Peanut Diamond: ట్రైలర్‌పై క్రిష్‌ ప్రశంసలు | Peanut Diamond Trailer Released | Sakshi
Sakshi News home page

పీనట్‌ డైమండ్‌ ట్రైలర్‌ వచ్చేసింది..

Published Mon, Jun 14 2021 5:39 PM | Last Updated on Mon, Jun 14 2021 8:45 PM

Peanut Diamond Trailer Released - Sakshi

పీనట్‌ డైమండ్‌ ట్రైలర్‌ చాలా బాగుందని క్రిష్‌ ప్రశంసలు కురిపించాడు. దర్శకుడు ఎంత శ్రద్ధ పెట్టి సినిమా చేశారో అర్థం అవుతుందని, విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని తెలిపాడు.

అభిన‌వ్ స‌ర్దార్‌, రామ్ కార్తిక్, చాందిని త‌మిళ్‌ రాస‌న్‌, శాని సాల్మాన్‌‌, శెర్రి అగర్వాల్  ప్ర‌ధాన పాత్ర‌లలో నటిస్తున్న చిత్రం "పీనట్‌ డైమండ్‌". ఇటీవల రిలీజైన ఫస్ట్‌ లుక్‌, టీజర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. సోమవారం ఈ సినిమా ట్రైలర్‌ను ప్రముఖ దర్శకుడు క్రిష్‌ రిలీజ్‌ చేశాడు. ఈ సందర్భంగా క్రిష్‌ మాట్లాడుతూ.. ట్రైలర్‌ చాలా బాగుందన్నాడు. దర్శకుడు ఎంత శ్రద్ధ పెట్టి సినిమా చేశారో అర్థం అవుతుందని, విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని తెలిపాడు. ఈ సినిమా హిట్ అయ్యి దర్శకనిర్మాతలకు మంచి పేరు తీసుకురావాలని కోరుకున్నాడు.

ట్రైలర్‌ చూస్తుంటే నర్సిపట్నంలో దొరికే వజ్రాల వేట చుట్టూ కథ కొనసాగుతున్నట్లు కనిపిస్తోంది.  ఎఎస్‌పి మీడియా హౌస్, జివి ఐడియాస్ ప‌తాకాల‌పై అభిన‌వ్ స‌ర్ధార్‌, వెంక‌టేష్ త్రిప‌ర్ణ నిర్మిస్తున్నారు. వెంక‌టేష్ త్రిప‌ర్ణ క‌థ‌, మాట‌లు, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం అందిస్తున్నారు. ఫస్ట్ లుక్, టీజర్ లతో మంచి క్రేజ్ ను దక్కించుకున్న ఈ సినిమ కి `బెంగాల్ టైగ‌ర్` ఫేమ్ భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు. హీరో సుధీర్ బాబు రిలీజ్ చేసిన సినిమా పాటకు విశేష స్పందన లభించింది.

చదవండి: 30 ఇయర్స్‌ అంటోన్న బాలాదిత్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement