత్వానికి కన్నతల్లి ప్రేమ
హుస్నాబాద్ : హస్టల్ విద్యార్థులపై తెలంగాణ ప్రభుత్వానిది కన్నతల్లి ప్రేమ అని కలెక్టర్ వెంకట్రామిరెడ్డి అన్నారు. హుస్నాబాద్ కస్తూర్బా బాలికల విద్యాలయంలో ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన బాలిక ఆరోగ్య రక్ష కిట్ల పంపిణీ పథకాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. బాలిక ఆరోగ్య రక్ష పథకం కింద జిల్లాలో 26,460 కిట్ల పంపిణీకి ఒక్కో దానికి రూ.1300 చొప్పున రూ. 3.50 కోట్లు ఖర్చు చేస్తోందని తెలిపారు. బంగారు తెలంగాణ కావాలంటే మంచి పౌష్టికారం అందించి, విద్యార్థి దశలోనే అత్యున్నత ప్రమాణాలతో వసతులు కల్పిస్తున్నామన్నారు. ఉపాధ్యాయులు ప్రతీ విద్యార్ధి ప్రగతిపై నిత్యం పది నిమిషాలు ప్రత్యేక సమయం కేటాయించాలని కోరారు. తల్లిదండ్రులతో సైతం సమావేశం నిర్వహించాలని సూచించారు. ఈ విధానాన్ని ఈ కస్తూర్బా విద్యాలయం నుంచి నాంది పలకాలని, ఇక్కడి స్ఫూర్తితోనే రాష్ట్రమంతా అమలులోకి వచ్చెలా కృషి చేయాలన్నారు. ప్రభుత్వం ఒక్కో విద్యార్థిపై దాదాపు రూ.1.25లక్షలు ఖర్చు పెడుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏ పథకం ప్రవేశపెట్టినా సిద్దిపేట జిల్లా నుంచే శ్రీకారం చుట్టి అమలు చేస్తూ విజయవంతం చేశామన్నారు. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా సిద్దిపేట జిల్లాలో 6 ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్నామని, ఇక్కడి నుంచే పది జిల్లాలకు నీటి సరఫరా చేయాల్సి వస్తుందన్నారు. కస్తూర్బా విద్యాలయం ఆవరణలో సీసీ కెమెరాతో పాటు భవనానికి రంగులు వేసేందుకు నిధులు మంజూరు చేస్తున్నానని ప్రకటించారు. పాఠశాల ఆవరణలో కలెక్టర్ మొక్కలు నాటారు. కార్యక్రమంలో జేసీ పద్మాకర్, డీఈఓ రవికాంత్‌రావు, ఆర్డీఓ శంకర్‌కుమార్, మున్సిపల్ చైర్మన్ సుద్దాల చంద్రయ్య, ఎంపీపీ మంగ, తహసీల్దార్ విజయసాగర్, ఎంపీడీఓ రాము, ఏఎంసీ చైర్మన్ లింగాల సాయన్న, టీవీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కవ్వ లక్ష్మారెడ్డి, బాలికల విద్యాధికారి బండారి మనీల, కౌన్సిలర్ దండి లక్ష్మి, ఎస్ఓ మమత, కో ఆర్టినేటర్ కక్కెర్ల రవీందర్ పాల్గొన్నారు. సమీకృత భవన నిర్మాణ స్థలం పరిశీలన పట్టణంలోని సబ్‌స్టేషన్ పరిధిలో సమీకృత భవనం కోసం స్థలాన్ని కలెక్టర్ వెంకట్రామిరెడ్డి శుక్రవారం పరిశీలించారు. ఇప్పటికే ప్రభుత్వం సమీకృత భవన నిర్మాణం కోసం రూ.17కోట్లు మంజూరు చేసింది. ఈ భవన నిర్మాణం కోసం కిషన్‌నగర్‌లోని పాలిటెక్నిక్ కళాశాల సమీపంలో మంత్రి హరీష్‌రావు శంకుస్ధాపన చేశారు. దూరంగా నిర్మించడం వల్ల ఇబ్బందులు కలుగుతాయని పలువురు సూచించడంతో నిర్మాణ పనులు ప్రారంభించలేదు. సబ్ స్టేషన్ వద్ద ఉన్న స్ధలాన్ని, సర్వే మ్యాప్‌ను కలెక్టర్ పరిశీలించారు. పట్టణం ఆకృతి, ఆర్డీఓ కార్యాలయం, కిషన్‌నగర్‌లోని స్థలం, సబ్ స్టేషన్ సమీపంలోని స్థలాలను మ్యాప్ ద్వారా నివేదికను అందించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట జేసీ పద్మాకర్, ఆర్డీఓ శంకర్‌కుమార్, తహసీల్దార్ విజయ సాగర్, ఆర్ఐ రత్నాకర్‌రెడ్డి పాల్గొన్నారు. ‘గౌరవెల్లి’ పనుల పరిశీలన అక్కన్నపేట(హుస్నాబాద్): గౌరవెల్లి ప్రాజెక్టు పనులను కలెక్టర్ వెంకట్రామిరెడ్డి శుక్రవారం పరిశీలించారు. ఈ నెల 28న ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహిస్తామని వెల్లడించారు. ప్రాజెక్టు పనులు వేగవంతం చేసేందుకు 15మంది అధికారులతో బృందం ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. కలెక్టర్ వెంట జేసీ పద్మాకర్, ఆర్డీఓ శంకర్‌కుమార్ ఉన్నారు.