జనవరి 8న శాతకర్ణి పతాక ఉత్సవం | Gautamiputra satakarni pathaaka utsavam on Jan 8th | Sakshi
Sakshi News home page

జనవరి 8న శాతకర్ణి పతాక ఉత్సవం

Published Wed, Jan 4 2017 2:26 PM | Last Updated on Tue, Sep 5 2017 12:24 AM

జనవరి 8న శాతకర్ణి పతాక ఉత్సవం

జనవరి 8న శాతకర్ణి పతాక ఉత్సవం

నందమూరి బాలకృష్ణ వందో సినిమాగా తెరకెక్కుతున్న భారీ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ చేస్తున్నారు. క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ స్యయంగా నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్న చారిత్రక చిత్రంలో బాలీవుడ్ నటి హేమామాలినీ, శ్రియలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో వేగం పెంచారు.

ఇప్పటికే ట్రైలర్ రిలీజ్, ఆడియో రిలీజ్ కార్యక్రమాలను భారీగా నిర్వహించిన యూనిట్ సభ్యులు త్వరలో మరో ఉత్సవాన్ని ప్లాన్ చేశారు. శాతకర్ణి పతాక ఉత్సవం పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని తెలుగు రాష్ట్రాల్లోని వందో థియేటర్లలో నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు. తెలుగు చక్రవర్తి గౌతమీపుత్ర శాతకర్ణి విజయాలకు చిహ్నంగా శాలివాహన రాజ్య చిహ్నం ఉన్న జెండాలను వంద థియేటర్లలో ఎగురవేసేలా ప్లాన్ చేస్తారు.

జనవరి 8న ఈ కార్యక్రమాన్ని తలపెడుతున్నారు. హీరో నందమూరి బాలకృష్ణ స్వయంగా విశాఖలోని జ్యోతి థియేటర్లో జెండా ఎగురవేసి ఈ పతాక ఉత్సవాన్ని ప్రారంభిస్తారు. ఇతర ప్రాంతాల్లో నందమూరి అభిమాన సంఘం నాయకులు ఇతర ప్రముఖులు జెండాలు ఎగురవేసేలా ప్లాన్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement