
నందమూరి బాలకృష్ణ స్వయంగా నటిస్తూ నిర్మిస్తున్న ఈ సినిమా యన్.టి.ఆర్. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఇన్నాళ్లు ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించలేదు.
ఈ రోజు రిలీజ్ చేసిన రెండు పోస్టర్‌లతో యన్.టి.ఆర్‌పై క్లారిటీ ఇచ్చారు. ఉదయం ‘యన్.టి.ఆర్ కథానాయకుడు’ అంటూ ఎన్టీఆర్ సినీ జీవితానికి సంబంధించిన తొలిభాగం పోస్టర్‌ను రిలీజ్ చేశారు. సాయంత్రం ‘యన్.టి.ఆర్ మహానాయకుడు’ పేరుతో ఎన్టీఆర్ రాజకీయ జీవితానికి సంబంధించిన రెండో భాగం పోస్టర్‌ను రిలీజ్ చేశారు. తొలి భాగం జనవరి 9న, రెండో భాగాన్ని జనవరి 24న రిలీజ్ చేయనున్నారు.