
రీసెంట్‌గా టాలీవుడ్‌లో డ్రగ్స్ కేసు కలకలం రేపింది. మిగతా వాళ్ల సంగతి పక్కనబెడితే పవన్ కల్యాణ్‌తో సినిమా చేస్తున్న డైరెక్టర్ క్రిష్ పేరు తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింది. డ్రగ్స్ కేసులో క్రిష్ పేరు బయటకు రాగానే విచారణకు హాజరు కావాలని పోలీసులు ఆదేశించారు. తొలుత సరేనని ఒప్పుకొన్న క్రిష్.. ముంబయిలో ఉన్నానని రెండు రోజులు టైమ్ కావాలని కోరాడు.
(ఇదీ చదవండి: 'అజ్ఞాతవాసి' పవన్ కల్యాణ్ పొలిటికల్ సినిమా)
కానీ అంతలోనే తనన పోలీసులు అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ డైరెక్టర్ క్రిష్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. అది అలా ఉండగానే తాజాగా డ్రగ్స్ కేసులో పోలీసుల ముందు క్రిష్ విచారణకు హాజరయ్యాడు. టెస్టుల్లో నెగిటివ్ అని తేలింది. దీంతో క్రిష్.. తన పిటిషన్‌ని విత్ డ్రా చేసుకుంటున్నట్లు అతడి తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలియజేశారు.
(ఇదీ చదవండి: డ్రగ్స్ కేసులో డైరెక్టర్ క్రిష్.. కీలక వ్యాఖ్యలు చేసిన మాదాపుర్ డీసీపీ)
Comments
Please login to add a commentAdd a comment