![Ukraine Updates: Zelenskyy Visits Uk For First Time Since Russia Invasion - Sakshi](/styles/webp/s3/article_images/2023/02/9/Untitled-11.jpg.webp?itok=hK2B1hCU)
లండన్: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ బుధవారం ఆకస్మికంగా బ్రిటన్ పర్యటనకు వచ్చారు. పార్లమెంటునుద్దేశించి ప్రసంగించారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలు పెట్టిన తర్వాత ఆయన బ్రిటన్‌కు రావడం ఇదే తొలిసారి. ఈ యుద్ధంలో రష్యా ఓడిపోతుందని జెలెన్‌స్కీ జోస్యం చెప్పారు. యుద్ధం మొదలైన మొదటి రోజు నుంచి తమకు అండదండగా ఉన్న బ్రిటన్ ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
‘‘ధైర్యసాహసాలు కలిగి ఉన్న మా సైనికుల తరఫున నేను మీ ఎదుట నిలబడి ఉన్నాను. ప్రస్తుతం మా సైన్యం శతఘ్నుల కాల్పుల మధ్య పోరాటం చేస్తోంది’’ అని జెలెన్‌స్కీ వెస్ట్‌మినిస్టర్ హాలులో సమావేశమైన బ్రిటన్ ప్రజాప్రతినిధుల సమక్షంలో చెప్పారు. అంతకు ముందు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌తో భేటీ అయ్యారు. ఉక్రెయిన్‌కి అన్ని విధాలా అండగా ఉంటామని సునాక్ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment