ఏయ్‌ చహల్‌.. ప్రోటీన్‌ పౌడర్‌ తీసుకో! | Yuzvendra Chahal Posts Workout Video Gets Trolled By Fans | Sakshi
Sakshi News home page

Published Wed, Nov 21 2018 9:16 AM | Last Updated on Wed, Nov 21 2018 9:16 AM

Yuzvendra Chahal Posts Workout Video Gets Trolled By Fans - Sakshi

టీమిండియా యువ క్రికెటర్లు సోషల్‌ మీడియాలో చాలా ఆక్టీవ్‌గా ఉంటారన్న విషయం తెలిసిందే. వారికి సంబందించిన ప్రతీ అప్‌డేట్స్‌ని అభిమానులతో పంచుకుంటారు. సహచర ఆటగాళ్లతో సరదా సన్నివేశాలు, ఫన్నీ వీడియోలు, వర్కౌట్‌ వీడియోలు షేర్‌ చేస్తూ అలరిస్తుంటారు. అయితే తాజాగా టీమిండియా స్పిన్నర్‌ యజువేంద్ర చహల్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన వీడియో తెగ ట్రోల్‌ అవుతోంది. ఇక వెస్టిండీస్‌ విధ్వంసకర ఆటగాడు క్రిస్‌గేల్‌ సైతం ‘దేవుడా సహాయం చేయ్‌’  అంటూ చహల్‌పై సెటైర్‌ వేశాడు.

ఆ వీడియోలో ఏముందంటే.. కీలక ఆస్ట్రేలియాతో సిరీస్‌ సందర్భంగా సెషన్ల వారిగా ప్రాక్టీస్‌ చేస్తూ టీమిండియా ఆటగాళ్లు చెమట చిందిస్తున్నారు. దీనిలో భాగంగా చహల్‌ జిమ్‌లో వర్కౌట్స్‌ చేస్తున్న వీడియో షేర్‌ చేశాడు. దీనిపై నెటిజన్లు ఫన్నీగా స్పందించారు. ‘బక్కపలచగా ఉండే చహల్‌ రోజు ప్రోటీన్‌ పౌడర్‌ తీసుకో’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సందిస్తున్నారు. ‘నువ్వు ఎంత ట్రై చేసినా గేల్‌లా బాడీ పెంచలేవు’ అంటూ మరికొందరు ఫన్నీగా స్పందిస్తున్నారు.   

Trying to UP the game down under #stayahead #IndvsAus

A post shared by Yuzvendra Chahal (@yuzi_chahal23) on

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement