రాడిసన్ డ్రగ్స్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. మిగతా వాళ్ల సంగతి పక్కనబెడితే ఈ కేసులో టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు క్రిష్ పేరు ప్రముఖంగా వినిపించింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు.. క్రిష్‌ని కూడా నిందితుడిగా చేర్చారు. విచారణకు హాజరు కావాలని కోరారు. దీనికి తొలుత ఒప‍్పుకొన్నాడు. కానీ ఆ తర్వాత రెండు రోజులు గడువు కావాలని శుక్రవారం వస్తానని పోలీసులతో చెప్పాడు. ఇప్పుడు హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించాడు. తాజాగా ఈ బెయిల్ పై హైకోర్టులో విచారణ జరగ్గా.. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా పడింది.
(ఇదీ చదవండి: బిగ్‌బాస్ షోకి వెళ్లొచ్చాక నన్ను బ్యాన్ చేశారు: అలీ రెజా)
ఈ క్రమంలోనే క్రిష్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డ్రగ్స్ పార్టీతో నాకు ఎలాంటి సంబంధం లేదు. వివేకానంద్ ఇచ్చిన స్టేట్‌మెంట్ వల్ల నన్ను నిందితుడిగా చేర్చారు. నేను డ్రగ్స్ తీసుకున్నాను అనడానికి ఆధారాలు లేవు. నన్ను కావాలనే ఈ కేసులో ఇరికించారు' అని క్రిష్ చెప్పుకొచ్చారు.
అయితే రాడిసన్ డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు అయిన వివేకానంద్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే క్రిష్ పేరుని పోలీసులు ఎఫ్ఐఆర్‌లో చేర్చారు. ఇతడికి, క్రిష్‌కి మధ్య ఏ స్థాయిలో సంబంధాలు ఉన్నాయనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేయాలనుకుంటున్నారు. పనిలో పనిగా క్రిష్ నుంచి శాంపిల్స్ తీసుకొని పరీక్షలకు పంపించాలనేది పోలీసుల ప్లాన్. కానీ క్రిష్ మాత్రం తనకు సమయం కావాలని చెబుతూ, కోర్టులో బెయిల్ కోసం అప్లై చేశాడు.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ థ్రిల్లర్ మూవీ.. తెలుగు స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)
Comments
Please login to add a commentAdd a comment