లండన్: బ్రిటన్ ప్రధాని పదవికి బోరిస్ జాన్సన్ రాజీనామా ప్రకటించారు. భారత కాలమానం ప్రకారం.. గురువారం సాయంత్రం ఆయన స్వయంగా విషయాన్ని వెల్లడించారు.
2019లో ప్రజలు అందించిన అఖండ విజయం పట్ల బోరిస్ కృతజ్ఞతలు తెలియజేశారు. నా హయాంలో సాధించిన విజయాల పట్ల గర్వపడుతున్నా. బ్రెగ్జిట్‌ను పూర్తి చేయడం గర్వంగా ఉంది. కొత్త నేత వచ్చే దాకా ఆ స్థానంలో నేనే కొనసాగుతా, కన్జర్వేటివ్ పార్టీ త్వరలో కొత్త నేతను ఎన్నుకుంటుంది అని ప్రకటించారాయన.
సహచర మంత్రుల ఒత్తిళ్ల మేరకు తలొగ్గి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారాయన. కరోనా టైంలో బ్రిటన్ సంఘటితంగా ఉండి.. మహమ్మారిని ఎదుర్కోవడాన్ని ప్రస్తావించారాయన. రాజకీయాల్లో ఎవరూ అనివార్యం కాదు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలే చేశారాయన.
ఇక బోరిస్ రాజీనామాపై ప్రతిపక్ష లేబర్ పార్టీ సంతోషం వ్యక్తం చేసింది. గుడ్ న్యూస్ అంటూ సోషల్ మీడియాలో సంబురాలు మొదలుపెట్టింది.
Comments
Please login to add a commentAdd a comment