
నందమూరి బాలకృష్ణ స్వయంగా నటిస్తూ నిర్మిస్తున్న ఈ సినిమా యన్.టి.ఆర్. నందమూరి తారకరామారావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా తొలి భాగం యన్.టి.ఆర్ కథానాయకుడు సంక్రాంతి కానుకగా జనవరి 9న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు.
రెండవ భాగం యన్.టి.ఆర్ మహానాయకుడు జనవరి 24న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే రెండు సినిమా మధ్య గ్యాప్ తక్కువగా ఉండే కలెక్షన్ల పై ప్రభావం పడుతుందని భావిస్తున్నారట నందమూరి ఫ్యాన్స్. అందుకే రెండవ భాగాన్ని పోస్ట్‌పోన్ చేయాల్సిందిగా చిత్రయూనిట్‌పై ఒత్తిడి తెస్తున్నారట. మరి అభిమానుల కోరిక మేరకు యన్.టి.ఆర్ టీం సినిమాను వాయిదా వేస్తుందేమో చూడాలి.
బాలకృష్ణ ఎన్టీఆర్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రలో బాలీవుడ్ నటి విద్యాబాలన్ నటిస్తుండగా అక్కినేని పాత్రలో సుమంత్, ఎన్టీఆర్ తనయుడు హరికృష్ణగా కళ్యాణ్ రామ్ నటిస్తున్నారు. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతమందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment