రెండోవారం దూసుకుపోతున్న శాతకర్ణి
‘సమయం లేదు మిత్రమా.. శరణమా? రణమా?’ అంటూ వచ్చిన నందమూరి బాలకృష్ణ వందో సినిమా 'గౌతమిపుత్ర శాతకర్ణి'.. చారిత్రక నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమా అమెరికాలో భారీ వసూళ్లతో దూసుకుపోతున్నది. అమెరికాలో రెండోవారంలోనూ ఈ సినిమా గొప్ప వసూళ్లు రాబడుతున్నది. అగ్రరాజ్యంలో ఈ సినిమా వసూళ్ల జోరు కొనసాగుతున్నదని, సోమవారం 93,419 డాలర్లను, మంగళవారం 68,205 డాలర్లను ‘శాతకర్ణి’ రాబట్టిందని ప్రముఖ బాలీవుడ్ ట్రెడ్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్విట్టర్‌లో తెలిపారు. ఇప్పటివరకు అమెరికాలో ఈ సినిమా రూ. 9.87 కోట్లను రాబట్టినట్టు సమాచారం. మొత్తంగా చూసుకుంటే రూ. 50 కోట్ల మార్క్‌ను ఈ సినిమా దాటినట్టు తెలుస్తోంది.
ఇప్పటికే తొలిరోజు రూ. 18 కోట్లు వసూలు చేసిన ‘శాతకర్ణి’ ఇటు బాలకృష్ణ కెరీర్‌లోనూ, అటు దర్శకుడు క్రిష్ కెరీర్‌లోనూ బిగ్గెస్ట్ ఓపెనర్‌గా రికార్డు సాధించింది. ఫెస్టివల్ సీజన్‌లో వచ్చిన ఈ సినిమా తొలి వీకెండ్ భారీ వసూళ్లు సాధించింది. తొలి మూడు రోజుల్లో రూ. 48 కోట్ల వరకు వసూలు చేసినట్టు సమాచారం.
ప్రస్తుతానికి బాక్సాఫీస్ వద్ద ‘శాతకర్ణి’ నిలకడగా వసూళ్లు రాబడుతున్నట్టు సినీ పండితులు చెప్తున్నారు. 'శాతకర్ణి' సినిమా 'ఏ' సెంటర్లలో బాగా ఆడుతున్నప్పటికీ, బీ, సీ సెంటర్లలో అంతగా ప్రభావం చూపలేకపోతున్నదని అంటున్నారు. తెలుగు చక్రవర్తి శాతకర్ణి చారిత్రక కథతో సినిమాగా తెరకెక్కిన ఈ సినిమాపై ప్రశంసల జల్లు కురుస్తోంది.
Telugu film #GautamiPutraSatakarni continues its GLORIOUS RUN in USA... Mon $ 93,419, Tue $ 68,205. Total: $ 1,449,617 [₹ 9.87 cr]. @Rentrak
— taran adarsh (@taran_adarsh) January 18, 2017