High taxes
-
‘టారిఫ్’పై ట్రంప్‌కే ఓటు
వాషింగ్టన్: అగ్రరాజ్యాన్నీ అప్పుల భారం వెన్నాడుతోంది. దాంతో దేశ అప్పుల భారాన్ని తగ్గించే నేతకు అమెరికా ఓటర్లు జై కొడుతున్నారు. డెమొక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్‌తో పోలిస్తే విదేశీ వస్తువులపై అధిక పన్నులు వేసి అమెరికా రుణ భారాన్ని తగ్గిస్తానన్న రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు ఎక్కువ మంది ఓటర్లు మద్దతు పలుకుతున్నట్లు తాజాగా రాయిటర్స్/ఇప్సోస్ పోల్ సర్వేలో వెల్లడైంది. ఇప్పటికే దేశ అప్పు ఏకంగా 35 లక్షల కోట్ల డాలర్లు దాటిపోయింది. పన్నులు పెంచుకుంటే ప్రభుత్వానికి ఆదాయం పెరిగి పాత అప్పులను తీర్చుతుందనే భావనతో ఓటర్లు ట్రంప్ వైపు మొగ్గుచూపుతన్నారని సర్వే పేర్కొంది. ‘‘ఎగుమతులపై 10 శాతం పన్నులు విధిస్తానని, చైనా ఉత్పత్తులపై 60 శాతం దిగుమతి పన్ను విధిస్తానని హామీ ఇచి్చన ట్రంప్‌కు 56 శాతం మంది ఓటర్లు మద్దతు పలికారు. ఈ విషయంలో హారిస్ వైపు నిల్చున్న ఓటర్లు కేవలం 41 శాతం’’ అని సర్వే పేర్కొంది. పలు సర్వేల్లో హారిస్ ఆధిక్యతలో ఉన్నా ఏడు స్వింగ్ రాష్ట్రాలే విజేతను నిర్ణయిస్తాయని సర్వే అభిప్రాయపడింది. -
టయోటా మోటార్స్ కీలక నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ కార్ల కంపెనీ టయోటా మోటార్ కార్పొరేషన్ కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. దేశంలో ఆటో పరిశ్రమపై అధిక పన్నుల విధానం కారణంగా మరింత విస్తరించబోమని ప్రకటించింది.ఇక మీదట ఇండియాలో విస్తరణ ప్రణాళికలపై దృష్టి లేదనీ, అయితే మార్కెట్లో ప్రస్తుతం కొనసాగుతామని జపాన్ కు చెందిన టయోటా తెలిపింది. భారతీయ పన్నుల విధానం వల్ల కార్ల ఉత్పత్తి చేసినా డిమాండ్ లేదని ఈ నేపథ్యంలో ఇండియాలో ఇక పెట్టుబడులు పెట్టేది లేదని స్పష్టం చేసింది టయోటా. కార్లు, మోటారు బైకులపై ప్రభుత్వం పన్నులు చాలా ఎక్కువగా ఉన్నాయనీ దీంతో తమ ఉత్పత్తి దెబ్బతింటోందనీ, ఫలితంగా ఉద్యోగావకాశాలు పడిపోతున్నాయని టయోటా కిర్లోస్కర్ మోటార్ వైస్ చైర్మన్ శేఖర్ విశ్వనాథన్ అన్నారు. భారీ పెట్టుబడుల తరువాత కూడా అధిక పన్నుల ద్వారా మిమ్మల్ని కోరుకోవడం లేదనే సందేశం అందుతోందని అని విశ్వనాథన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రధానంగా ఇన్నోవా, ఫార్చునర్ కార్లతో భారతీయ వినియోగదారులకు చేరువైన ప్రపంచంలోనే అతిపెద్ద నాలుగో కార్ల కంపెనీ టయోటా 1997లో ఇండియా మార్కెట్లోకి వచ్చింది.(సేల్స్ మరోసారి ఢమాల్, ఆందోళనలో పరిశ్రమ) అతిపెద్ద మార్కెట్ భారత్ నుంచి ఇప్పటికే (2017లో) అమెరికాకు చెందిన జనరల్ మోటర్స్ వైదొలిగింది.ఫోర్డ్ కంపెనీ కూడా విస్తరణ ప్రణాళికలకు స్వస్తి చెప్పి మహీంద్రాలో జాయింట్ వెంచర్ గా కొనసాగుతోంది. హార్లీ డేవిడ్ సన్ కూడా ఇదే బాటలో ఉన్నట్టు ఇటీవల నివేదికలు వెలువడ్డాయి. భారతదేశంలో కార్లు, ద్విచక్ర వాహనాలు, స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాలు సహా మోటారు వాహనాలపై 28 శాతం జీఎస్టీ అమలవుతోంది. ఇంజిన్ సైజు, పొడుగు, లగ్జరీ కేటగిరీ వారీగా 1 శాతం నుంచి 22 శాతం అదనపు పన్నులు భారం పడుతోంది. 1500 సీసీ ఇంజిన్‌తో పాటు, నాలుగుమీటర్ల పొడువు దాటిన ఎస్‌యూవీల దాదాపు 50శాతం వరకూ పన్నులు పడుతున్నాయని కంపెనీలు అంటున్నాయి. అయితే ఎలక్ట్రిక్ వాహనాలకు మినహాయింపు ఉంది. కరోనా సంక్షోభం కంటే ముందే ఆటో రంగం కుదేలైన సంగతి తెలిసిందే. అమ్మకాలు క్షీణించి, ఆదాయాలు లేక ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయిన ఆటో పరిశ్రమను కరోనా మరింత దెబ్బతీసింది. పలు కంపెనీలు దేశం నుంచి వైదొలగుతున్నాయి. ఈ మందగమనం నుంచి బయటపడేందుకు కనీసం నాలుగేళ్లు పడుందని అంచనా. అటు టయోటా తాజా నిర్ణయంతో మేకిన్ ఇన్ ఇండియాలో భాగంగా విదేశీ కంపెనీలను ఆకర్షించి, భారీగా పెట్టుడులవైపు చూస్తున్న బీజేపీ ప్రభుత్వానికి ఇది ఎదురు దెబ్బేనని ఆటో రంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఈ నెల 23న టయోటా అర్బన్ క్రూయిజర్ సబ్-4 ఎం ఎస్‌యూవీని లాంచ్ చేయనుంది. దీనికి సంబంధించిన ప్రీ బుకింగ్స్ ను ఇప్పటికే ప్రారంభించింది. -
నన్ను సంతృప్తిపరచడానికే ఒప్పందం
వాషింగ్టన్: తనను సంతృప్తిపరచడానికే భారత్ అమెరికాతో వాణిజ్య ఒప్పందం చేసుకోవాలని కోరుకుంటోందని ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. అమెరికా ఉత్పత్తులపై అధిక సుంకాలు విధించినందుకు భారత్‌పై మండిపడ్డారు. సుంకాల పెంపునకు సంబంధించి ట్రంప్ భారత్‌ను విమర్శించడం ఇటీవలి కాలంలో ఇది రెండోసారి కావడం గమనార్హం. ఈ సందర్భంగా శ్వేతసౌధంలో మీడియాతో మాట్లాడుతూ జపాన్, యూరోపియన్ యూనియన్, చైనా, భారత్‌లతో కూడా వాణిజ్య ఒప్పందాలపై చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. తమ ఉత్పత్తులపై అధిక సుంకాలు విధిస్తున్న భారత్‌ను ‘టారిఫ్ కింగ్’గా పేర్కొన్న ట్రంప్ హార్లే డేవిడ్సన్ బైక్‌లపై పెంచిన సుంకాలను ప్రస్తావించారు. సుంకాలు తగ్గిస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చినా, అవి ఇంకా అధికంగానే ఉన్నాయని అన్నారు. -
సామాజికాభివృద్ధితోనే బంగారు తెలంగాణ
ఆర్థిక రంగ నిపుణుడు హనుమంతరావు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఏర్పడిన మూడేళ్లలోనే జాతీయ సగటుకన్నా మెరుగైన ఆర్థిక వృద్ధిరేటును సాధించిందని ఆర్థిక రంగ నిపుణుడు సీహెచ్ హనుమంతరావు అన్నారు. ప్రజలు కలలుగన్న బంగారు తెలంగాణ సాకారాం కావాలంటే ఆర్థికాభివృద్ధితో పాటు సామాజిక అభివృద్ధి, మానవాభివృద్ధి ఎంతో ముఖ్యమన్నారు. శనివారం సెస్ ఆడిటోరి యంలో జరిగిన తెలంగాణ ఎకనామిక్ అసోసి యేషన్ (టీఈఏ) వార్షిక సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ విభజనకు ముందు నెలకొన్న రాజకీయ అనిశ్చితి, విద్యుత్ సమస్యల కారణంగా రాష్ట్ర ఆర్థిక వృద్ధిరేటు తగ్గిందని, కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక అనిశ్చితి తొలగి సుస్థిర పాలన కొనసాగుతోందని, విద్యుత్ కష్టాలు లేకపోవడం తో పరిశ్రమలు, పెట్టుబడులు రావడం తదితర కారణాలతో ఆర్థిక వృద్ధి రేటు మెరుగైందని తెలిపా రు. అయితే రాష్ట్రంలో పరిశ్రమలు, పెట్టుబడులు, మౌలికవసతులతో పెరిగిన వృద్ధిరేటు సామాజిక, మానవాభివృద్ధి వైపు మళ్లడం లేదని పేర్కొన్నారు. విద్య, వైద్య రంగాలను ప్రైవేటీకరణ చేస్తే నాణ్య మైన సేవలను ప్రజలు అందుకోవడం సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు. అంగన్వా డీలను ప్లే స్కూల్‌గా మార్చడం, ఆరో తరగతి నుంచి రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం ప్రాథమిక విద్యపైనా దృష్టి సారించాలన్నారు. అధిక పన్నుతోనే వెనుకబాటు... మొఘల్ చక్రవర్తుల కాలం నుంచి వ్యవసాయంపై పన్ను వసూలులో నెలకొన్న వ్యత్యాసం వల్లనే ఏపీ, తెలంగాణ ప్రాంతాల మధ్య వైరుధ్యం కనిపించిందని సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్ హెడ్ పి.గౌతమ్ అన్నారు. బ్రిటీష్ పాలనలో ఆంధ్రలో 10 శాతం పన్ను ఉంటే, తెలంగాణలో 50శాతం పన్ను వసూలు చేసేవారన్నారు. ఏపీ ఏర్పడిన తర్వాత కూడా పాలకులు పాత పన్ను విధానాన్నే కొనసాగించారని, ఫలితంగా తెలంగాణ నుంచి వచ్చిన రాబడిలోనూ కొంత మొత్తా న్ని ఆంధ్ర అభివృద్ధికి కేటాయించారన్నారు. ఈ విధానాన్ని రద్దు చేసిన కారణంగానే ఎన్టీఆర్‌కు తెలంగాణ ప్రజలు విశేషంగా మద్దతు తెలిపారన్నా రు. గత వందేళ్లలో తెలంగాణలో పన్ను విధానంపై అధ్యయనం చేసినట్లు తెలిపారు. ప్రణాళిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.పి.ఆచార్య, టీఈఏ అధ్యక్షుడు తిప్పారెడ్డి, కార్యదర్శి ముత్యం రెడ్డి, ఉపాధ్యక్షురాలు రేవతి, సెస్ చైర్మన్ రాధాకృష్ణ, డైరెక్టర్ గాలబ్ తదితరులు పాల్గొన్నారు.