
ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ (పాత ఫొటో)
సాక్షి, హైదరాబాద్ : దివంగత నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా రూపొందుతున్న ‘యన్.టి.ఆర్’. చిత్రంపై నాదెండ్ల కుటుంబం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు సినిమా దర్శకుడు క్రిష్, నటుడు బాలకృష్ణకు నోటీసులు పంపింది. ఎమ్మెల్యే హోదాను ఉద్దేశించ ఒకటి, నటుడిగా మరొక నోటీసును బాలకృష్ణకు నాదెండ్ల భాస్కరరావు పెద్ద కుమారుడు పంపారు.
సినిమాలో తమ పాత్రల గురించి ఎలాంటి అనుమతి తీసుకోలేదని వెల్లడించారు. నెగటివ్ షేడ్‌లో భాస్కరరావును చూపించే ప్రయత్నం చేస్తునట్టు తమకు సమాచారం ఉందని ఆయన చెప్పారు. కాగా, క్రిష్ దర్శకత్వంలో ఎన్‌బీకే ఫిల్మ్స్ పతాకంపై బాలకృష్ణ, సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
ఇటీవలే గ్రాండ్‌గా ఈ సినిమాను స్టార్ట్ చేసిన బాలకృష్ణ, సినిమా రిలీజ్‌కు కూడా స్పెషల్ డేట్‌ను ఫిక్స్ చేశారు. ఎన్టీఆర్ తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జనవరి 9నే ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. వచ్చే నెలలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కావాల్సివుంది.
Comments
Please login to add a commentAdd a comment