Heroine Lavanya Tripathi Best Wishes to Varun Tej and Ghani Team - Sakshi
Sakshi News home page

Lavanya Tripathi: ప్రతిఫలం దక్కాలని ప్రార్థిస్తున్నా.. లావణ్య ట్వీట్‌ వైరల్‌

Published Thu, Apr 7 2022 6:44 PM | Last Updated on Thu, Apr 7 2022 7:24 PM

Heroine Lavanya Tripathi Best Wishes To Varun Tej And Ghani Team - Sakshi

మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌, హీరోయిన్‌ లావణ్య త్రిపాఠిల మధ్య ఏదో ఉందంటూ కొంతకాలంగా వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతున్నా ఇప్పటివరకు ఈ వార్తలపై అటు వరుణ్‌ కానీ, లావణ్య కానీ ఇప్పటి వరకు స్పందించలేదు. ఇదిలా ఉండగా తాజాగా వరుణ్‌ తేజ్‌కి లావణ్య స్పెషల్‌ విషెస్‌ తెలియజేసింది.

దీంతో ఈ రూమర్స్‌ మరోసారి తెరపైకి వచ్చాయి. వరుణ్‌ తేజ్‌, సయీ మంజ్రేకర్‌ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న గని చిత్రం రేపు(శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు రానుంది.  కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమాను అల్లు అరవింద్‌ సమర్పణలో అల్లు బాబీ, సిద్ధు ముద్ద నిర్మించారు.

సినిమా రిలీజ్‌ డేట్‌ నేపథ్యంలో గని టీంకు లావణ్య స్పెషల్‌ విషెస్‌ చెప్పింది. 'వరుణ్‌.. ఈ పాత్ర కోసం నువ్వు 110 శాతం ఎఫర్ట్ పెట్టావని తెలుసు. నీతో పాటు నీ టీం చేసిన హార్డ్‌ వర్క్‌కి తగిన ప్రతిఫలం దక్కాలని ప్రార్థిస్తున్నా' అంటూ ట్వీట్‌ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్‌ నెట్టింట చక్కర్లు కొడుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement