డీజే టిల్లు-2 నుంచి అనుపమ ఫస్ట్‌లుక్‌ విడుదల | Dj Tillu 2 Makers Released Anupama Parameswaran First Look | Sakshi
Sakshi News home page

Anupama Parameswaran : డీజే టిల్లు-2 నుంచి అనుపమ ఫస్ట్‌లుక్‌ విడుదల

Published Sat, Feb 18 2023 1:30 PM | Last Updated on Sat, Feb 18 2023 1:33 PM

Dj Tillu 2 Makers Released Anupama Parameswaran First Look - Sakshi

సిద్ధూ జొన్నలగడ్డ నటించిన ‘డీజే టిల్లు’ సినిమా ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద అదిరిపోయే కలెక్షన్లను వసూలు చేసింది.ఇప్పుడీ సినిమాకు సీక్వెల్‌ రాబోతుంది. ‘డీజే టిల్లు స్క్వేర్’గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పలు హీరోయిన్లు పేర్లు వినిపించినా చివరికి అనుపమ పరమేశ్వరన్‌ ఫైనలైజ్‌ అయ్యింది.

ప్రస్తుతం ఈ సినిమా సెట్స్‌మీదుంది. తాజాగా అనుపమ పుట్టినరోజు సందర్బంగా  డీజే టిల్లు 2 నుంచి అనుపమ పోస్టర్‌ విడుదలైంది. ఇది ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక ఈ సందర్భంగా అనుపమకు పలువురు సెలబ్రిటీలు, నెటిజన్ల నుంచి బర్త్‌డే విషెస్‌ అందుతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement