దుమ్మురేపుతున్న శాతకర్ణి ట్రైలర్‌ | Gautamiputra Satakarni Theatrical Trailer | Sakshi
Sakshi News home page

దుమ్మురేపుతున్న శాతకర్ణి ట్రైలర్‌

Published Fri, Dec 16 2016 6:21 PM | Last Updated on Wed, Aug 29 2018 1:59 PM

దుమ్మురేపుతున్న శాతకర్ణి ట్రైలర్‌ - Sakshi

దుమ్మురేపుతున్న శాతకర్ణి ట్రైలర్‌

నందమూరి బాలకృష్ణ వందో చిత్రంగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని కరీంనగర్‌లోని తిరుమల థియేటర్‌లో వినూత్నంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాలయ్య అభిమానులు భారీగా పాల్గొన్నారు.

'మా జైత్రయాత్రను గౌరవించి, మా ఏలుబడిని అంగీకరించి, మీ వీర ఖడ్గాన్ని మా రాయబారికి స్వాధీనం చేసి, మాకు సామంతులవుతారని ఆశిస్తున్నాము. సమయము లేదు మిత్రమా శరణమా.. రణమా' అంటూ బాలకృష్ణ తనదైన శైలి డైలాగ్‌తో ప్రారంభమైన ట్రైలర్‌ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ చారిత్రాత్మక చిత్రాన్ని అదే స్థాయితో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement