పవన్‌ కల్యాణ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌! | Pawan Kalyan Director Krish Movie New Update | Sakshi
Sakshi News home page

పవర్‌స్టార్‌ సరసన ప్రగ్యా జైస్వాల్‌

Published Sat, Jan 25 2020 1:09 PM | Last Updated on Sat, Jan 25 2020 1:09 PM

Pawan Kalyan Director Krish Movie New Update - Sakshi

పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ వేగం పెంచాడు. రాజకీయాలతో బిజీగా మారడంతో సినిమాలకు కాస్త గ్యాప్‌ ఇచ్చిన పవన్‌.. తాజాగా వరుస సినిమాలతో దూకుడు పెంచాడు. ఇప్పటికే  వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో ‘పింక్‌’రిమేక్‌ చేస్తున్న విషయం తెలిసిందే. దిల్‌ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది. తమిళంలో కూడా హిట్‌ సాధించిన పింక్‌ రిమేక్‌ను పవన్‌ చేస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అంజలి, నివేదా థామస్‌, అనన్య పాండేలు నటిస్తున్న ఈ చిత్రాన్ని సమ్మర్‌లో విడుదల చేయాలని దిల్‌ రాజు భావిస్తున్నారట.

కాగా, ఈ చిత్రం నిర్మాణ దశలో ఉండగానే మరో చిత్రాన్ని కూడా సెట్స్‌ పైకి తీసుకెళ్లె పనిలో పవన్‌ ఉన్నట్లు సమాచారం. ఎప్పటినుంచో ట్యాలెంటెడ్‌ డైరెక్టర్‌ క్రిష్‌ దర్శకత్వంలో పవన్‌ ఓ సినిమా చేయనున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. పాన్‌ ఇండియా చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్ర ప్రీ ప్రొడక్షన్‌ పనులు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ చిత్రంలో పవన్‌ సరసన ‘కంచె’ ఫేమ్‌ ప్రగ్యా జైస్వాల్‌ను ఎంపిక చేసినట్లు అనధికారిక సమాచారం.

చారిత్రక నేపథ్యంతో పాటు ఓ ఎమోషనల్‌ విప్లవాత్మకమైన పాయింట్‌ను కూడా టచ్‌ చేస్తున్నట్టు టాలీవుడ్‌ టాక్‌. అంతేకాకుండా ఈ చిత్రంలో మంచి కోసం పరితపించే ఓ దొంగ పాత్రలో పవన్‌ నటించనున్నట్లు సమాచారం. ఇక ఈ రెండు చిత్రాలతో పాటు పూరి జగన్నాథ్‌ చిత్రం కూడా లైన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక సినిమాల్లోకి పవన్‌ రీఎంట్రీతో అయన అభిమానులు తెగ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement