
క్రిష్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటంటే..?
గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన క్రిష్ తరువాత చేయబోయే సినిమా ఎలా ఉండబోతోందన్న చర్చ మొదలైంది. తన కెరీర్లో ఇప్పటి వరకు తీసిన జానర్లో మరో సినిమా చేకుండా వస్తున్న క్రిష్, గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాతో చారిత్రక కథాంశాన్ని కూడా అద్భుతంగా డీల్ చేశాడు. ఈ నేపథ్యంలో క్రిష్ నెక్ట్స్ సినిమాకు ఏ జానర్ ఎంచుకుంటాడని ఇండస్ట్రీ జనాలు ఆసక్తిగా గమనిస్తున్నారు.
క్రిష్ చేయబోయే నెక్ట్స్ సినిమా ఓ థ్రిల్లర్ అన్న టాక్ వినిపిస్తోంది. బాలయ్యతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన క్రిష్ తన నెక్ట్స్ సినిమాను కూడా సీనియర్ హీరోతోనే చేయాలని భావిస్తున్నాడట. అందుకే విక్టరీ వెంకటేష్ హీరోగా ఓ థ్రిల్లర్ సినిమాను తెరకెక్కించే ప్లాన్లో ఉన్నాడు. ఈ సినిమాను భారీ గ్రాఫిక్స్తో రూపొందించాలని భావిస్తున్నాడు. ప్రస్తుతానికి క్రిష్ నుంచి అధికారిక ప్రకటన లేకపోయినా.. దాదాపు ప్రాజెక్ట్ ఫైనల్ అయినట్టే అన్న ప్రచారం జరుగుతోంది.