Kiran Abbavaram Rules Ranjan Movie Pooja Ceremony at Hyderabad - Sakshi
Sakshi News home page

Kiran Abbavaram: సినీ అతిరథుల మధ్య 'రూల్స్‌ రంజన్‌' ప్రారంభం..

Published Fri, May 27 2022 4:34 PM | Last Updated on Fri, May 27 2022 5:59 PM

Kiran Abbavaram Rules Ranjan Movie Launched - Sakshi

Kiran Abbavaram Rules Ranjan Movie Launched: యంగ్‌ హీరో కిరణ్‌ అబ్బవరం వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఇటీవల 'సెబాస్టియన్‌ పీసీ 524'తో ఆకట్టుకున్న కిరణ్‌ అంతకుముందు 'ఎస్‌ఆర్‌ కల్యాణమండపం' సినిమాతో హిట్‌ కొట్టాడు. తాజాగా 'సమ్మతమే' సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇదే కాకుండా రత్నం కృష్ణ దర్శకత్వంలో 'రూల్స్‌ రంజన్' అనే కొత్త సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్ర ప్రారంభోత్సవ పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లో సినీ అతిరథుల సమక్షంలో వైభవంగా జరిగాయి. 

హీరో కిరణ్ అబ్బవరంపై చిత్రీకరించిన తొలి ముహుర్తపు సన్నివేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన ప్రముఖ దర్శకుడు క్రిష్‌ క్లాప్‌ కొట్టారు. దర్శక నిర్మాత ఏఎం రత్నం స్క్రిప్ట్‌ అందించి కెమెరా స్విచ్‌ ఆన్‌ చేశారు. శుక్రవారం (మే 27) నుంచి మూవీ రెగ్యులర్ షూటింగ్‌ జరుపుకుంటుంది. ఏఎం రత్నం సమర్పణలో శ్రీ సాయి సూర్య మూవీస్‌, స్టార్‌ ఎంటర్‌టైన్మెంట్‌ పతాకంపై నిర్మిస్తున్న ఈ సినిమాలో ఆశిష్‌ విద్యార్థి, అజయ్‌, వెన్నెల కిశోర్, వైశాలి, హిమాని, జయవాణి, ముంతాజ్, సత్య బాలీవుడ్ నటీనటులు అన్ను కపూర్, సిద్ధార్థ సేన్, అతుల్‌ పర్చులే అలరించనున్నారు. 

చదవండి: 'డెడ్‌' అని సమంత పోస్ట్‌.. ఆ వెంటనే డిలీట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement