సూపర్‌ బ్యాలెన్స్‌ | Samantha Workouts in Gym | Sakshi
Sakshi News home page

సూపర్‌ బ్యాలెన్స్‌

Jul 21 2018 12:46 AM | Updated on Jul 21 2018 12:46 AM

Samantha Workouts in Gym - Sakshi

‘వ్యాయామం అంటే శరీరాన్ని బలంగా తయారు చేసుకోవడమే కాదు క్రమశిక్షణను అలవరచుకోవడం’ అని ఓ సందర్భంలో సమంత అన్నారు. అన్నట్లుగానే వర్కౌట్స్‌ చేయడంలో ఆమె రాజీ పడటంలేదు. ఎంతలా వ్యాయామాలు చేస్తారంటే ఎంత బరువైనా అవలీలగా మోసేంత. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 70 కేజీల బరువు ఎత్తారు. ఇక్కడున్న ఫొటోలో గమనించవచ్చు. అంత బరువును మోయాలంటే బాడీని ఎంతో బ్యాలెన్స్‌ చేయాలి, అలాగే చేశారు సమంత.

ఇక సినిమాల విషయానికొస్తే.. ఈ ఏడాది ఆమె నటించిన ‘రంగస్థలం, మహానటి, అభిమన్యుడు’ చిత్రాలు రిలీజైన సంగతి తెలిసిందే. తమిళ చిత్రాలు ‘సీమరాజా, సూపర్‌ డీలక్స్‌’, తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న ‘యు టర్న్‌’ సినిమా ఈ ఏడాదే రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. అలాగే పెళ్లి తర్వాత భర్త నాగచైతన్యతో కలిసి ఆమె నటించబోయే సినిమా ఈ నెల 23న స్టార్ట్‌ కానుంది. ఈ చిత్రానికి శివనిర్వాణ దర్శకత్వం వహిస్తారు. ఇలా ఓన్లీ వర్కౌట్స్‌లోనే కాదు పర్సనల్‌ అండ్‌ ప్రొఫెషనల్‌ లైఫ్‌లోనూ సమంత సూపర్‌ బ్యాలెన్స్‌ చూపిస్తున్నారు.
∙వెయిట్‌లిఫ్టింగ్‌ చేస్తూ...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement