
శాతవాహనుల కథతో క్రిష్ మరో సినిమా
గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాతో సంచలనం సృష్టించిన దర్శకుడు క్రిష్ మరో భారీ చిత్రానికి రెడీ అవుతున్నాడు.
గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాతో సంచలనం సృష్టించిన దర్శకుడు క్రిష్ మరో భారీ చిత్రానికి రెడీ అవుతున్నాడు. తెలుగు వారి ఘనకీర్తిని కేవలం 79 రోజుల్లో తెరకెక్కించిన క్రిష్, ఇప్పుడు అదే కథకు కొనసాగింపుగా మరో సినిమాను తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడు. అయితే తొలి భాగంలో పూర్తిగా యుద్ధం, సామ్రాజ్య స్థాపననే చూపించిన క్రిష్.. రెండో భాగాన్ని ప్రేమకథగా రూపొందించే ఆలోచనలో ఉన్నాడు.
ప్రముఖ తెలుగు రచయిత డాక్టర్ ముదిగొండ శివప్రసాద్ రాసిన శ్రావణి అనే నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడు. గౌతమిపుత్ర శాతకర్ణి తనయుడు వాశిష్టిపుత్ర పులోమావి, శ్రావణి ప్రేమకథే శ్రావణి నవల. ఇప్పుడు అదే కథను క్రిష్ భారీగా వెండితెర మీద ఆవిష్కరించనున్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్ క్లాసిక్ మొగల్ ఈ అజం తరహాలో చరిత్రలో నిలిచిపోయే స్థాయిలో రూపొందించాలని భావిస్తున్నారు.