క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ హీరోహీరోయిన్లుగా ఓ సినిమా తెరకెక్కుతోంది. అడవి నేపథ్యంలో సాగే చిత్రమిది. ఇటీవలే షూటింగ్ ప్రారంభించారు. వికారాబాద్ అడవుల్లో చిత్రీకరణ జరుపుతున్నారు. ఈ సినిమాలో రకుల్ పల్లెటూరి అమ్మాయి పాత్రలో నటిస్తున్నారని ఆమె పాత్రకు సంబంధించిన కొన్ని స్టిల్స్ చెబుతున్నాయి. ఆ మధ్య రకుల్ షూటింగ్‌లో పాల్గొన్నప్పటి ఫొటోలు ఇవి. కాగా బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతికి సంబంధించిన డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన రియా చక్రవర్తి.. డ్రగ్స్ తీసుకుంటున్న వారి పేర్లలో రకుల్ ప్రీత్ సింగ్ పేరు కూడా చెప్పారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment