శాతకర్ణి సంచలనం
నందమూరి బాలకృష్ణ వందో సినిమాగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న భారీ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి. క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చారిత్రక చిత్రం అఫీషియల్ ట్రైలర్ విడుదలైంది. శాతకర్ణి జన్మస్థలం అయిన కరీంనగర్ జిల్లా కోటిలింగాలలో ఈ ట్రైలర్ను రిలీజ్ చేశారు. అఖండ భారతాన్ని పరిపాలించిన శాతకర్ణి కథతో భారీ యుద్ధ సన్నివేశాలతో ఈ సినిమాను తెరకెక్కించారు.
శుక్రవారం సాయంత్రం విడుదలైన శాతకర్ణి ట్రైలర్ కేవలం నాలుగున్నర గంటల సమయంలో పదిలక్షల వ్యూస్ సాధించి రికార్డ్ సృష్టించింది. బాలయ్య సరసన శ్రియా హీరోయిన్గా నటిస్తుండగా బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ హేమామాలినీ బాలకృష్ణ తల్లి పాత్రలో కనిపించనున్నారు. కన్నడ స్టార్ హీరో శివ రాజ్కుమార్, శాతకర్ణి కొడుకు పాత్రలో నటిస్తున్నాడు. ఈ నెల 26న గౌతమీపుత్ర శాతకర్ణి ఆడియో వేడుకను తిరుపతిలో నిర్వహించేందుకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు.