వారిద్దరూ జంటగా '101 జిల్లాల అందగాడు' | 101 Jillala Andagadu Release Date Finalized | Sakshi
Sakshi News home page

వారిద్దరూ జంటగా '101 జిల్లాల అందగాడు'

Published Thu, Feb 18 2021 12:42 AM | Last Updated on Thu, Feb 18 2021 12:47 AM

'101 Jillala Andagadu' release date finalized - Sakshi

రుహానీ శర్మ, అవసరాల శ్రీనివాస్

అవసరాల శ్రీనివాస్, రుహానీ శర్మ జంటగా తెరకెక్కిన చిత్రం ‘101 జిల్లాల అందగాడు’. ఈ సినిమాతో రాచకొండ విద్యాసాగర్‌ దర్శకునిగా పరిచయమవుతున్నారు. నిర్మాత ‘దిల్‌’ రాజు, డైరెక్టర్‌ క్రిష్‌ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌ మెంట్స్‌ బ్యానర్స్‌పై శిరీష్, రాజీవ్‌ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించారు. ఈ సినిమాను మే 7న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ‘‘వినోదాత్మకంగా తెరకెక్కిన చిత్రమిది. ఈ చిత్రంలో హీరోగా నటించడంతో పాటు కామెడీ పంచ్‌లతో ప్రేక్షకులు ఎంజాయ్‌ చేసేలా మంచి ఎంటర్‌టైనింగ్‌ కథను అందించారు అవసరాల శ్రీనివాస్‌. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌  కార్యక్రమాలు జరుగుతున్నాయి’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: రామ్, సంగీతం: శక్తికాంత్‌ కార్తీక్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement