Viral Video: భారతీయ సంప్రదాయ వంటకాలకు అంతర్జాతీయంగా మాంచి గుర్తింపే ఉంది. అందునా మన అమ్మల చేతి వంటల్లోని రుచి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా.. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ సైతం తన తల్లీ చేతి వంటకం.. దానిని ఓ ప్రముఖుడికి అందించిన విషయంపై ఓ ఇంటర్వ్యూలో స్పందించారు.
నాకు మా అమ్మ(ఉషా సునాక్) భారతీయ తీపి వంటకాలను ఇవ్వాలనుకుంది. అందుకోసం బర్ఫీ చేసి ఇచ్చింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ, నేను కలుసుకుని కబుర్లు చెప్పుకున్నాం. మధ్యలో ఆయన ఆకలిగా ఉన్నట్లు అర్థమైంది. అందుకే అమ్మ చేసిన బర్ఫీని ఆయకు ఇచ్చా. ఈ విషయం తెలిసి మా అమ్మ ఎంతో సంతోషించింది. ఎంతో థ్రిల్‌గా ఫీలయ్యింది కూడా అని ఆయన ఇంటర్వ్యూలో ఆ విషయాన్ని గుర్తు చేసుకున్నారు.
ఇంట్లో మీ అమ్మ తయారుచేసిన స్వీట్‌లను ప్రయత్నించడం ప్రతిరోజూ వీలుకాదు కదా అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో జెలెన్‌స్కీ ఉద్దేశించి ఓ వీడియోను సైతం రిషి సునాక్ పోస్ట్ చేశారు. యూరోపియన్ పర్యటనలో భాగంగా జెలెన్‌స్కీ.. బ్రిటన్ ప్రధాని సునాక్‌ను కలిసినప్పుడు ఇది జరిగినట్లు స్పష్టమవుతోంది. ఇదిలా ఉంటే.. ఒకవైపు పాశ్చాత్య దేశాల మద్దతుతో రష్యా యుద్ధాన్ని కొనసాగిస్తున్నాడు జెలెన్‌స్కీ. మరోవైపు పాలనాపరమైన విమర్శలు ఎదుర్కొంటూ వచ్చే ఎన్నికలకు రిషి సునాక్ సిద్ధమవుతున్నాడు.
ఇదీ చదవండి: నిత్యయవ్వనంగా ఉండాలని.. రక్తం తాగేస్తూ..
Comments
Please login to add a commentAdd a comment