‘యన్‌.టి.ఆర్‌’లో ఏఎన్నార్‌ | Sumanth Look In Ntr Biopic | Sakshi
Sakshi News home page

Published Thu, Sep 20 2018 9:53 AM | Last Updated on Thu, Sep 20 2018 12:22 PM

Sumanth Look In Ntr Biopic - Sakshi

నట సామ్రాట్‌ అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా టాలీవుడ్‌ ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తోంది. సినీ ప్రముఖులు సోషల్‌ ఈ మీడియా ద్వారా ఏఎన్నార్‌ను స్మరించుకుంటున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఎన్టీఆర్‌ బయోపిక్‌ చిత్రయూనిట్ ఏఎన్నార్‌కు నివాళులర్పిస్తూ ఓ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. ఈ బయోపిక్‌లో ఏఎన్నార్‌ పాత్రలో నటిస్తున్న ఆయన మనవడు సుమంత్‌ లుక్‌ను రివీల్ చేశారు చిత్రయూనిట్‌.

నందమూరి బాలకృష్ణ స్వయంగా నటిస్తూ నిర్మిస్తున్న ఈ సినిమాకు క్రిష్ దర్శకుడు. సాయి కొర్రపాటి, విష్ణువర్దన్ ఇందూరి నిర్మాణంలో తెరకెక్కిస్తుండగా కీరవాణి సంగీతమందిస్తున్నారు. ఎన్టీఆర్‌ సినీ రాజకీయ ప్రస్థానాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నారా చంద్రబాబు నాయుడు పాత్రలో యంగ్‌ హీరో రానా నటిస్తుండగా ఎన్టీఆర్‌ సతీమణి బసవతారకంగా బాలీవుడ్ నటి విద్యాబాలన్‌ కనిపించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement