చారిత్రక కథనూ షార్ట్గా చెప్తున్నాడు | Gautamiputra Satakarni To Have Short Runtime | Sakshi
Sakshi News home page

చారిత్రక కథనూ షార్ట్గా చెప్తున్నాడు

Published Mon, Nov 28 2016 2:31 PM | Last Updated on Mon, Sep 4 2017 9:21 PM

చారిత్రక కథనూ షార్ట్గా చెప్తున్నాడు

చారిత్రక కథనూ షార్ట్గా చెప్తున్నాడు

సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ, ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో చారిత్రక చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలో

సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ, ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో చారిత్రక చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తి  చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. బాలకృష్ణ సినిమాలతో పోలిస్తే గౌతమీపుత్ర శాతకర్ణి ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగా దూసుకుపోతోంది. తన ప్రతీ సినిమాను సందేశాత్మకంగా మానవీయ కోణంలో తెరకెక్కించే క్రిష్ ఆ సినిమాలన్నింటినీ తక్కువ నిడివితోనే రూపొందిస్తుంటాడు.

అయితే గౌతమీపుత్ర శాతకర్ణి చారిత్రక కథ కావటంతో షార్ట్ రన్ టైంలో పూర్తిచేయటం కష్టామని భావించారు. కానీ క్రిష్ మరోసారి షాక్ ఇచ్చాడు. భారీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను కూడా కేవలం 2 గంటల 12 నిమిషాల్లోనే ముగించేశాడట. క్రిష్ స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్కు రెడీ అవుతోంది. డిసెంబర్ 16న భారీ ఎత్తున ఆడియో రిలీజ్ వేడుకను నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఆ రోజు నుంచే ప్రమోషన్ కార్యక్రమాలను కూడా ప్రారంభించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement