శాతకర్ణి జన్మస్థలంలో ట్రైలర్ లాంచ్ | Gautamiputra Satakarni Trailer Launch details | Sakshi
Sakshi News home page

శాతకర్ణి జన్మస్థలంలో ట్రైలర్ లాంచ్

Published Sun, Dec 11 2016 10:33 AM | Last Updated on Mon, Sep 4 2017 10:28 PM

శాతకర్ణి జన్మస్థలంలో ట్రైలర్ లాంచ్

శాతకర్ణి జన్మస్థలంలో ట్రైలర్ లాంచ్

నందమూరి బాలకృష్ణ వందో చిత్రంగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి. క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ చారిత్రాత్మక చిత్రాన్ని అదే స్థాయితో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని కూడా వినూత్నంగా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా బాలయ్య వందో చిత్రం కావటంతో వంద థియేటర్లలో ట్రైలర్ ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

తెలుగు చక్రవర్తి శాతకర్ణి జీవితకథతో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఆయన జన్మస్థలమైన కోటిలింగాలలో నిర్వహించనున్నారు. తెలంగాణ రాష్ట్రం, కరీంనగర్ జిల్లాలోని కోటిలింగాల శాతకర్ణి తల్లి గౌతమీ ఊరు. ఆయన జన్మస్థలం కూడా అదే. అందుకే ఈ నెల 16న గౌతమీపుత్ర శాతకర్ణి ట్రైలర్ను నందమూరి బాలకృష్ణ చేతుల మీదుగా కోటిలింగాలలో విడుదల చేయనున్నారు. త్వరలోనే ఈ సినిమా ఆడియో రిలీజ్ వేడుకను కూడా ఘనంగా నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement