వైరల్: బ్రిటన్ చరిత్రను తిరగరాస్తూ.. చిన్నవయసులోనే ఆ దేశ ప్రధానిగా ఎన్నికయ్యారు రిషి సునాక్. ఆయన పీఎంగా ఎన్నిక కావడం పట్ల కన్జర్వేటివ్ పార్టీలో.. ఆ దేశంలో ఆయన అభిమానులు ఇంకా సంబురాలు చేసుకుంటూనే ఉన్నారు. మరోవైపు భారత మూలాలు ఉన్న వ్యక్తి కావడంతో ఇక్కడి నెటిజన్స్ కూడా ఊరుకోవడం లేదు. ఈ గ్యాప్‌లో సెలబ్రిటీ చెఫ్ సంజయ్ రైనా షేర్ చేసిన ఓ వీడియో ట్విటర్‌లో తెగ వైరల్ అవుతోంది.
వీడియోలో ముందుగా సంజయ్.. ‘మామా, మీకు ఒకరు హలో చెప్తారు’ అని అంటాడు. ఆ వెంటనే కెమెరా రిషి సునాక్ వైపు మళ్లుతుంది. అప్పుడు రిషి సునాక్ ‘విజయ్ మామా..హాయ్. నేను రిషి. మీరు ఎలా ఉన్నారు..? మీరు యూకే వచ్చినప్పుడు నన్ను కలుస్తారని అనుకుంటున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు 10 డౌనింగ్ స్ట్రీట్‌కి తీసుకురామని మీ మేనల్లుడిని(రైనాను చూపిస్తూ..) అడగండి.. జాగ్రత్త’ అంటూ చెప్తారు.
వీడియో షేర్ చేసిన సంజయ్ ‘వీసా ఆన్ అరైవల్ పక్కా’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. పాతదే అనిపిస్తున్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు ‘విజయ్ మామా’ ఎవరు..? అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక సంజయ్ చేసిన ఈ వీడియో.. యూకే వీసా సమస్యలను ఉద్దేశించి సెటైరిక్‌గా చేసి ఉంటారనే కోణంలోనూ చర్చ నడుస్తోంది. ఇక ఆ విజయ్ మామా.. విజయ్ మాల్యా అయ్యి ఉండొచ్చనే అనుమానం ఒక నెటిజన్ వ్యక్తం చేయగా.. గుడ్ వన్ అంటూ నవ్వులు చిందించాడు సంజయ్ రైనా.
Visa on arrival ab pakka 😊😊#RishiSunak pic.twitter.com/imSIhuEgKB
— Sanjay Raina (@sanjayraina) October 27, 2022
Comments
Please login to add a commentAdd a comment