'సాహో రాజమౌళి... సాహో' | krish letter to rajamouli | Sakshi
Sakshi News home page

'సాహో రాజమౌళి... సాహో'

Jan 24 2017 10:15 AM | Updated on Jul 14 2019 4:05 PM

'సాహో రాజమౌళి... సాహో' - Sakshi

'సాహో రాజమౌళి... సాహో'

సంక్రాంతి కానుకగా విడుదలై ఘన విజయం సాధించిన గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాపై ఇప్పటికీ ప్రశంసల జల్లు కురుస్తూనే ఉంది.

సంక్రాంతి కానుకగా విడుదలై ఘన విజయం సాధించిన గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాపై ఇప్పటికీ ప్రశంసల జల్లు కురుస్తూనే ఉంది. ముఖ్యంగా అతి తక్కువ సమయంలో ఇంతటి భారీ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు క్రిష్ ప్రతిభకు దిగ్దర్శకులు కూడా సాహో అంటున్నారు. బాహుబలి సినిమాతో తెలుగు సినిమా స్థాయిని ఎన్నో రెట్లు పెంచిన దర్శకుడు రాజమౌళి, గౌతమిపుత్ర శాతకర్ణి యూనిట్ను, ప్రత్యేకంగా దర్శకుడు క్రిష్ను అభినందించారు.

రాజమౌళి లాంటి గ్రేట్ డైరెక్టర్ స్వయంగా అభినందించటంతో దర్శకుడు క్రిష్ పొంగిపోతున్నాడు. అందుకే రాజమౌళికి కృతజ్ఞతలు తనదైన స్టైల్లో తెలిపాడు. ' ప్రియమైన రాజమౌళి గారూ.. నాకు ఆదర్శంగా నిలిచిన దర్శకుల్లో మీరు ఒకరు.. అందరూ విజయం కోసం ఎదురుచూస్తుంటారు, కానీ విజయం మీ కోసం ఎదురుచూస్తుంటుంది..

అలాంటి మీరు విజయం వరించింది క్రిష్ అంటే నాకెలా ఉంటుంది? ఎన్ని ధన్యవాదాలు చెపితే సరిపోతుంది? దర్శకత్వంలోనే కాదు, వ్యక్తిత్వంలో కూడా నాకు ఆదర్శంగా నిలిచారు.. మీ అబినందన వింటుంటే, ఆదర్శం ఆశీర్వదిస్తున్నట్టుంది.. భుజం తడుతున్న మీ చేతిని ఎన్నిసార్లు నా నుదురు తాకినా తక్కువే.. త్రికరణ శుద్ధిగా చెపుతున్నాను.. సాహో రాజమౌళి.. సాహో.. ప్రేమతో, క్రిష్'. అంటూ ఉద్వేగంగా తన కృతజ్ఞతలు తెలియజేశాడు క్రిష్.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement