లండన్: బ్రిటన్ ప్రధాని పదవి రేసులో దూసుకుపోతున్నారు భారత సంతతికి చెందిన రిషి సునాక్. ప్రధాని పదవికి పోటి పోటీ పడుతున్న తుది ఇద్దరు అభ్యర్థుల్లో ఒకరిగా నిలిచారు. ఫలితంగా సరికొత్త చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్నారు. ఐదో రౌండ్‌లో 137 మంది ఎంపీల మద్దతుతో రిషి మొదటి స్థానం సంపాదించారు. చివరకు రిషి, లిజ్ ట్రస్ మాత్రమే పోటీలో మిగిలారు. రిషికి గట్టి పోటీ ఇస్తుందని భావించిన పెన్నీ మోర్డెంట్ ఎలిమినేట్ అయ్యారు.
ఇక కన్జర్వేటివ్ పార్టీకి చెందిన లక్షా 60 వేల మంది సభ్యుల్లో ఎక్కువ ఓట్లు ఎవరికి వస్తే వాళ్లే బ్రిటన్ ప్రధాని పీఠాన్ని కైవసం చేసుకుంటారు. రిషికి లిడ్ ట్రస్‌తో హోరాహోరీ పోరు ఉండనుంది. కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు ట్రస్‌వైపే మొగ్గుచూపే అవకాశాలు కూడా లేకపోలేదు. అయితే రిషి సోమవారం బీబీసీ ఛానెల్‌లో డిబేట్‌లో పాల్గొనాల్సి ఉంది. అలాగే ఇంకా చాలా కార్యక్రమాలకు హాజరై మద్దతు కూడగట్టుకోనున్నారు.
సెప్టెంబర్ 5న జరిగే బ్యాలట్ ఓటింగ్ నాటికి మరింత మందిని తన వైపు తిప్పుకుంటే రిషి విజయం నల్లేరుపై నడకే అవుతుంది. అప్పుడు బ్రిటన్ ప్రధాని పదవిని చేపట్టే తొలి భారత సంతతి వ్యక్తిగా రిషి సునాక్ సరికొత్త చరిత్ర సృష్టిస్తారు.
చదవండి: రోజుకు రూ.15 వేలు సంపాదిస్తున్నా.. ఏం చేసినా ఇంత డబ్బు రాదు.. అందుకే!
Comments
Please login to add a commentAdd a comment