వాషింగ్టన్: అమెరికాలో అబార్షన్ హక్కుల రద్దు నిర్ణయంపై సుప్రీం కోర్టు ఇచ్చిన సంచలన తీర్పుపై 50 రాష్ట్రాల్లోనూ నిరసనలు కొనసాగుతున్న వేళ.. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. అమెరికా సుప్రీం కోర్టు తీర్పును ఆయన స్వాగతించారు. ఇది దైవ నిర్ణయమంటూ ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యనించిన ఆయన.. కాసేపటికే ఆ క్రెడిట్ తనకే దక్కాలంటూ కామెంట్ చేశాడు.
రాజ్యాంగాన్ని అనుసరించడం అంటే ఇదే. చాలా కాలం క్రితం ఇవ్వాల్సిన హక్కులంటూ.. అంటూ తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు. ఇక తాజా తీర్పు ఇచ్చిన న్యాయమూర్తుల్లో ముగ్గురిని ట్రంప్ అధికారంలో ఉండగానే నియమించారు. దీనిపై ఆయన స్పందిస్తూ.. అది తన చేతుల్లో లేదని, అంతా దైవ నిర్ణయమని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. అయితే..
కాసేపటికే మాట మార్చి.. అంతా తనకే దక్కాలంటూ కామెంట్ చేశారు. ‘నేటి నిర్ణయం(కోర్టు తీర్పు).. ఒక తరంలో జీవితానికి అతిపెద్ద విజయం. నేను వాగ్దానం చేసినట్లుగా అన్నింటినీ అందించడం వల్లనే ఇది సాధ్యమైంది. ముగ్గురు బలమైన రాజ్యాంగకర్తలను యునైటెడ్ స్టేట్స్ సుప్రీం కోర్ట్‌కు నేనే ధృవీకరించాను. అది గౌరవంగా భావిస్తున్నా. నా వల్లే ఇప్పుడు ఇలా తీర్పు రావడం సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నాడు ట్రంప్.
సుప్రీం కోర్టులో కన్జర్వేటివ్ మెజార్టీ కృషిలో.. ట్రంప్ ఎంతో కీలకంగా వ్యవహరించారు. నీల్ గోర్‌సచ్, బ్రెట్ కవానఫ్, అమీ కోనీ బారెట్ట్.. శుక్రవారం నాటి తీర్పులో క్రియాశీలకంగా వ్యవహరించాడు. తాజా తీర్పుతో.. ఇక నుంచి అమెరికా రాష్ట్రాలు అబార్షన్ చట్టం విషయంలో సొంత నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment