జిమ్‌లో తెగ కష్టపడుతున్న వరుణ్‌ తేజ్‌ | Varun Tej Workout Video: No Backup For Hard Work | Sakshi
Sakshi News home page

Varun Tej: క్లైమాక్స్‌ కోసం వరుణ్‌ తేజ్‌ కష్టాలు

Aug 3 2021 2:57 PM | Updated on Aug 3 2021 2:58 PM

Varun Tej Workout Video: No Backup For Hard Work - Sakshi

'హార్డ్‌వర్క్‌కు బ్యాక్‌ అప్‌ అంటూ ఉండదు' అన్న క్యాప్షన్‌ ఇచ్చిన ఈ వీడియోలో వరుణ్‌ బాగానే కష్టపడుతున్నట్లు కనిపిస్తోంది...

Varun Tej Workout Video: హీరోలు ఒక్కో సినిమాకు ఒక్కో స్టైల్‌ మెయింటెన్‌ చేస్తుంటారు. యాక్షన్‌ సినిమాకు ఒక రకంగా, మాస్‌ సినిమాకు మరో రకంగా, ఫ్యామిలీ డ్రామాకు ఇంకో విధంగా.. ఇలా జానర్‌ను బట్టి, ఎంచుకున్న కథను బట్టి హీరో తన శరీరాకృతిని మార్చుకోక తప్పదు. అందులోనూ క్రీడా నేపథ్యం ఉన్న సినిమా అయితే బాడీని మరింత సానబెట్టాల్సిందే! కొణిదెల వారసుడు వరుణ్‌ తేజ్‌ కూడా ఇప్పుడదే పనిలో ఉన్నాడు. ప్రస్తుతం ఇతడు కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వంలో 'గని' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా!

ఇందులో వరుణ్‌ బాక్సర్‌గా రింగులోకి దిగి ఫైట్‌ చేయనున్నాడు. ఇందుకుగానూ కండలు పెంచడం కోసం జిమ్‌లో చెమటలు చిందిస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను అతడు సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. 'హార్డ్‌వర్క్‌కు బ్యాక్‌ అప్‌ అంటూ ఉండదు' అని క్యాప్షన్‌ ఇచ్చిన ఈ వీడియోలో వరుణ్‌ బాగానే కష్టపడుతున్నట్లు కనిపిస్తోంది. మొత్తానికి ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్‌ బ్యూటీ సయూ మంజ్రేకర్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా తమన్నా స్పెషల్‌ సాంగ్‌లో నర్తించే అవకాశం ఉందట. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ క్లైమాక్స్‌కు చేరుకున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement