రాయిటర్స్ పోల్‌లో వెల్లడి
వాషింగ్టన్: అగ్రరాజ్యాన్నీ అప్పుల భారం వెన్నాడుతోంది. దాంతో దేశ అప్పుల భారాన్ని తగ్గించే నేతకు అమెరికా ఓటర్లు జై కొడుతున్నారు. డెమొక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్‌తో పోలిస్తే విదేశీ వస్తువులపై అధిక పన్నులు వేసి అమెరికా రుణ భారాన్ని తగ్గిస్తానన్న రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు ఎక్కువ మంది ఓటర్లు మద్దతు పలుకుతున్నట్లు తాజాగా రాయిటర్స్/ఇప్‌సోస్ పోల్ సర్వేలో వెల్లడైంది. ఇప్పటికే దేశ అప్పు ఏకంగా 35 లక్షల కోట్ల డాలర్లు దాటిపోయింది.
పన్నులు పెంచుకుంటే ప్రభుత్వానికి ఆదాయం పెరిగి పాత అప్పులను తీర్చుతుందనే భావనతో ఓటర్లు ట్రంప్ వైపు మొగ్గుచూపుతన్నారని సర్వే పేర్కొంది. ‘‘ఎగుమతులపై 10 శాతం పన్నులు విధిస్తానని, చైనా ఉత్పత్తులపై 60 శాతం దిగుమతి పన్ను విధిస్తానని హామీ ఇచి్చన ట్రంప్‌కు 56 శాతం మంది ఓటర్లు మద్దతు పలికారు. ఈ విషయంలో హారిస్ వైపు నిల్చున్న ఓటర్లు కేవలం 41 శాతం’’ అని సర్వే పేర్కొంది. పలు సర్వేల్లో హారిస్ ఆధిక్యతలో ఉన్నా ఏడు స్వింగ్ రాష్ట్రాలే విజేతను నిర్ణయిస్తాయని సర్వే అభిప్రాయపడింది.
Comments
Please login to add a commentAdd a comment