లండన్: బ్రిటన్ ప్రధాని పదవికి పోటీ పడుతున్న రిషి సునాక్ మంచి మనసు చాటుకున్నారు. లైవ్ టీవీ ప్రోగ్రాంలో హఠాత్తుగా కుప్పకూలి పడిపోయిన యాంకర్‌కు సాయం చేశారు. రిషి తన ప్రత్యర్థి లిజ్ ట్రస్‌తో టీవీ డిబేట్‌లో పాల్గొనేందుకు వెళ్లినప్పుడు మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది.
'టాల్క్ టీవీ' డిబేట్‌లో తాను గెలిస్తే చేపట్టే కార్యక్రమాలపై లిజ్ ట్రస్ వివరిస్తున్న సమయంలో ఆ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న యాంకర్.. ఒక్కసారిగా కళ్లుతిరిగిపడిపోయింది. దీంతో ట్రస్ షాక్‌కు గురయ్యారు. మరోవైపు రిషి మాత్రం యాంకర్ పడిపోతుండగానే హుటాహుటిన ఆమె వద్దకు వెళ్లి సాయం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
A TV host faints during the UK's second leaders' debate between Liz Truss and Rishi Sunak pic.twitter.com/blovJGPiMK
— TICKER NEWS (@tickerNEWSco) July 26, 2022
యాంకర్ బాగానే ఉన్నప్పటికీ అనుకోకుండా అలా జరిగిందని, ఆమె ప్రోగ్రాం కొనసాగించవద్దని వైద్యులు ఇచ్చిన సూచన మేరకు డిబేట్‌ను రద్దు చేస్తున్నామని నిర్వాహకులు ప్రకటించారు.
బ్రిటన్ ప్రధాని ఎన్నికల ప్రచారంలో భాగంగా ట్రస్, రిషి పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. తాను అధికారంలోకి వస్తే పన్నుల్లో కోత విధిస్తానని ట్రస్ హామీ ఇస్తున్నారు. రిషి మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఆర్థిక వ్యవస్థను చక్కబెట్టడంపైనే తాను దృష్టి సారిస్తానని చెబుతున్నారు. ప్రజల జీవన వ్యయాన్ని తగ్గించడమే తన లక్ష‍్యమన్నారు.
మరోవైపు బ్రిటన్లోని పలు సర్వేలు లిజ్ ట్రస్ వైపే కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు మొగ్గు చూపుతున్నట్లు తెలిపాయి. రిషిపై ట్రస్ 24 పాయింట్ల శాతం ఆధిక్యంలో ఉన్నట్లు పేర్కొన్నాయి.
చదవండి: కరోనా మూలాల గుట్టు విప్పిన అధ్యయనం.. వైరస్ పుట్టింది అక్కడే.. కానీ ల్యాబ్‌లో కాదు
Comments
Please login to add a commentAdd a comment